రచయిత సి.ఎస్.రావు మృతి

రచయిత సి.ఎస్.రావు మృతి

          నాటక రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత చింతపెంట సత్యనారాయణరావు 14 ఏప్రిల్‌ 2020న హైదరాబాదులో తన 86వ ఏట అనారోగ్యంతో మరణించారు. ఆయన 20 డిశెంబరు 1935న కడియం దగ్గర మాధవరాయుడుపాలెంలో జన్మించారు.

          సి.ఎస్‌.రావు విద్యార్థి దశ నుండే బ్రహ్మసమాజము, ఆంధ్ర సారస్వత సభల ప్రభావంతో ఎదిగారు. రాజమండ్రిలో డిగ్రీ చదువుకునే రోజుల్లో స్టూడెంట్‌ ఫెడరేషన్‌లో పనిచేశారు. స్టూడెంట్‌ ఫెడరేషన్‌తో సంబంధాలు ఉండటంతో చాలాకాలం ఉద్యోగం రాలేదు. ఆ సమయంలో ఆయన వాళ్ళ వూరి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఆ అయిదు సంవత్సరాల పదవి తర్వాత సాగర్‌ యూనివర్శిటీలో ఎం.ఏ. చదివి, ఉద్యోగాన్వేషణలో హైదరాబాద్‌ చేరి ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశారు. అక్కడే నిఖిలేశ్వర్‌, జ్వాలాముఖి, చెరబండరాజు, నగ్నమునిలతో పరిచయం ఏర్పడి విరసం ఆవిర్భావ సభలో ఆ సంస్థలో చేరి, కొన్నేళ్ళపాటు సభ్యుడిగా కొనసాగారు. ఆయన 80 కథలు, 18 నవలలు, 25 నాటికలు, 25 నాటకాలు రాశారు. టి.వి.లో సీరియల్స్ తోపాటు ఆయన సినిమాలకు కథలను అందించారు. కొన్ని సినిమాలలో నటించారు. ‘గుమ్మడి గింజలు’ ఆయన మొదటి కథాసంకలనం. ‘ఊరమ్మడి బతుకులు’ మొదటి నాటకం. దీనినే తర్వాత సినిమాగా తీశారు.

          సి.ఎస్‌.రావు మృతికి సంతాపం తెలియచేస్తున్నాం. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాం.

admin

Related Posts

leave a comment

Create AccountLog In Your Account