– అక్షర, ౩వ తరగతి
అది నల్లమల అడవి. అక్కడ జంతువులు ఎప్పుడు సంతోషంగా ఉండేవి. అన్ని జంతువులతో పోలిస్తే కుందేలు అందరికన్నా తెలివిగా, ఉపాయంగా ఉండేది. అంతేకాదు భాషలు తెలిసినది. అంటే మనుషుల భాష ఇంకా 24 భాషలు కూడా వచ్చు. ఒకరోజు అది తిరుగుతూ ఉంటే అది కొంతమంది మనుషులు మాట్లాడుతుండగా వినసాగింది. ఒక మనిషి ఏమని చెప్పాడంటే, ఇక్కడ యురేనియం బాగా ఎక్కువగా ఉంది, ఇక్కడ మనం తవ్వడం మొదలుపెడదాం అని. సరేనని అందరూ కలిసి అన్నారు. ఈ కుందేలుకు మానవుల భాష కూడా తెలుసు కదా. యురేనియం తవ్వితే నీళ్ళు కలుషితం అయ్యి, క్యాన్సర్ వచ్చి అన్ని జంతువులు చచ్చిపోతాయి అని తన స్నేహితులకు వివరించింది అందరు కలిసి సింహం రాజు దగ్గరకు పోయి ఈ విషయం చెబుదామని నిర్ణయించుకున్నాయి. అవి రాజు దగ్గరకు పోయి యురేనియం తవ్వుతారు అని చెప్పింది. అప్పుడు సింహం వాళ్ళు తవ్వితే మనకేంటి అనింది దానికి కుందేలు వెంటనే యురేనియం తవ్వితే అన్ని జంతువులు చచ్చిపోతాయి అని వివరంగా చెప్పింది. సింహం వాళ్ళని ఒకసారి బెదిరించి చూద్దాం అని చెప్పింది. సరేనని అందరు కలిసి వెళ్ళి, వెళ్ళిపోమని చెప్పాయి. దానికి మనుషులు ఏమన్నారంటే మీరు ఏమి చేయలేరు. మా దగ్గర పెద్ద, పెద్ద గన్నులున్నాయి కాల్చామంటే అందరు ఒక్కసారిగా చచ్చిపోతారు మీరే వెళ్ళిపోండి అని చెప్పారు. అప్పుడు జంతువులు సమావేశం పెట్టుకున్నారు. కుందేలు మనం ఇంకొక్కసారి చెబుదాం విన్నారా! సరే, లేదంటే మనం ఒక లోతు గుంట తవ్వి దానిపైన మట్టిరంగులో ఉండే పట్టా పెడదాం అని చెప్పింది. మళ్ళీ ఇంకొక్కసారి అడిగారు. దానికి వాళ్ళు ఒక్కసారి చెప్పితే అర్థం కాదా! అన్నారు అంతే గన్నులు తీసుకున్నారు దూరం నుంచి కాల్చుతే ఏమి కాదు అందుకని దగ్గరకు వచ్చారు. గుంటలో పడ్డారు. అప్పుడు వాటికి సంతోషం వచ్చింది. ఆ తర్వాత రాజు కుందేలుని మంత్రిగా ప్రకటించాడు.