పిల్లల కవిత

– సంఘమిత్ర, బాలసంఘ సభ్యులు పిల్లలూ పాలపిట్టలు పిల్లలూ తాటిముంజలు పిల్లలూ చింపిరి గుడ్డలు పిల్లలూ ఆణిముత్యాలు పిల్లలూ వెన్నముద్దలు పిల్లలూ పంచదార చిలుకలు పిల్లలూ శిల్పి చెక్కిన బొమ్మలు పిల్లలూ మీరు పిడుగులు పిల్లలూ వాన చినుకులు పిల్లలూ శ్రమజీవుల చెమట చుక్కలు పిల్లలూ సముద్రపు ఆలుచిప్పలు పిల్లలూ మట్టిలోని మాణిక్యాలు పిల్లలూ చీపురుకట్ట పుల్లలు పిల్లలూ టపాకాయలు పిల్లలూ సంఘమిత్ర మొగ్గలు

– సంఘమిత్ర, బాలసంఘ సభ్యులు కరోనా వచ్చింది ముక్కుకు మాస్క్‌ వేసింది మనుషులను దూరం పెట్టింది షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోవద్దంది దండాలు పెట్టుకోమనింది లాక్‌డౌన్‌ పెట్టారు ఇంట్లో ఉండమన్నారు బయటికి రావద్దన్నారు వలస కూలీలకు కష్టాలు లాభదారులకు నష్టాలు మంచి తిండి తినమన్నారు తిండి దొరకక చస్తున్నారు

–  ఎస్. అశ్వని ఆడది అమ్మ వంటిది. కాని ఇప్పుడు ఆమె మీద ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి. ఎలా అంటే పూర్వం రామాయణంలో రాముడు సీతమ్మను అడవులపాలు చేశాడు కదండి. రామాయణంలో రాముడు దేవునిగా పేరు పొందినా కాని సీతమ్మను మాత్రం అగ్నిప్రవేశం చేయించాడు. అయినా చెప్పుడు మాటలు విని రాముడు అలా చేశాడు. కానీ మన తాత, నాయనమ్మలు మాత్రం అతన్ని ఇప్పటికీ దేవునిగానే కొలుస్తున్నారు. ఇది నిజమేనంటారా? రాముడు నిజంగా దేవుడా? అసలు
Complete Reading

–  అక్షర, ౩వ తరగతి అది నల్లమల అడవి. అక్కడ జంతువులు ఎప్పుడు సంతోషంగా ఉండేవి. అన్ని జంతువులతో పోలిస్తే కుందేలు అందరికన్నా తెలివిగా, ఉపాయంగా ఉండేది. అంతేకాదు భాషలు తెలిసినది. అంటే మనుషుల భాష ఇంకా 24 భాషలు కూడా వచ్చు. ఒకరోజు అది తిరుగుతూ ఉంటే అది కొంతమంది మనుషులు మాట్లాడుతుండగా వినసాగింది.  ఒక మనిషి ఏమని చెప్పాడంటే, ఇక్కడ యురేనియం బాగా ఎక్కువగా ఉంది, ఇక్కడ మనం తవ్వడం మొదలుపెడదాం అని. సరేనని
Complete Reading

Create AccountLog In Your Account