Related Posts
మూలం : అరవింద సిన్హా అనువాదం : వి. రాధిక
బీదా బిక్కీ
సాదాసీదా జనం మేం.
ఈ దేశంలో!
బహుదూరపు బాటసారులమై
కాలినడకన బేగు సరాయ్ చేరగలిగినప్పుడు
కాలే కడుపులతో బెనారస్ చేరగలిగినప్పుడు
నడిచి నడిచి మేం బిడ్డా పాపలతో
మాన్సర్, రాంచీ, బస్తర్…. దేశంలో ఏ
మూలకైనా
దూరదూర తీరాలకు మేం చేరగలిగినప్పుడు
గుర్తుంచుకోండి మీరంతా!
మా కళ్ళముందు తెరలు తొలగుతున్నాయి
నేడు
వెల్లువలా ముందుకు సాగే పోరాట తరంగాలమై
కాలం కట్టిన కత్తుల వంతెనలను దాటి
తప్పక ఏదో ఒకనాటికి
దూరాలన్నిటినీ అధిగమించి
సామ్యవాద గమ్యాన్ని మేం చేరడం తథ్యం!