ప్రకృతి పాఠాలు

ప్రకృతి పాఠాలు

– ‘బాలబంధు’ అలపర్తి వెంకట సుబ్బారావు

ప్రకృతే చెబుతోంది

పాఠాలు మనకు !

సారాంశమును తెలిసి

సాగించు బ్రతుకు ॥

సూర్యుడే శ్రమశక్తి

సూచించు మనకు !

చంద్రుడే సౌమ్యతకు

కేంద్రమ్ము మనకు ॥

సముద్రం ధైర్యాన్ని

సమకూర్చు మనకు !

చేరు పై స్థాయికని

చెప్పేను నింగి ॥

ఓర్పుగా ఉండమని

నేర్వేను నేల !

పరులకై తను తానె

బలియగును అగ్ని ॥

పరుల మేలునుకోరి

కురిసేను వాన !

విశ్వహిత మాశించి

వీచేను గాలి ॥

కూత నేర్పెను కోడి

ఈత నేర్పెను చేప

పాట నేర్పెను పికము

ఆట నేర్పెను నెమలి ॥

admin

leave a comment

Create Account



Log In Your Account