పాదాలు

పాదాలు

దివికుమార్‌

పల్లెలలో బతకలేక వలసపోయిన పాదాలు

నగరాల్లో చావలేక తల్లి ఒడికై తపించి యింటి బాట పట్టిన పాదాలు

చావుని ధిక్కరిస్తున్న పాదాలు

ఆధునిక మహాయాత్రకు

చరిత్ర నిర్మాతలైన పాదాలు

దండి యాత్రలను ఆయోథ్య జాతరలను తెర వెనుకకు నెడుతున్న పాదాలు

ఏ శక్తి పిడికిలైతే దోపిడీశక్తులు గజగజలాడతాయో

ఏ నెత్తుటి చారికలు మరో చరిత్రకు దారి చూపుతాయో

వేటి సంకల్ప బలానికి ప్రపంచం తల దించుకుంటోందో ఆ శ్రమజీవన పాదాలకు మనసా వాచా కర్మేణా పాదాభివందనాలు!!

admin

leave a comment

Create AccountLog In Your Account