‘‘తాడిచెట్టు ఎందుకు ఎక్కావు అంటే, దూడ మేత కోసం’’ అని వెనుకటికొకరు జవాబు చెప్పారట! తెలుగు మాధ్యమం రద్దు దేనికి అంటే ‘‘ప్రభుత్వ బడులలో చదివే బడుగుందర్నీ డాక్టర్లుగా, ఐ.ఎ.ఎస్. అధికార్లుగా చేయటానికి’’ – ఇదీ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ జవాబు. ఈ సందర్భంలోని ఒక మోసపూరిత మెలిక ఏమిటంటే, తెలుగు మాధ్యమం రద్దు అనేది వినపడనీయకుండా చదువులన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే అనటం! నిజానికి యిప్పటికే ప్రభుత్వ బడులన్నీ ఆంగ్లం – తెలుగు రెండు మాధ్యమాలలో సాగుతున్నాయి. ఇక
Complete Reading
– దివికుమార్ పల్లెలలో బతకలేక వలసపోయిన పాదాలు నగరాల్లో చావలేక తల్లి ఒడికై తపించి యింటి బాట పట్టిన పాదాలు చావుని ధిక్కరిస్తున్న పాదాలు ఆధునిక మహాయాత్రకు చరిత్ర నిర్మాతలైన పాదాలు దండి యాత్రలను ఆయోథ్య జాతరలను తెర వెనుకకు నెడుతున్న పాదాలు ఏ శక్తి పిడికిలైతే దోపిడీశక్తులు గజగజలాడతాయో ఏ నెత్తుటి చారికలు మరో చరిత్రకు దారి చూపుతాయో వేటి సంకల్ప బలానికి ప్రపంచం తల దించుకుంటోందో ఆ శ్రమజీవన పాదాలకు మనసా వాచా కర్మేణా
Complete Reading
మూడు నెలలుగా కరోనా మహమ్మారి మానవ ప్రపంచాన్ని గిజగిజలాడిస్తోంది. మానవ సమాజంలో వర్గ వైరుధ్యాలు తలెత్తిన నాటి నుండీ సామాజిక వైరుధ్యాలే ప్రధానంగా సాగుతూండిన చరిత్ర ఆకస్మికంగా మానవ సమాజమంతా ప్రకృతి విలయమైన కరోనాపైకి ఎక్కుపెట్టాల్సిన స్థితి ఏర్పడిందా అన్నట్లు పరిస్థితులు కదలాడసాగాయి. అయితే ప్రపంచాధిపత్యశక్తులు ఈ పాప పంకిలాన్ని ఏ దేశం నెత్తిన రుద్దాలా అనే పోటీలో వున్నాయి. ప్రకృతి విధ్వంసమూ, పర్యావరణ సమస్యలు కలగలిసి ఈ మహావిపత్తుకి కారణమయినట్లు ఒక సాధారణ భావన వ్యక్తమయింది.
Complete Reading
ఉదయం చూస్తే మంచు! మధ్యాహ్నం వరకు వడగాడ్పులు! అంతలోనే సాయంత్రం దట్టంగా కమ్ముకున్న మబ్బులు – ఉరుములు – మెరుపులు – బోరున వర్షం!! రాత్రి గడగడలాడించే చలి!!! ఒక ఏడాది కాలంలో రావాల్సిన మూడు కాలాలూ ఒక్క రోజులోనే – కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే! రుతువుల్ని ధ్వంసం చేస్తుంది ఎవరు? ప్రకృతి నియమాలను చిందరవందర చేసిందెవరు? ఎక్కడెక్కడో వైరస్‌లను తట్టి లేపుతుంది ఎవరు? పర్యావరణ విధ్వంసం ఎవరి ఖాతాలో జమ చేయాలి?
Complete Reading