Related Posts
మానవ వికాస వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు, గాయకుడు నాస్తిక వెంకన్న 7-9-2020న హైదరాబాద్‌లో కరోనా వ్యాధితో మరణించారు. ఆయన కరీంనగర్ జిల్లా మంధని గ్రామంలో జన్మించారు.
మహిమలు, మూఢనమ్మకాల బండారాన్ని బట్టబయలు చేసే ఇంద్రజాలికుడిగా, డప్పు వాయిస్తూ మూఢనమ్మకాలను పారద్రోలుతూ, మూఢత్వాన్ని ప్రశ్నిస్తూ పాటలు పాడే గాయకుడిగా రెండు తెలుగు రాష్ట్రాలలో కృషిచేశారు. వెంకన్న మరణానికి జనసాహితి సంతాపం ప్రకటిస్తూంది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేస్తూంది.