బహుజన ఉద్యమ నాయకుడు ఉ.సా. మరణానికి సంతాపం

బహుజన ఉద్యమ నాయకుడు ఉ.సా. మరణానికి సంతాపం

          బహుజన ఉద్యమకారుడిగా కృషిచేస్తూన్న ఉప్పుమావులూరి సాంబశివరావు 24 జూలై 2020న కరోనా వ్యాధితో హైదరాబాద్‌లో మరణించారు. ఆయన గుంటూరుజిల్లా బ్రాహ్మణ కోడూరులో జన్మించారు.

          ఉ.సా. తెనాలిలో డిగ్రీ చదివే రోజుల్లో (1973-74) ఏర్పడిన ‘అరుణోదయ సాంస్కృతిక సంస్థ’లో చేరి సామాజిక అంశాలపై కళారూపాలను నేర్చుకుంటూ, నేర్పుతూ – వివిధ సమస్యలపై పాటలు రాశారు. 1978లో జనసాహితి ఏర్పడినపుడు చురుకైన కార్యకర్తగా కృషిచేస్తూ పలు జనం పాటలు రాశారు. జనసాహితి సంస్థ గీతంగా పాడుకునే ‘‘మేం పాడుతాం ప్రజల పాట పాడుతాం’’ పాటను ఆ రోజుల్లో ఉ.సా. రాశారు. సన్నశెట్టి రాజశేఖర్‌తోపాటు సంస్థ తరఫున కొండమొదలు గిరిజన ఉద్యమ ప్రాంతాలలో వున్న గిరిజనుల కళలను, సంస్కృతిని అవగాహన చేసుకుంటూ పాటలను సేకరించి, రికార్డు చేశారు. వాటిని ‘జానపద గేయాలు, జనం పాటలు’ జనసాహితి పుస్తక రూపంలో ప్రచురించింది. ఆయన కాలక్రమంలో శ్రామిక విప్లవ బాటకు దూరమయ్యారు. వారి అకాల మరణం చాలా బాధాకరం. వారు కృషిచేస్తున్న బహుజన ఉద్యమానికి తీరని లోటు. ఉ.సా. మరణానికి జనసాహితి సంతాపం ప్రకటిస్తూంది.

admin

Related Posts

leave a comment

Create Account



Log In Your Account