ప్రజాకళాకారుడు వంగపండు ప్రసాద్ కు జోహార్లు

ప్రజాకళాకారుడు వంగపండు ప్రసాద్ కు జోహార్లు

          ప్రజాకళాకారుడు వంగపండు ప్రసాద్‌ గుండెనొప్పితో విజయనగరం జిల్లా పార్వతీపురం వై.కే.ఎం. నగర్‌లో 4-8-2020న మరణించారు. ఆయన విజయనగరంజిల్లా పార్వతీపురం మండలంలోని బొండపల్లి గ్రామంలో జన్మించారు.

          వంగపండు ఆదివాసీలు, ఇతర పీడిత ప్రజల సమస్యలు, బాధలు కన్నీళ్ళతోపాటు పోరాటాలను కూడా గానం చేస్తూ అనేక పాటలు రాశారు. ఆయన రచించిన ‘సుత్తీ కొడవలి ఎత్తిన జెండా’ పాటను 1977లో ప్రజాసాహితి ప్రచురించింది. ఎమర్జన్సీ కాలంలో ఆయన రచించిన ‘భూమి భాగోతం’ కళారూపాన్ని అనేక బృందాలు, ప్రదర్శించాయి. శ్రీకాకుళ గిరిజన సాయుధ పోరాటాన్ని గానం చేస్తూ రచించిన ‘సిక్కోలు యుద్ధం’ నృత్యరూపకం ఈనాటికీ ప్రదర్శింపబడుతోంది.

          వంగపండు విశాఖ షిప్‌యార్డులో ఉద్యోగం చేస్తూండగా జన నాట్యమండలితో ఏర్పడిన పరిచయాలతో ఉద్యోగానికి రాజీనామా చేసి జన నాట్యమండలి కళాకారుడిగా అనేక విప్లవ ప్రజా గీతాలను రచించి గానం చేశారు. విప్లవ సినిమాలకు ఆయన రాసిన పాటలు ప్రజాదరణ పొందాయి. ఆయన జీవితం చివరి రోజుల్లో పాలకవర్గ పార్టీల వేదికలపై కళాప్రదర్శనలిచ్చినప్పటికీ ఆయన జీవితంలో చాలాభాగం శ్రమజీవుల గానానికి, ప్రజా చైతన్యానికి, ఉద్యమాలకి అంకితం చేశారు. వంగపండు ప్రసాద్‌ మరణానికి జనసాహితి సంతాపం ప్రకటిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తోంది.

admin

Related Posts

leave a comment

Create Account



Log In Your Account