కలువకొలను సదానంద

కలువకొలను సదానంద

          ప్రముఖ రచయిత, చిత్రకారుడు కలువకొలను సదానంద తన 81వ ఏట 25 ఆగస్టు 2020 ఉదయం పాకాలలో మరణించారు. ఆయన 22 ఫిబ్రవరి 1939లో పాకాలలో జన్మించారు.

          సదానంద కథ, నవల, గేయాలు మొదలగు ప్రక్రియలలో బాలసాహిత్యాన్ని ప్రధానంగా రచించారు. చిత్రకారునిగా, కార్టూనిస్టుగా కూడా పాఠకులకు వీరు పరిచయం. ‘రక్తయజ్ఞం’, ‘పైరుగాలి’, ‘మాయకంబళి’, ‘నవ్వే పెదవులు, ఏడ్చే కళ్ళు’ వీరి కథాసంపుటాలు. ‘గాడిద బ్రతుకులు’, ‘గందరగోళం’ వీరి నవలలు. ఆయన రచించిన ‘అడవి తల్లి’ నవలకు సాహిత్య అకాడమీ అవార్డు లభించినది. 1976లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు వీరి ‘నవ్వే పెదవులు, ఏడ్చే కళ్ళు’ కథాసంపుటానికి వచ్చింది. బాలసాహిత్య రచయితగా పేరుపొందారు.

          ఉత్తమ ఉపాధ్యాయునిగా కూడా సత్కారాన్ని అందుకున్న వీరి మరణానికి సంతాపం ప్రకటిస్తున్నాం.

admin

Related Posts

leave a comment

Create AccountLog In Your Account