శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రాధిపతిగా చేసిన ఆచార్య పి.సి. నరసింహారెడ్డి తన 77వ ఏట 19 అగస్టు 2020న హైదరాబాదులో మరణించారు. ఆయన గద్వాల సమీపంలోని గట్టు మండలంలోని పెంచుకలపాడులో 3 జులై 1943లో జన్మించారు.
యువకునిగా వీరు ‘‘తిరగబడు’ కవుల్లో ఒకరిగా ఆ కవితా సంకలనంలో ‘ఐ’ అనే కలంపేరుతో ‘తిరగబడు’ అనే కవిత రాశారు. విరసం ఏర్పాటుతో సంబంధాలు వున్నా, సభ్యత్వం తీసుకోలేదు. ‘శుక్తి’ పేరుతో చిత్రకారునిగా చిత్రాలు గీశారు. ‘సృజన’ పత్రిక అక్షరాలు వీరు రాసినవే. శ్రీశ్రీ ‘మరో ప్రస్థానం’ ముఖచిత్రం వీరిదే. నార్ల చిరంజీవి ‘కొమ్మలు – రెమ్మలు’ కవితలకు వేసిన చిత్రాలను బాపు మెచ్చుకున్నారు. చలసాని ప్రసాదరావు సంపాదకత్వంలో వచ్చిన ‘కళ’ కొన్ని సంచికలకు బొమ్మలు వేసారు.
వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత ఆయన కేవలం భాషాశాస్త్రానికి పరిమితమైపోయారు. వారి మరణానికి ‘ప్రజాసాహితి’ సంతాపం ప్రకటిస్తూంది.