Related Posts
– జ్యోత్స్న
రైతు దేశానికి వెన్నుముక
కాని ఇప్పుడు కర్రెముక
అలాంటి వెన్నుముకను కర్రెముక చేస్తున్నారు
కర్రెముకలను తొక్కి, నలిపేసి,
పిండి, పక్కకు పడేస్తున్నారు
రైతు ఎవరికోసం కష్టపడుచున్నాడు
మనకోసం, దేశంకోసం, ప్రపంచం కోసం
ఎండనక, వాననక కష్టపడి
నానా తిప్పలు పడేవాడు రైతు
పంట చేతికి వస్తే ఆనందం లేక
అది అమ్ముడౌతుందో లేదో అనే భయంతో
పంట పండిస్తున్నాడు
రైతుకు ఏంటి కర్మ
కరోనా మహమ్మారి వచ్చింది
ఎక్కడి పనులు అక్కడే ఆగాయి
కాని రైతు కష్టం ఆగలేదు
ఎలాంటి మహమ్మారి వచ్చిన
రైతు కష్టం ఆగదు
జై కిసాన్