సంపన్నులైన విజేతలే సమస్తం హస్తగతం చేసుకుంటారు

ప్రపంచాన్ని మార్చుతామంటున్న శ్లిష్టవర్గపు కపటత్వం ఆనంద్‌ గిరిధర్‌దాస్‌ ఆంగ్లంలో రాసిన ”Winners Take All” పుస్తక పరిచయం పరిచయకర్త : జి.వి. భద్రం                 ప్రపంచమంతటిలోనూ అత్యంత సంపన్నులుగా వున్న పిడికెడుమంది వ్యక్తులు తమ దాతృత్వం ద్వారా ప్రపంచాన్ని మార్చివేసే కృషిని కొనసాగిస్తున్నారు. వివిధ ఫౌండేషన్లను, ట్రస్టులను, ఆలోచనాపరుల – మేధావుల ఆలోచనా సమ్మేళనాలను, వేదికలను ఏర్పాటు చేసి వాటి ద్వారా తాము ప్రపంచాన్ని మార్చివేస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. తాము చేబడుతున్న కార్యకలాపాల ద్వారా ప్రపంచమంతటా మిలియన్ల
Complete Reading

– డాక్టర్‌ భూసురపల్లి వెంకటేశ్వర్లు           నాగరికత పేరుతో ప్రబలుతున్న పరాయీకరణకు దూరంగా కొండల్లో కోనల్లో బతకుతూ, స్వేచ్ఛా వాయువుల్లో పరిభ్రమిస్తూ, స్వచ్ఛ జీవన స్రవంతిలో ఊగితూగే ఆదివాసులు అరచినా, అరచేత్తో చరిచినా కృతకం కాని నాదం కొండలు దద్దరిల్లేలా ప్రతిధ్వనిస్తుంది. వారెన్నడూ లక్ష్య లక్షణాలు తెలిసి ఎలుగెత్తి పాడిన వారుకాదు. తాళ భరతం నేర్చుకొని లయలు మార్చి విన్యాసాలు పలికించడం తెలిసిన వారుకాదు. ఏ ఎండకా గొడుగు పట్టలేని స్వేచ్ఛా జీవులకు లాలనలూ, లావణ్యాలూ ఏం
Complete Reading

– పల్లిపట్టు ప్రదర్శించడం బాగానే వుంటాదిఅన్నీ అంగట్లో సరుకైన కాలంలోఅన్నిటికీ అమ్ముడుపోవడం అలవాటైన రోజుల్లోదేన్నైనా పేరుపెట్టిపిలిచిపెద్దపెద్ద మాటల్లో పొగిడి ప్రదర్శించడం గొప్పగానే వుంటాది రంగురంగుల బొమ్మలాటనోరకరకాలబురిడీల గారడీ మాటనోనలుగురు మెచ్చుకునేలానాలుగు రూకలు మూటకట్టుకునేలానాటకాన్ని ప్రదర్శించడం నాటకీయంగానే వుంటాది లోపాలు కనిపించకుండాదీపాల వెలుగులో నటించే ముఖాలమైనవ్వో ఏడుపో పులుముకునిదీపంచుట్టూ పేడబురగలా తిరిగే వీరభక్తినోఏ దేముడేమీ చేయలేని రోగభయాన్నోవొంటినిండా కప్పుకునిఇళ్లముందు ప్రదర్శించడం బలేగానే వుంటాది చూరుకిందోవసారాలోలోజిగేల్మంటూ కులికే వరండాలోనోఅద్దాలుపొదిగిన అంతస్తుల భవంతుల బాల్కనీల్లోనోఎదో ఒకటి ప్రదర్శించడం బ్రహ్మాండంగానే వుంటాది ఇల్లూ
Complete Reading

– నౌగాపు           అతను పరిగెడుతూ ఉన్నాడు….           ఊపిరి ఆడడం లేదు, శ్వాస అందడం లేదు, శరీరం సచ్చు బడింది, ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు, ఎంతవరకు పరిగెట్టాలో తెలియటం లేదు….           గతంలో ఎంతగానో పరిగెట్టాడు. ఆ అనుభూతి వేరు.           చిన్నప్పుడు ఆటలాడుతూ పరిగెట్టాడు, సంతోషం పొందాడు. ఆ పరుగులో కాలు జారి పడ్డాక బోవురు మన్నాడు.           బస్సు అందుకోవటం కోసం పరిగెత్తాడు, అందుకున్నాక తృప్తి పొందాడు, అందనప్పుడు బాధపడ్డాడు.
Complete Reading

స్వేచ్ఛానువాదం : బి.ఎస్‌.రాజు కార్మికుడు   :    అయ్యా! సోషలిస్టు గారు! ఈ భూమ్మీద యజమానులనే వారే లేకపోతే, నాకు పని ఎవరిస్తారు? సోషలిస్ట్‌      :    అవును మిత్రమా! నన్ను తరచుగా నలుగురు అడిగే ప్రశ్నయే ఇది. దీని సంగతేమిటో చర్చించాల్సిందే సుమా! పని చేయాలంటే మూడు వ్యవస్థలు అవసరం – కర్మాగారం, యంత్రాలు, ముడిపదార్థాలు. అవునా ? కార్మికుడు   :    అవును. సోషలిస్ట్‌      :    కర్మాగారాన్ని ఎవరు నిర్మిస్తారు ? కార్మికుడు   :    తాపీ పనివారు, ఇతర
Complete Reading

Create AccountLog In Your Account