Related Posts
– ఆర్కేయం
తెలుగక్షరాలు యాభై ఆరే
గుణింతాలను, వత్తులను
హ్రస్వాలను, దీర్ఘాలను
కలుపుకొంటూ కదంతొక్కుతూ
పదాలై వాక్యాలై
పదుల్లో వేలల్లో
లక్షల్లో కోట్లల్లో
కోటానుకోట్లలో
రాతలై భావాలై
ప్రజ్వరిల్లే విప్లవ శంఖారావాలై
కోటానుకోట్ల తెలుగు
వారి గుండెల్లో
మస్కిష్కపు పొరల్లో
నిక్షిప్తమై… భావజాలమై
కాగితం మీద రాలితే
తెలుగు వెలుగు ప్రచండ కాంతితో పరిఢవిల్లదా!!