వెర్రిగోవులు

– కసిరెడ్డి గౌరీశంకర్        ‘‘ఓలమ్మో! ఓర్నాయనో! యెంత పన్జేసిందిరా మాయదారి గొడ్డూ! దీన్నోట్లో మన్ను వడ…. దీని కాళ్ళిరగ…. బంగారవంటి పంటని మింగేసిందిరా తల్లోయ్‌! ఇప్పుడు నానేంజెయ్యాల? ఎందల పడాల దేవుడోయ్‌….?’’        ‘‘యేంది రావులమ్మా…. యేందట్టా శోకాలెడతా వుండావ్‌ యామైందే?’’        ‘‘ఇంకేమవ్వాలి దేవుడోయ్‌…. యేపుగా ఎదిగొచ్చిన నా ఆవాలు పంటని గొడ్లు మేసీసినాయే తల్లా…. యెవురికి జెప్పుకనే తల్లా…?’’        ‘‘అన్నన్నా యెంత పన్జేసినాయమ్మా దిక్కుమాలిన గొడ్లు! నిన్నటికి నిన్న మంకు చిమ్మాచెలం,
Complete Reading

– డా॥ పి.వి. సుబ్బారావు బతుకంతా బొట్లు బొట్లుగా కాలపు వేళ్ళ సందుల్లోంచి మెలమెల్లగా జారిపోతుంటే కళ్ళల్లో నింపుకున్న నిరాశా శకలాల తడిపొరల్లోంచి అప్పుడప్పుడూ తొంగి చూచే గతం ఊబిలోంచి బయటపడ్డానికి నిస్సహాయంగా ఆక్రందించే జీరబోయిన చీకటి గొంతు కేక! ఆత్మీయంగా వినడానికీ అభయ హస్తమందించి బయటకు లాగడానికి ఎవరూ లేరని తెలిసినా లోపొరల్లో ఎక్కడో పరుచుకొన్న ధైర్యపు తెర వెలుగును సంగ్రహించుకొంటూ ఆశాశ్వాసల రంగుల్ని ముద్దలు ముద్దలుగా పులుముకొంటూనే వుంటుంది ఒక సర్రియలిస్టు చిత్రంలా గడచిన
Complete Reading

          ఈ నెల మొదటివారంలో ప్రధాని నరేంద్రమోడీ రిజర్వేషన్ల దాడి (ప్రతిపక్షాలపై సర్జికల్‌ స్ట్రైక్‌) చేయటానికి ముందే వెలువడిన జనవరి ‘ప్రజాసాహితి’ సంపాదకీయంలో వాక్యాలను ఒక్కసారి గుర్తుచేస్తాను. ‘‘దళితులకు కేటాయించిన రిజర్వేషన్లతో వారి నిరుద్యోగ సమస్య పరిష్కారమయినట్లేనని ప్రచారం చేసిన పాలకవర్గాలే, అగ్రకులాలలోని మధ్యతరగతి ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యకు దళితులకిచ్చిన రిజర్వేషన్లే కారణమన్నట్లు చెప్పారు. నిజానికి రిజర్వేషన్లనేవి ఉద్యోగావకాశాలను పెంచవు. పంచుతాయి. అంతవరకే! నిరుద్యోగానికి మూలకారణమైన వ్యవసాయ – పారిశ్రామికరంగాల సంక్షోభాన్ని పరిష్కరించకుండా,  ప్రశ్నించే యువతరాన్ని పక్కదారి
Complete Reading

ప్రజల్ని చైతన్యవంతం చేసే సినిమాలు నిర్మించిన, భారతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా విస్తరింపచేసిన బెంగాలీ సినీ దర్శకులు మృణాల్‌సేన్‌ మరణానికి జనసాహితి సంతాపం ప్రకటిస్తోంది. ఆయన 1923 మే 14న తూర్పుబెంగాల్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌)లోని ఫరీదాపూర్‌లో జన్మించారు. 2018 డిసెంబర్‌ 30న కలకత్తాలోని భొవానిపురేలో తన 95వ ఏట మరణించారు. మృణాల్‌సేన్‌ 1956లో మొదటిసినిమా ‘రాత్‌భూమి’ని తీశారు. మొదట్లో సంప్రదాయ ధోరణిలో కథా కధనాలతో సినిమాను నిర్మించినా ఆ తర్వాత సామాజిక అంతరాలను చూపెడుతూ, అప్పటి సామాజిక,
Complete Reading

– ఆర్కేయం తెలుగక్షరాలు యాభై ఆరే గుణింతాలను, వత్తులను హ్రస్వాలను, దీర్ఘాలను కలుపుకొంటూ కదంతొక్కుతూ పదాలై వాక్యాలై పదుల్లో వేలల్లో లక్షల్లో కోట్లల్లో కోటానుకోట్లలో రాతలై భావాలై ప్రజ్వరిల్లే విప్లవ శంఖారావాలై కోటానుకోట్ల తెలుగు వారి గుండెల్లో మస్కిష్కపు పొరల్లో నిక్షిప్తమై… భావజాలమై కాగితం మీద రాలితే తెలుగు వెలుగు ప్రచండ కాంతితో పరిఢవిల్లదా!!

సామాజిక చలనక్రమంలో సంస్కృతి నిర్మాతలు ముగ్గురే. శాస్త్రవేత్త – కళాకారుడు – శ్రామికుడు. నూతన సృజనకు ఆలోచన చేసేవాడు శాస్త్రవేత్త. ఆ ఆలోచనను అందంగా, ఆకర్షణీయంగా, సృజనాత్మకంగా ప్రచారంలో పెట్టేవాడు కళాకారుడు. దాన్ని భౌతిక ఆచరణశక్తితో వాస్తవిక ప్రపంచంలోకి నేల మీదకి దించి రూపకల్పన చేసి చూపించేవాడు శ్రామికుడు. ప్రకృతితో ఐక్యత – సంఘర్షణల ఫలితంగా అందివచ్చిన విజ్ఞాన సంపదను శ్రామికుల నుండి శ్రామికులకు అనే గతితార్కిక క్రమమే సామాజిక వికాసం. ఈ మౌలిక సామాజిక అవగాహనలోంచి
Complete Reading

Create AccountLog In Your Account