సాహిత్య, సాంస్కృతిక సామాజికాంశాలు

సాహిత్య, సాంస్కృతిక సామాజికాంశాలు


గంగ ప్రక్షాళన కోరుతూ దీక్ష చేపట్టి కనిపించకుండా పోయిన మరొక ఆధ్యాత్మికవేత్త ` కుమారుని దీక్షను కొనసాగిస్తానంటున్న తల్లి
గంగానది ఎగువన నిర్మిస్తున్న జ విద్యుత్‌ ప్రాజెక్టు కారణంగా నదీ ప్రవాహానికి ఆటంకాలేర్పడుతున్నాయని, కనుక ఆ నిర్మాణాను తక్షణమే నిుపుచేయాని కోరుతూ గోపాల్‌ దాస్‌ దీక్ష చేపట్టాడు. డిశంబరు 6వ తేదీ నుండి ఆయన కనిపించకుండాపోయారు. కుమారుని జాడ తెలియజేయాని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఆయన తల్లి శకుంతలాదేవి రిషీకేష్‌లో దీక్షలో కూర్చున్నారు.
నభై యేండ్ల గోపాల్‌దాస్‌ జూన్‌ 24 నుండి గంగానది ప్రక్షాళన కోరుతూ 110 రోజు ఆమరణ దీక్ష చేశారు. అప్పట్లో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో రిషీకేష్‌లోని ఎయిమ్స్‌లో చేర్చారు. ఆరోగ్యం కుదుటపడ్డాక తిరిగి ఆశ్రమానికి చేరుకున్నారు.
‘‘ఆయన హత్య చేయబడినట్లు మాకు అనుమానం కుగుతోంది. ఆయన కనిపించకుండా పోవడానికి వేరే కారణాలేమీ లేవు’’ హరిద్వార్‌లోని మాత్రిసదన్‌ ప్రధాన నిర్వాహకు స్వామి శివానంద్‌ అన్నారు. ఈ ఆశ్రమం నుండే ఉత్తరాఖండ్‌ పోలీసు గోపాల్‌దాస్‌ను తీసుకెళ్ళి, డెహరాడూన్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలో డిశంబరు 4న చేర్చారు. ఆయన వైద్య కళాశాను వదలి బయటకు వెళ్ళినట్లుగా అక్కడ ఏర్పాటుచేసిన సిసిటివిలో డిశంబరు 6న రికార్డు అయింది. అప్పటి నుండి ఆయన కనిపించడంలేదు.
ఈ మాత్రిసదన్‌ నుండే గతంలో కొందరు పేరుపొందిన ఆధ్యాత్మికవేత్తు గంగానది ప్రక్షాళన కోరుతూ ఆమరణ దీక్షు చేశారు. 2011లో రెండు నెలకు పైగా దీక్షచేసి స్వామి నిగమానంద్‌ ప్రాణత్యాగం చేసారు. ఐఐటి రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, ఆధ్యాత్మికవేత్తగా మారిన ప్రముఖ పర్యావరణవేత్త జి.డి. అగర్వాల్‌ జూన్‌ 22 నుండి 111 రోజుపాటు ఆమరణ దీక్ష చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించినప్పటికీ కేంద్రం స్పందించకపోవడంతో మంచినీరు కూడా త్రాగకుండా అక్టోబరు 11న మరణించారు.
అగర్వాల్‌ మరణానికి రెండురోజు ముందు, అక్టోబరు 9న కేంద్ర ప్రభుత్వం తరఫున రహదార్లు మరియు రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఒక నోటిఫికేషన్‌ విడుద చేశాడు. దాని ప్రకారం గంగానది ఉపనదుపై కట్టిన జవిద్యుత్‌ ప్రాజెక్టు నుండి తగినంత నీటి ప్రవాహం ఎ్లప్పుడూ విడుద చేయబడుతూ ఉంటుందని. అయితే ఇది కేవం కంటితుడుపు చర్య మాత్రమే.
హరిద్వార్‌ జిల్లా మేజిస్ట్రేటు వారికి హిందూ దినపత్రిక కార్యాయం నుండి గోపాల్‌దాస్‌ కనిపించకుండా పోవడంపై ఎన్ని ఫోన్‌కాల్స్‌ చేసినా స్పందన ఏమీలేదు.
‘‘గంగానది ప్రక్షాళన కోరుతూ నా కుమారుడు దీక్షను చేపట్టాడు. అతను కనిపించకుండాపోయాడు. దానిని నేను కొనసాగిస్తాను. నాకు నా కుమారునితో పాటు గంగానది ప్రక్షాళనకు సంబంధించిన చట్టం కూడా కావాలి’’ అంటున్నారు 60 సం॥ శకుంతలాదేవి.
గంగానది ఉపనదులైన అకనంద, భాగీరధి, మందాకిని, పిండార్‌ నదుపై కట్టిన జవిద్యుత్‌ ప్రాజెక్టుతో ఈ మాత్రిసదన్‌ దీక్షన్నీ ముడిపడి వున్నాయి. ఈ ఉపనదు మూంగానే గంగానదిలో నిరంతరాయంగా ప్రవాహం కొనసాగుతుంది. ఈ ప్రాజెక్టు మూంగా గంగ జీవనది స్థాయిని కోల్పోనున్నదని పర్యావరణవేత్తు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గోమాత పవిత్రమైందంటూ ఆవు పేరుతో మనుషు ప్రాణాు తీస్తున్నవారూ, స్వచ్ఛభారత్‌ను నిర్మించడమే తమ ఆదర్శమంటూ వేకోట్ల ప్రచారానికే ఖర్చు చేస్తున్నవారూ, నదీమతల్లి గంగను ప్రక్షాళన చేయడం తమ మొట్టమొదటి ప్రాధాన్యమంటూ ప్రగల్భాు పలికిన అపర అభినవ దేశభక్తు ఈ ప్రాణత్యాగాకు ఏం సమాధానం చెబుతారు? ఇంకా ఎంతమంది ప్రాణాను బలితీసుకుంటారు? ఏ కార్పొరేటు శక్తుకు ఊడిగం చేస్తూ కోట్లమంది ప్రజకు తిండి పెడుతున్న గంగానదిని నిర్జీవంగా మారుస్తున్నారు?
నిజమైన ప్రక్షాళన దిశగా, మతోన్మాద రాజకీయాను ఎదుర్కోవాల్సిన దిశగా దేశ ప్రజు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడే ఈ ప్రాణత్యాగాకు నిజమైన అర్ధం, ప్రయోజనం సిద్ధిస్తుంది.

admin

leave a comment

Create Account



Log In Your Account