సంస్కతి అంటే….

సంస్కతి అంటే….

— కె .కె. రంగనాథా చార్యులు —

సంస్కృతిని గురించి ఏకరూపత కలిగిన నిర్వచనం ఇంతవరకు కనిపించదు. భావ, భౌతికవాద తాత్త్విక ధోరణును బట్టి సంస్కృతీ స్వరూపాన్ని అనేకరకాుగా నిర్వచించటం కనిపిస్తుంది. కొందరు సంస్కృతిని అమూర్త (aపర్‌తీaష్‌) భావపదార్థంగా పరిచయం చేశారు. అంటే సంస్కృతిని స్పష్టమైన నిత్యజీవిత విధానానికి సంబంధంలేని ఒక అమూర్త అతీత అంశంగా నిర్వచించినవారున్నారు. నాగరికతలో భాగంగా మానవ నిర్మాణాు, సృజనాత్మక కళ సమాహారంగా సంస్కృతిని కొందరు వివరిస్తారు. మానవుని ప్రవర్తనా విధానపరంగా కూడా సంస్కృతిని కొందరు విశ్లేషించారు. కొందరు సంస్కృతిని అమూర్తరూపంలోని భావంగా నిర్వచించి, మూర్త రూపంలో దాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఒక సంప్రదాయవాది సంస్కృతిని అనేక రూపాలో భావపదార్థంగా నిర్వచించి, దానికి ఉదాహరణగా తొగు సాహిత్య చరిత్రను సంగ్రహించాడు. భారతీయ సంస్కృతి స్వరూప, స్వభావాను వివరించేటప్పుడు అనేక వైరుధ్యాు కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి. వేదకాం నుంచి భారతదేశచరిత్రను, నాగరికత, సృజనాత్మక నిర్మాణాచరిత్రను ఒక వరుసలో చెప్పి వాటి మధ్య పూసలో దారంలాగా కనిపించే ఏకసూత్రత భారతీయ సంస్కృతిలోని ప్రధానాంశంగా పేర్కొనటం జరుగుతున్నది. భారతదేశానికి సంబంధించి సంస్కృతి అనగానే చాలామందికి మతపరమైన విశ్వాసాు, ఆచారవ్యవహారాు, కర్మకాండు జ్ఞాపకం వస్తాయి. సంప్రదాయాన్నే సంస్కృతిగా భావించే సంప్రదాయం కూడా ఉంది. భారతీయ సంస్కృతి అనగానే ఆధ్యాత్మిక సంస్కృతి చాలామందికి జ్ఞాపకం వస్తుంది. భారతదేశంలోని తత్త్వం, చట్టం, సంగీతం, సాహిత్యం, ఇతర కళు అన్నీ ఆధ్యాత్మిక సంస్కృతినే ప్రతిబింబిస్తాయన్న భావం కూడా చాలామందిలో ఉంది. కొంతమందికి సంస్కృతి మేధావు సృష్టి, పాకు ఆస్తి. సంస్కృతి అంటే ఉత్తము ఆదర్శప్రాయమైన నడవడిక, గత ప్రాభవస్మృతి, సనాతన వ్యవస్థ స్థిరత్వం, శాశ్వతత్వం, సంస్కృతికి ప్రధాన క్షణం. కొందరికి సంస్కృతభాషా, సాహిత్యాలే మొత్తం భారతీయసంస్కృతికి ప్రతీకు. ఆ మాటకు వస్తే సంస్కృతమే సంస్కృతి. ఆ మధ్య ఒక ఇంగ్లీషు ప్రొఫెసర్‌గారు ఁూaఎంసతీఱ్‌ ఱం శ్రీaఅస్త్రబaస్త్రవ శీట ంఱశ్రీవఅషవఁ సంస్కృతం మౌన లేక నిశ్శబ్ద భాష అని అభివర్ణించాడు. భక్తి, విశ్వాసా సంస్కృతిలో భాగంగా భక్తి శ్రద్ధతో చెప్పిన మాట ఇది. సంస్కృతం భారతీయ సంస్కృతికి ప్రతిబింబం. సంస్కృతం అనగానే మనకు ఆ భాషలోని విజ్ఞానం, శాస్త్ర విషయాు, భౌతిక జీవనపరంపర జ్ఞాపకం రావు. మును, మౌను, ఋషు జ్ఞాపకం వస్తారు. భారతదేశానికి సంబంధించిన సర్వ సాధారణ సంస్కృతిని గురించి మాట్లాడేవారు భారత, రామాయణా ప్రభావం పై వర్గం నించి క్రింది వర్గం వరకు భారతీయుందరిపైన ఉందని, అందులోని పాత్రు, ఆదర్శాు భారతీయుందరికి ఏకైక ప్రేరణ అని వాదిస్తుంటారు. అవి అన్ని ప్రాంతా, వర్గా జనజీవనంలో పెనవేసుకొనిపోయాయని, అదే భారతీయ సర్వసాధారణ సంస్కృతికి తార్కాణమని వారి అభిప్రాయం. కాని భారత, రామాయణ కథను అర్థం చేసుకునే పద్ధతిలో ఆదర్శీకరించుకొనే విధానంలో, తమ జీవితానికి సమన్వయం చేసుకోవటంలో భిన్నవర్గా మధ్య చాలా తేడాు కనిపిస్తాయి. సంస్కృత భారత, రామాయణాు, వాటి ఆధారంగా వచ్చిన కావ్య నాటకాతో పోలిస్తే జానపద సాహిత్యంలో కనిపించే భారత, రామాయణ గాధు భిన్నంగా ఉంటాయి. చాతుర్వర్ణ విధానం, అగ్రవర్ణా ఆధిక్యత వీటితో సంబంధం లేకుండా జనజీవితానికి, సాధారణ మనస్తత్వానికి దగ్గరగా ఉండే పాత్రు వాళ్ళ కథలో కనిపిస్తాయి. అది ఆ రెండు వర్గా సంస్కృతిలో ఉండే భేదాన్ని సూచిస్తుంది. ఈ కథలే, ఈ పాత్రలే ఒకే వర్గంలో చరిత్రలో వ్యవస్థు మారినప్పుడు కొత్త రూపాను సంతరించుకోవడం చూడవచ్చు. పురాణేతిహాసాలోని రాముడు, దుష్యంతుడు మధ్యయుగంనాటి కావ్య, నాటకాలోని రాముడు, దుష్యంతుడు భిన్నంగా కనిపిస్తారు. వైవిధ్యంలో ఏకత్వం భారతీయ సంస్కృతికి సంబంధించిన మరొక ప్రధాన క్షణంగా చెప్తుంటారు. ప్రాంతీయ భేదాు ఉన్నా పై వర్గంలో, ముఖ్యంగా పాకవర్గంగా వారి ప్రయోజనాలోని సామ్యం దృష్ట్యా సమాన క్షణాు, ఏకత్వం కనిపించవచ్చు. కాని అది సర్వ వర్గ సమాన సంస్కృతిగా భావించటానికి ఎంతవరకు మీంటుందో చెప్పడం కష్టమే. ఇటీవ ఒక హైకోర్టు జడ్జిగారు ఒక సాహిత్య సమావేశంలో మాట్లాడుతూ దేశభక్తి, సమాజం వీటిని గురించి మనవాళ్ళెప్పుడూ ఆలోచించలేదని, ఆత్మశక్తి, ముక్తి గురించే వారు ఆలోచించేవారని అదే మన సంస్కృతి అని సగర్వంగా చాటిచెప్పారు. ఆ మాటకు వస్తే సంస్కృతి అన్న పదమే ప్రస్తుతం మనం వాడుతున్న అర్థంలో, భావంలో జబశ్ర్‌ీబతీవ అన్న ఇంగ్లీషు పదానికి సమానార్ధకంగా భాషలో కొత్తగా ప్రవేశించింది. జబశ్ర్‌ీబతీవ అంటే వ్యవసాయం, కృషి, సేద్యం, సాగుబడి, పశుపోషణ మొ॥ అర్ధాలే బ్రౌన్‌ నిఘంటువులో కనిపిస్తాయి. సంస్కృతి అంటే ‘సమ్యక్‌ కారణం’ ‘శుద్ధి’ అన్న అర్థమే సంస్కృత నిఘంటువుల్లో కనిపిస్తుంది. జాతి, సంస్కృతి అన్న పదాు పూర్వార్థాను కోల్పోయి ఒక ప్రత్యేకార్థంలో మాత్రమే ఈ రోజు కనిపిస్తున్నాయి. ఏ ప్రాచీన గ్రంథాల్లోను, కావ్యాల్లోను జాతి అన్నది ప్రస్తుతం తొగులో కనిపిస్తున్న అర్థంలో కనిపించదు. దేశభక్తి అన్న జశీఅషవజ్‌ూ కనిపించదు. సంస్కృతి అన్నపదం ప్రస్తుతం ఉన్న భావంలో కనిపించదు. తిక్కన భారతంలో ఇది ‘సంస్కారం’ అన్న అర్థంలో కనిపిస్తుంది. మౌసపర్వంలో బరామకృష్ణు మరణించినప్పుడు అర్జునుడు, భూసుర కోటి ‘‘కావున వేగమగ్నియును గాష్ఠమున్‌ సమకూర్చి సద్విధి, శ్రీ విస్లిఁగృష్ణుని శరీరము సంస్కృతిఁ గూర్చి క్రమ్మఱంబోవుటబుద్ధియంచు....’’ అనుకుంటారు. ఇక్కడ సంస్కృతి అన్న పదం ‘దహన సంస్కారం’ అన్న అర్థంలో ఉంది. చేలోపనయనాది సంస్కారాకు సంస్కృతి అన్నది మరోపేరు అయి ఉంటుంది. ఆధునికయుగంలోనే అది ప్రత్యేక భావాన్ని సంతరించుకుంది. అలాంటప్పుడు ‘సంస్కృతి’ అంటే జాతికి సంక్రమించిన సామాజిక, వారసత్వంగా, శాశ్వతమైందిగా, సర్వకాలాకు, సర్వజనాకు సంబంధించిన అతీత క్షణంగా ఎలా కొనసాగుతుంది? నా జాతి తరతరా సంస్కృతి అనుకోవటం సంప్రదాయం గురించే. పదార్థం నుంచి, భౌతికసత్యం నుంచి భావం, చైతన్యం పుడ్తుంది. భౌతికవాద జీవిత విధానాలో వచ్చే మార్పును బట్టి సంస్కృతి స్వరూప స్వభావాు మారుతుంటాయి. ఒకప్పుడు ఆర్థికవ్యవస్థకు మూలాధారమైన ఉత్పత్తి కార్యక్రమాన్ని సూచించే జబశ్ర్‌ీబతీవ అన్న పదం, ఆర్థికవ్యవస్థ పునాదిగా గ సామాజిక పరిస్థితు భావ ప్రతిబింబాన్ని సూచించే పదంగా స్థిరపడిరది. దానికి సమాన భావాన్నిచ్చే పదంగా ‘సంస్కృతి’ వాడుకలోకి వచ్చింది. మనది సంస్కృతి కాదని, అది ఆధ్యాత్మిక సంస్కృతి అని, అది సనాతనం, నిత్యం, సత్యం, అమేయం, అనవద్యం, అవ్యక్తం, అచింత్యం, అనికార్యం, అన్నభావం మౌలికంగా మనకున్నది. అలా అని పదిహేడు పద్దెనిమిది శతాబ్దా వరకు ఎవరూ చెప్పలేదు. విశ్రాంతివర్గం మేథస్సు నుంచి పుట్టిన ఒక తత్త్వంగా జగన్మిథ్య, ఆత్మనిత్యం, బ్రహ్మసత్యం అన్న భావాు కిందివర్గాకు కూడా ఏదో ఒక రూపంలో ప్రభావితం చేసినమాట నిజమేకాని అదే ప్రధాన జీవనవిధానంగా జనసామాన్యం ఎప్పుడూ భావించినట్టు కనిపించదు. ఆధ్యాత్మిక సంస్కృతి ఆధిక్యతా భావాన్ని వసపాన కాంలో బాగా ఎరువువేసి నాటినట్టు కన్పిస్తోంది. అది ఈరోజుకూ మన మెదళ్ళను, మనస్సును పాలిస్తున్నది. ఆధునిక పారిశ్రామిక నాగరికతకు ఫలితమైన సంస్కృతిలో దారితప్పిన కొందరు పాశ్చాత్య మేధావుకు ఉపనిషద్భావాు, జగన్మిధ్యాతత్వం, అతీత జగద్వాదం కొత్తగా అనిపించాయి. వారి మనస్సులోని శూన్యాన్ని మాయా, శూన్యవాదాు పూరించాయి. అది ఆ కాంలో వ్యాపిస్తున్న క్పానిక ధోరణులో భాగం. భారతదేశాన్ని గురించి వాళ్ళు చాలా క్పానికంగా ఆలోచించారు. భారతదేశం గొప్ప ఆధ్యాత్మికదేశమని, ఉన్నత ప్రాచీన సంస్కృతి గ దేశమని, అభివర్ణించారు. మాక్స్‌మ్లుర్‌ విద్యార్థిగా ఉన్నప్పుడు తన నోటు పుస్తకం అట్టపైన ఉన్న బనారస్‌ దృశ్యాన్ని చూచి కలు కన్నాడు. భారతదేశాన్ని గురించి క్పానికమైన ఆలోచనతో చాలా చెప్పాడు, రాశాడు. కాని ఆయన భారతదేశాన్ని ఎప్పుడూ చూడలేదు. ఒకసారి ఆయనను బనారస్‌కు రమ్మని ఆహ్వానిస్తే ఆయన అన్న మాటలివి. ఁI సశీ అశ్‌ీ సవంఱతీవ ్‌శీ ంవవ ్‌ష్ట్రవ స్త్రవశీస్త్రతీaజూష్ట్రఱషaశ్రీ దీవఅaతీaం షఱ్‌ష్ట్ర ఎవ జూష్ట్రవంఱషaశ్రీ వవవం. వీవ ఱసవa శీట ్‌ష్ట్రa్‌ షఱ్‌వ ఱం ంశీ ష్ట్రఱస్త్రష్ట్ర ్‌ష్ట్రa్‌ I షaఅఅశ్‌ీ తీఱంస a సఱంఱశ్రీశ్రీబంఱశీఅఎవఅ్‌ఁ. దీన్ని అర్థం చేసుకుంటే భారతదేశాన్ని గురించి ఆయన ఆలోచను ఎంత క్పానికమైనవో తొస్తుంది. తమకు అనుకూం కానిచోట పాశ్చాత్యు భావాను, ప్రభావాన్ని ఖండిరచే సంప్రదాయవాదు, పాశ్చాత్యు ప్రశంసించారన్న కారణంగానే ఆధ్యాత్మిక సంస్కృతి పేరిట మక్కువ పెంచుకున్నారు, పెంచారు. దీనివ్ల సంప్రదాయంపైన ఇంతకుముందెన్నడూ లేని గర్వం, వివేచన లేని దురభిమానం పెరిగింది. అది నేటికీ కొనసాగుతూ రోజురోజుకు పెరుగుతున్నది. ఈ దురభిమానమే స్వాధిక్యతా భావానికి దారితీస్తుంది, తీసింది కూడా. సంస్కృత భాషాధ్యయన పరిశోధన ద్వారా ఆర్యసంస్కృతి ప్రాచీనతా వైభవాు తకెక్కడం, జర్మనులే నిజమైన ఆర్యునీ, ఇతరుంతా ‘బార్బేరియన్స్‌’ అని హిట్లర్‌ చెప్పటం ప్రపంచ చరిత్ర తెలిసిన వారందరికీ తెలిసిందే. బహుశా జర్మను మనదేశం నుంచి విజ్ఞానమంతా ఎత్తుకుపోయి లాభపడ్డారంటే ఇదేనేమో! సుమారుగా సుదీర్ఘచరిత్ర గలిగిన ప్రతి జాతిలోనూ గత ఔన్నత్యం మీద అభిమానం, సంప్రదాయం మీద మమకారం, తమ మతమే సత్యం చెప్తుందన్న విశ్వాసం కన్పిస్తుంది. వారికి గతమే ఆదర్శం అవుతుంది. జీవిత విధానమే ఆశయంగా మారుతుంది. మారిన ఆర్థిక, సామాజిక రాజకీయ పరిస్థితులో ఆశయాు, ఆదర్శాు ఆచరణాత్మకం కాలేవు. దీనివ్ల ఆశయానికి, ఆచరణకు వైరుధ్యం ఏర్పడుతుంది. ఈ వైరుధ్యాు అరాచక సంస్కృతికి దారితీస్తాయి. భారతదేశచరిత్రలో భిన్న చారిత్రకదశలోని తాత్త్వికభావాు కగాపుగమై వైరుధ్యాు కనిపించేమాట నిజమే. కాని ఆధ్యాత్మిక సంస్కృతి పేరిట ఆధిక్యతాభావన ప్రాచీన భారతీయ చరిత్రను, సాహిత్యాను అధ్యయనం చేస్తే చాలా తక్కువగానే కనిపిస్తుంది. బౌద్ధం, జైనం, వైష్ణవం, వీరశైవం మొదలైన మతాు, భక్తి ఉద్యమాు భారతదేశచరిత్రలో ఎన్నో వచ్చాయి. ఈ మతాన్నీ మొదట ఆయా చారిత్రకదశలోని వైరుధ్యాలో జీవనవిధానాన్ని, వ్యవహారవిధానాన్ని నిర్దేశించే కట్టుబాట్లుగా ప్రారంభమై మత రూపాన్ని పొందాయి. ఈ మతాన్నీ ఆయా సందర్భాలో చాతుర్వర్ణ్య ప్రధానమైన సామాజిక వ్యవస్థను వ్యతిరేకిస్తూ వచ్చాయి. కాని పరిణామక్రమంలో ఆ మతాన్నీ వర్ణ విభజనకు సంబంధించిన వ్యవస్థతో రాజీపడ్డాయి. వైదికమతం అని చాలామంది అంటున్నది చాతుర్వర్ణ్య విధానానికి, శ్రమవిభజనకు, సంబంధించిన సామాజిక వ్యవస్థే కాని మరొకటి కాదు. పై మతాు కానీ, చాతుర్వర్ణ్య వ్యవస్థకాని భౌతిక జీవన విధానానికి సంబంధించినవే మౌలికంగా. ప్రతిదశలోను ఆ మతాకు సంబంధించిన ఇతివృత్తాతో సృజనాత్మక సాహిత్యం వచ్చింది. ఆధ్యాత్మిక భావాకు సంబంధించిన సృజనాత్మక సాహిత్యం చాలా తక్కువగా కనిపిస్తుంది. అదొక తత్త్వంగా విస్తరించిందేగాని భౌతిక జీవనానికి వైముఖ్యాన్ని కుగజేసే శక్తిగా ఎదగలేదు. కాకపోతే కిందివర్గాు తమ బాధకు, కష్టాకు భ్రమాత్మకమైన ఓదార్పును కలిగించే సాధనంగా అది ఉపయోగించింది. తొగు సాహిత్యచరిత్రను పరిశీలిస్తే కనీసం భౌతికజగత్తు అస్తిత్వాన్ని నిరాకరించే శంకరుని అద్వైతానికి ప్రాధాన్యం ఇచ్చిన, ఆ తత్త్వాన్ని ఆధారం చేసుకున్న ప్రసిద్ధ కావ్యాుగాని, ప్రబంధాుగాని కనిపించక పోవటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ సాహిత్యం వర్గసాహిత్యం అని చెప్పవచ్చుగాని ఆధ్యాత్మిక సాహిత్యం మాత్రం కాదు. దైవం భావన, భక్తి ఉన్నాయి. కాని జగన్మిధ్యాతత్వం కనిపించదు. ప్రత్యేకంగా అద్వైత కావ్యాు కొన్ని వచ్చాయి. కాని అవి అంత ప్రచారంలో లేవు. ఆధ్యాత్మిక సంస్కృతి, హిందూ సంస్కృతి సర్వస్వం అన్న భావం వసపానతోనే ప్రారంభమైంది. కొందరు పాశ్చాత్య మేధావు హిందువులో నాటిన ఆధ్యాత్మికసంస్కృతి ఔన్నత్యభావాన్ని బ్రిటిష్‌ పాకు బాగా ఉపయోగించుకున్నారు. ఆ భావాు మరింత బపడటానికి కావసిన వాతావరణాన్ని కల్పించటం ద్వారా దాన్ని ఆర్థికదోపిడీకి సాధనంగా వినియోగించుకున్నారు. భౌతిక జీవనానికి అతీతమైన ఉన్నతమైన ఆధ్యాత్మిక సంస్కృతీసంపన్నుగా భారతీయు, ముఖ్యంగా తమలో తాము కుంచించుకుపోవటానికి అది దారితీసింది. కర్మసిద్ధాంతం, మాయావాద తాత్త్వికత ఏదో ఒక రూపంలో మొదటినుంచీ కొనసాగుతున్న మాట నిజమేకాని అదే సర్వస్వంగా గర్వించటానికి కావసిన పరిస్థితుల్ని సృష్టించారు వసపాకు. ఆర్థికప్రగతిపైన, దేశ ఆర్థికవ్యవస్థపైన దృష్టి లేకుండా చేయటం ద్వారా ఆర్థికదోపిడీ చేయటానికి వసపాకుకు ఇది చక్కగా, చ్లగా ఉపయోగపడిరది. చరిత్రను ఆర్థిక రాజకీయ వ్యవస్థను బట్టి కాకుండా, దేశాన్ని పాలించిన పాకు మతాను బట్టి విభజించటం విభిన్న మతావారి మధ్య విభేదాు పెరగటానికి దోహదం చేసింది. దీనివ్ల స్వాతంత్య్రోద్యమ కాంలో మతాతో ప్రసక్తిలేని ఒక జాతిగా భారతీయు ఎదగటానికి, మతాతో ప్రసక్తి లేని సమానమైన సమకాలీన సంస్కృతి ఏర్పడటానికి అవసరం ఉండి కూడా దానికి తగిన వాతావరణం ఏర్పడలేదు. వస పాకు తమ విధానా ద్వారా ప్రాచీన భారతీయ సంస్కృతిగా, ఆధ్యాత్మిక సంస్కృతిగా హిందూ సంస్కృతి ఔన్నత్యాన్ని చాటిచెప్తూనే, రాజకీయంగా మహమ్మదీయులో హిందూ వ్యతిరేకభావాన్ని పెంచారు. మనలో పునరుద్ధరణవాద ధోరణు పెరగటానికి కూడా కారణం వసపాన, వారి ఆర్థిక విధానాు. స్వాతంత్య్రానంతరం కూడా ఇదే విధానాు కొనసాగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి ముప్పయ్యేడు సంవత్సరా తరువాత కూడా ఈ వససంస్కృతి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. సామ్రాజ్యవాదం ఆర్థిక పెత్తనం చేస్తూ తన సంస్కృతిని రుద్దుతూనే ఉంది. ప్రస్తుత పరిపాన ఆధ్యాత్మికసంస్కృతి పేరిట భూస్వామ్య సంస్కృతిని రక్షిస్తూనే ఉంది. దేశంలోని రాజకీయాు కూడా వస పాననాటి కంటే భిన్నంగా లేవు. అ్పసంఖ్యాక వర్గావారిని బుజ్జగిస్తూనే, అధికసంఖ్యాకు మద్దతును, బలాన్ని జాగ్రత్తగా సేకరించుకోవటం, ఉపయోగించుకోవటం మరచిపోని రాజకీయ సంస్కృతి రోజురోజుకు పెరుగుతున్నది. స్వతంత్రమైన, స్వతస్సిద్ధమైన సామ్యవాద ఆర్థికవిధానాన్ని రూపొందించుకోవటం ద్వారా వర్తమాన భౌతికపునాదుపైన మతంతో సంబంధంలేని సాధారణ భారతీయ ఆధునిక సంస్కృతి పెరగటానికి మీలేని విధానాను పాకవర్గాు అనుసరిస్తున్నాయి. ‘సహనమే సంస్కృతి’ అన్న అధికార వర్గతత్త్వవేత్త నిర్వచనం నినాదంగా మాత్రమే మిగిలి ఆచరణలో వైరుధ్యాకు దారితీస్తున్నది. అందుకే కాబోు సహనం గాడిద క్షణం అంటున్నారు విప్లవకాయి. వర్గసమాజంతో విభిన్నవర్గా మధ్య సహనం సాధ్యం కాదనేది వాస్తవం. సంస్కృతి మార్పులేని స్థిరపదార్థమో, ఆద్యంతరహితమైన బ్రహ్మ పదార్థమో కాదు. ఈరోజు ఆదిమ సంస్కృతి, జానపద సంస్కృతి, సనాతన సంస్కృతి, సంప్రదాయ సంస్కృతి భూస్వామ్య సంస్కృతి, భౌతిక సంస్కృతి, ఆధ్యాత్మిక సంస్కృతి, వస సంస్కృతి, ఎరువు సంస్కృతి, సామ్రాజ్యవాద సంస్కృతి, ప్రజాస్వామ్య సంస్కృతి, బూర్జువా సంస్కృతి, ఆధునిక సంస్కృతి, ధనస్వామ్య సంస్కృతి, వ్యాపార సంస్కృతి, పాకవర్గ సంస్కృతి, రాజకీయ సంస్కృతి, జాతీయ సంస్కృతి, నూతన ప్రజాస్వామిక సంస్కృతి, శ్రామికవర్గసంస్కృతి, సామ్యవాద సంస్కృతి, విప్లవ సంస్కృతి, అంతర్జాతీయ సంస్కృతి మొదలైన రకరకా సంస్కృతు పేర్లు వినవస్తున్నాయి. వీటిలో కొన్ని చరిత్రలోని విభిన్న దశను సూచిస్తున్నాయి. కొన్ని ఒకే దశలోని భిన్న వర్గాను సూచిస్తున్నాయి. మరికొన్ని ఆర్థిక వ్యవస్థను సూచిస్తున్నాయి. రాజకీయ పార్టీ పేరుతో కాంగీ సంస్కృతి, తొగుదేశ సంస్కృతి మొదలైనవి వినిపిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికకు కొన్ని ప్రతిపక్షాు ‘నూతన రాజకీయ సంస్కృతి (చీవష ూశీశ్రీఱ్‌ఱషaశ్రీ షబశ్ర్‌ీబతీవ)’ని తమ నినాదంగా ప్రకటించారు. కొంత హాలివుడ్‌ నుంచి దిగుమతి అయి, దేశంలోని బందిపోటుదొంగ జీవితా ఇతివృత్తాతో కసి సినిమా సంస్కృతిగా వ్యాపిస్తున్న ప్రతీకార సంస్కృతి (షబశ్ర్‌ీబతీవ శీట తీవఙవఅస్త్రవ) ంపెన్‌ వర్గాన్ని బాగా పాలిస్తున్నది. దీన్నిబట్టి సంస్కృతి స్వరూప స్వభావాు స్థిరమైనవి, మార్పులేనివి, సర్వజన సాధారణమైనవి కావని తొస్తుంది. ఆర్థిక పరిస్థితునుబట్టి ఏర్పడే వర్గాు, సామాజిక, రాజకీయ వ్యవస్థు, వాటిల్లోని వైరుధ్యాు సంస్కృతి స్వరూప స్వభావాను నిర్ణయిస్తాయని, వర్గ విభక్త సమాజంలో సర్వవర్గసమాన సంస్కృతి, విభిన్న వ్యవస్థకు అతీతమై అన్ని వ్యవస్థలో సమానంగా అన్వయించే సంస్కృతి సాధ్యం కాదని తేుతుంది. ఇంతకీ సంస్కృతి అంటే ఏమిటి? కళు, సాహిత్యం, విజ్ఞానం, మానవ సంబంధాు, పరస్పర ప్రవర్తన ఇవి సంస్కృతికి చిహ్నాని, అందులో ఎంత ఔన్నత్యాన్ని సాధిస్తే ఆ సంస్కృతి అంత ఉన్నతమైందని, ఆ ఔన్నత్యం పైన వ్యక్తిగాని, సమాజంగాని ప్రత్యేక శ్రద్ధను చూపిస్తే అది ఆ వ్యక్తి సంస్కృతి అవుతుందని కొందరి అభిప్రాయం. విద్యా, విజ్ఞాన, శిక్షణ వ్ల మానసిక వికాసం చెందటం సంస్కృతి అని మరొక నిర్వచనం. సంస్కృతి అంటే కొన్ని సామాజిక సమూహాను గుర్తింపజేసే క్షణం అని మరికొందరంటున్నారు. ప్రత్యేక చారిత్రక పరిస్థితులో, ప్రత్యేక ప్రాంతంలో ఒక గుంపులో నియమితంగా పునరావృతమయ్యే క్షణాలే సంస్కృతి అని అది సమకాలీన ప్రత్యేకతను ప్రతిబింబిస్తుందని ఇంకొక అభిప్రాయం. ప్రాచీన సంస్కృతీ నాగరికతను తవ్వి తీయడం అంటే పురావస్తు తవ్వకాలోని భౌతిక వస్తుసంపద, నిర్మాణం ఆధారంగా ఆనాటి జీవన విధానాను, సమకాలీన క్షణాను బయటికి తీయటం అన్నమాట. ఒక ప్రత్యేక దశలో, ప్రత్యేక ప్రాంతంలోని, ప్రత్యేక గుంపు యొక్క ప్రత్యేక క్షణాు సంస్కృతి అన్నమాట. అంటే సమకాలీన భౌతిక జీవన పరిస్థితులే ఆనాటి సంస్కృతి అని అర్థం. భావాు, నమ్మకాు, వ్యవస్థా నిర్మాణం కళాసృజన, ఆచార వ్యవహారాు వివాహాది విధానాు, ప్రత్యేకంగా గుర్తింపదగిన మానవు ప్రవర్తనా విధానం ` ఇవి సంస్కృతిలో భాగాయితే, వీటి స్వరూప స్వభావాను నిర్ణయించేది సమకాలీన ఆర్థిక వ్యవస్థ.
సమాజంలో మానవ సమూహంలో ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమించిన జీవన విధానమే సంస్కృతి అని, అది జాతికి సంక్రమించిన సామాజిక వారసత్వమని అవిచ్ఛిన్న సంతత్వం సంస్కృతి ప్రధాన క్షణమని వారంటారు. కాని ఈరోజుకీ మతపరంగా వచ్చిన కర్మకాండను, వివాహాది విధును కొన్ని ప్రత్యేక సందర్భాలో నామమాత్రంగా, యాంత్రికంగా అనుసరిస్తున్నా, విశ్వాసాుగా కొన్ని కొనసాగుతున్నా సాధారణ జీవన విధానంలో ఎన్నో మార్పు కనిపిస్తాయి. భూస్వామ్యవ్యవస్థ నాటి ఉమ్మడి కుటుంబ జీవనం ఇప్పుడు పోయింది. బ్యా వివాహాు పోయాయి. విధవా వివాహాు జరుగుతున్నాయి. స్త్రీు చదువుకొని, ఉద్యోగాు చేసుకోవటానికి అవకాశాు ఏర్పడ్డాయి. మానవ సంబంధాలో ఎన్నో మార్పు వచ్చాయి. మొత్తం మీద ఏ సంస్కృతీ దేశ కాలాతో నిమిత్తం లేకుండా, ఆర్థిక సామాజిక వ్యవస్థతో సంబంధం లేకుండా ఉండదు. ఆర్థిక సంబంధాు సమాజ స్వరూపాన్ని, రాజకీయ స్వరూపాన్ని నిర్ణయిస్తాయి. అవి మానవ సంబంధాను, మివను, నీతును నిర్దేశిస్తాయి. వాటి వ్యక్తరూపమే మానవుని ప్రవర్తనా విధానాు. కళా నిర్మాణాు వాటినే ప్రతిబింబిస్తాయి. సమాజాన్ని గురించి శాస్త్రీయమైన అవగాహన సంస్కారవంతుని క్షణం. అయితే, తదనుగుణమైన వ్యక్తికి సంబంధించిన ప్రవర్తన ఆ వ్యక్తి సంస్కృతి. ఒక సమాజానికి ఆధారమైన మానవ సంబంధాు ఆ సమాజానికి సంబంధించిన సంస్కృతి.
ఒక్కొక్కసారి భౌగోళిక నైసర్గిక పరిస్థితు కూడా సంస్కృతిలో భాగంగా చెప్పుకుంటున్న ఆచార వ్యవహారాను నిర్ణయిస్తాయి. అవి మతంలో భాగమైనప్పుడు విశ్వాసంగా మారి భౌతిక పరిస్థితు మారినా, భిన్న భౌగోళిక పరిసరాల్లో కూడా సంప్రదాయంగా కొనసాగుతాయి. మహమ్మదీయు శవాను ఖననం చేయటం, వారి స్నానపానాదు మహ్మదీయ మతం పుట్టిన చోట భౌగోళిక పరిస్థితును బట్టి ఏర్పడ్డ అవాట్లు ఖురాన్‌లో చెప్పిన షరియత్‌ చట్టం మొదలైనవి ఒక ప్రత్యేక చారిత్రక పరిస్థితులో ఏర్పడ్డాయి. ఇవన్నీ మతాచారాుగా వేరే దేశాలో వేరే కాలాలో కూడా అవి అట్లాగే కొనసాగుతున్నాయి. వ్యవసాయ జీవితం ఆధారంగా రూపొందిన వివాహాది కర్మకాండు మారిన ఆర్థిక పరిస్థితులో నేటికీ అట్లాగే కొనసాగడం చూడవచ్చు. దీన్ని బట్టే తరతరాుగా సంక్రమించే సంప్రదాయమే సంస్కృతి అన్న అభిప్రాయం ఏర్పడి ఉంటుంది. ఆ మధ్య మన రాష్ట్రంలో ఒక ఉన్నత విద్యాపీఠాధిపతి విద్యార్థును ఉన్నత సంస్కృతీపయిగా తీర్చిదిద్దటం తన ధ్యేయం అని ప్రకటించాడు. ఆయన ఉద్దేశించింది తాను విద్యార్థిగా ఉన్నప్పుడు కనీసం వసపానలోని ఆధునికతకు కూడా నోచుకోని ఫ్యూడల్‌ సంస్థానంలోని ఒక వర్గానికి సంబంధించిన సంస్కృతి అయి ఉండాలి. ప్రస్తుతం విద్యార్థు ప్రవర్తనకు సమకాలీన, అరాచక, సామాజిక, రాజకీయ పరిస్థితుతో సంవదించుకోవటం తెలియక, విద్యార్థు ప్రవర్తనను తను విద్యార్థిగా ఉన్న నాటి పరిస్థితుతో ప్చోుకుని ఆయన ఖంగు తిని ఉంటాడు. విభిన్న ఆర్థిక, సామాజిక, రాజకీయవ్యవస్థలో పుట్టిన మానవ సంబంధాు, సంస్కృతీ విభేదాు ప్రత్యేక తెంగాణా, ఆంధ్ర ఉద్యమాకు దారి తీసాయి. పైకి అవి మానసికమైనవిగా కనిపించినా వాటి పునాది ఆర్థికమైనది. మతపరమైన సంస్కృతి పేర, ద్విజాతి సిద్ధాంతంపేర పాకిస్తాన్‌ అవతరించినా పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ుగా ఆ దేశం చీక తప్పలేదు. బంగ్లాదేశ్‌ ఏర్పడటానికి కారణం పైకి ప్రత్యేక భాషా, సంస్కృతుగా కనిపించినా, అక్కడి ఆర్థిక పరిస్థితు వ్ల పుట్టిన అసంతృప్తిని రెచ్చగొట్టటానికి అవి సాధనాు మాత్రమే అయ్యాయి. ఇరాన్‌లో షా అనుసరించిన వస ఆర్థికవిధానానికి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి మతశక్తు దోహదం చేశాయి. సరిjైున ఆర్థికవిధానంలేని ఆ శక్తు అధికారానికి వచ్చిన తరువాత ప్రజదృష్టిని తమ సమస్య నుండి మళ్ళించటానికి స్వమతానికే చెందిన ఇరాక్‌తో కొన్ని సంవత్సరాుగా యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నాయి. యుద్ధం మొదలైన రోజులో ఆర్యజాతికి, ఆర్య సంస్కృతికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నామని ఇరాక్‌, అరబ్బుకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నామని ఇరాన్‌ పరస్పరం ప్రకటించుకొన్నాయి. కాని ఆ దేశాను పాలించేవారి ఆర్థిక విధానా వైఫల్యాలే ఆ యుద్ధాకు ప్రధాన కారణం. తమ వర్గ ప్రయోజనాను కాపాడుకోవడానికి మతాన్ని సాధనంగా వాడుకోవటం ఈ మధ్య పెరుగుతున్నది. కారంచేడు బాధితులైన హరిజను క్రైస్తవు. వాళ్ళంతా ఐక్యతతో నిచి భూస్వామును ఎదిరించి నివటంతో భూస్వామ్యవర్గం ‘హిందూమత రక్షణ’, క్రైస్తవు దాడి నుంచి హిందువుకు రక్షణ’ అన్న నినాదాను చేపట్టింది. గోవాలో కొంకణి, మరాఠీ, భాషావాదం కేథలిక్‌ను, హిందువుకు మధ్య చీలికగా పరిణామం చెందుతున్నది.
సమకాలీన ఆర్థిక, సామాజిక, రాజకీయవ్యవస్థ భావ ప్రతిబింబం, ప్రవర్తనాసరళి, జీవన విధానం సంస్కృతి అయితే ఆర్థిక విధానాలోని, పానావ్యవస్థలోని వైరుధ్యాు సంస్కృతిలోనూ ప్రతిబింబిస్తాయి. అధికారంలో ఉన్నవారు ఈ వైరుధ్యాను తమ అస్తిత్వం కోసం పెంచి పోషిస్తూనే ఉంటారు. జాతీయ సంస్కృతిగా ఈరోజు చెప్తున్నది నూతన ఆర్థికవ్యవస్థ పునాదిగా ఏర్పడ్డ సమకాలీన సర్వసాధారణ సంస్కృతి కాదు. సంప్రదాయ సంస్కృతి పేరిట భూస్వామ్య సంస్కృతి, దేశ ఆర్థిక వ్యవస్థపైన పెత్తనం చేస్తున్న సామ్రాజ్యవాద సంస్కృతుకు పుట్టిన వింత శిశువు అది. విరుద్ధ ఆర్థిక విధానా ఫలితమైన రాజకీయ సంస్కృతి అది. సాంస్కృతిక ప్రదర్శన పేరిట జరిగే మత ఉత్సవాలో, ఊరేగింపులో, కళలో ఈ సంస్కృతి ప్రతిఫలిస్తున్నది. బొంబాయి లాంటి నగరాలో ఏ మతానికి సంబంధించిన ఊరేగింపుల్లోనయినా స్మగ్లర్ల, బ్లాక్‌మార్కటీర్ల పాత్ర తెలియంది కాదు. తమ అస్తిత్వం కోసం ఈ మేళాలో పాల్గొనటానికి రాజకీయ నాయకు పడే పాట్లూ తెలియనివి కావు. సాంస్కృతిక కార్యక్రమా పేరిట జరిగే ప్రదర్శనలో కూడా ఈ వైరుధ్యాు కొట్టవచ్చినట్టు కనుపిస్తాయి.
ఆర్థిక అసమానతు, ఆర్థిక విధానాలోని వైరుధ్యాు, జాతీయత పేరిట భూస్వామ్యయుగంనాటి భావాు, ఆధునికత పేరిట పాశ్చాత్యీకరింపబడుతున్న పై వర్గం జీవన విధానం, స్వాతంత్య్రానికి ముందు వస ఆర్థికవ్యవస్థ నాటి భ్రమాత్మకమైన సాంస్కృతిక ఆధిక్యతా భావన, ఆలోచను, మధ్యయుగంనాటి స్త్రీ పురుష సంబంధాను నేటికీ ఆదర్శంగా చూపే కౌటుంబికగాథతో వస్తున్న సినిమాు, సినిమాలే పెంచుతున్న ప్రతీకార సంస్కృతి, విభిన్న సంస్కృతును దేనికదే వేరు వేరుగా గుర్తింపును పెంచుకోవటానికి దోహదం చేస్తూ కృత్రిమ ఐక్యతను ప్రచారం చేయటానికి ఉపయోగిస్తున్న ఆధునిక వైజ్ఞానిక సాధనాు, ఎంత ఎక్కువగా లాభం చేకూర్చిపెడితే అంత గొప్పదిగా చలామణీ అయ్యే వ్యాపార సంస్కృతి, తదనుగుణంగా పెరుగుతున్న మానవ సంబంధాు, వ్యక్తు ప్రవర్తనావిధానాు అరాచక సంస్కృతిని, పెంచి పోషిస్తున్నాయి. గత సంస్కృతిలోని ఉత్తమ క్షణాను కాక అవక్షణానే ప్రస్తుత సంస్కృతి పుణికి పుచ్చుకుంటున్నది. క్రౌర్యం ప్రక్కనే కొనసాగిన భూస్వామ్య సంస్కృతిలోని మంచి క్షణాలైన మానవ సంబంధాను వదలి దానికి సంబంధించిన భావజా సంస్కృతే సంస్కృతిగా చలామణి అవుతున్నది. ప్రజాస్వామ్య సంస్కృతిలోని స్వేచ్ఛాభావాు వ్యక్తి ప్రాధాన్యవాదంగా మిగిలిపోయాయి.
మధ్యయుగంలో కళు, మతాు దేవాయా చుట్టూ తిరిగేవి. అప్పటి ఆర్థికవ్యవస్థ కూడా అంతే. ఉత్పత్తి పంపకం దేవాయాపైన, దేవభోగాపైన ఆధారపడి ఉండేవి. అందుకాదేవాయాు కళకు కూడా కేంద్రాయ్యాయి. ఆ రూపంలోని కళ పునరుద్ధరణను ఆధునిక వైజ్ఞానిక సాధనాలైనా సినిమాు ప్రచారం చేస్తున్నాయి. ధర్మశాస్త్రాను వర్ణాశ్రమ వ్యవస్థను సృష్టించిన అగ్రవర్ణావారే వాటిని భేదించగ సమర్థున్న అభిప్రాయాన్ని కలిగించే సినిమాు వస్తున్నాయి. వాటిని ప్రభుత్వాు ఆదరిస్తున్నాయి. నిన్నటితరంలోని సామాన్యు కళా నిర్మాణాను కాపాడుకోవసిన అవసరం ఉన్నమాట నిజమేకాని వాటినే ఆ రూపంలోనే పునరుద్ధరించానటం సమకాలీన వాస్తవాను గుర్తించకపోవటమే. నిజమైన జాతీయ సంస్కృతి అంటే పూర్తిగా పాత సంస్కృతిగాని, దిగుమతి సంస్కృతిగానీ కాదు. అలాగే ఉత్పత్తి సాధనా మీద అధికారం గ పాకవర్గ సంస్కృతి అంతకంటే కాదు. ప్రజాబాహుళ్య సంస్కృతే జాతీయ సంస్కృతి. సమకాలీన జీవిత వాస్తవాను ప్రతిబింబించే సంస్కృతే నిజమైన జాతీయ సంస్కృతి. పాత సంస్కృతిలోని సామాజికాంశంగాగ ఉత్తమ క్షణాను మాత్రమే అది స్వీకరిస్తుంది. ప్రస్తుత అరాచక సంస్కృతి వ్యాపించి ఉన్న దశలో ఈ నూతన సంస్కృతిని నిర్మించటానికి ప్రయత్నపూర్వకంగా కృషి చేయవసి వుంటుంది. అందుకోసం దానికి తగిన ఆర్థిక వ్యవస్థను రూపొందించుకోవాలి.

(‘ప్రజాసాహితి’ డిసెంబరు, 1985 సంచిక నుండి)

admin

Related Posts

leave a comment

Create Account



Log In Your Account