మీ తల్లీ… మా తల్లీ తెలుగేననే ఎరుకను మోసుకొచ్చిన ‘‘మోతుకుపూ వాన’’ పరిమళం

మీ తల్లీ… మా తల్లీ తెలుగేననే ఎరుకను మోసుకొచ్చిన ‘‘మోతుకుపూ వాన’’ పరిమళం

— ఓ వి వి ఎస్ —

మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం భాష ప్రాతిపదికపైననే ఏర్పడిరది. తొగువారే ఎక్కువగా ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో కవలేకపోయిన సరిహద్దు ప్రాంతాూ మనకు ఉన్నాయి. ఒరిస్సాలో బరంపురం, గంజాం తదితర ప్రాంతాు…, కర్ణాటకలోని బళ్ళారి, ఇంకా తమిళనాడులోని కృష్ణగిరి, హోసూరు అటువంటివే. తల్లి కోసం, తల్లి నుడి కోసం తప్పిపోయిన బిడ్డపడే వేదన ఈ ప్రాంత ప్రజలో, ముఖ్యంగా రచయితలో కనిపించే భావోద్వేగా సమాహారం ‘‘మోతుకుపూ వాన’’ కథ పుస్తకం.
తమిళనాడులోని కృష్ణగిరిజిల్లా తొగు రచయిత సంఘంవారు ప్రచురించిన పుస్తకమిది. హోసూరు గడ్డమీద నిలిచిన పంతొమ్మిది మోతుకుపూ చెట్లు కురిపించిన వాన ‘‘మోతుకుపూ వాన’’ పుస్తకం. తల్లికి దూరమైన బిడ్డ వంటరిjైు నుదిక్కులా చూస్తూ, పరిణామాను ఆకళింపు చేసుకుంటూ గొంతెత్తి సంగతు మనతో పంచుకుంటున్న వైనం ఈ పుస్తకాన్ని చదువుతుంటే మనకు తొస్తుంది. ఆ గొంతు లోపలికి తరచి చూస్తే బతుకుతెరువు పోరాటం, తల్లిభాష కోసం ఆరాటం, సాంస్కృతిక విధ్వంసం, ఒక్కమాటలో గ్రామీణ జీవనసంక్షోభం మన కళ్ళముందు కదలాడుతుంది.
‘‘బతుకుదోవలో ఎగుడుదిగుళ్ళూ, ఎత్తుపల్లాూ ఎవురికైనా వుండనే వుంటాయి. కానీ కష్టం తర్వాత సుఖమనేది ఒకటుండా కదా! అదెట్లుంటాదో తెలియనోడు మా నాయిన’’ అంటూ కాయకష్టపు ఆ తరా జీవితాను కేవం చూపడమే కాక, వారసత్వంగా ఆ జీవితా నుండి మనమేమి తీసుకుంటున్నాము… అనే స్ఫురణ కలిగించే కథు ‘‘ఆ నెత్తురూ ఆ చెమటే’’ ‘‘అమ్మ ఆపేకారము’’ ‘‘యసనం’’ మొదలైన కథు.
‘‘తాత చస్తే బొంతనాది అనేదిపోయి, తాత బతికుండంగానే బొంత పీక్కొనే కామొచ్చె…. ఎవురెక్కడున్నా పోనీ మనం బాగుంటే సరి అనేవోళ్ళే జాస్తి అయ్యిపోయిడిసిరి’’ అంటూ విలోమ మివ కాలాన్ని పట్టి చూపిస్తాడు రచయిత ‘‘యసనం’’ కథలో. ఉన్నాడో లేడో, వస్తాడో రాడో తెలియని కొడుకును తుచుకుంటూ జీవితాన్ని చెత్తకుప్పల్లో ఏరుకుంటూ ఎందుండి వస్తీవి తుమ్మెదా?!… అంటూ తాత్త్విక ప్రశ్నను సంధించే పేదరాలి కథ ‘‘ఎందుండి వస్తీవి తుమ్మెదా’’. జీవితాంతమూ నెత్తురు, చెమటు చిందించి, సత్తుమడిగిపోయిన వృద్ధాప్యంలో ఈ అసమ సమాజం చూపిస్తున్న భద్రత ఏమిటి?! అనే జవాబు లేని ప్రశ్నను గురించి ఆలోచించమని పాఠకుడిని తడతాయీ కథు.
మాతృభాషను పరిరక్షించుకోవానే తపన, బోధనా భాష మాతృభాషే అయి వుండాలనే కోరిక, అది కూడా సరళతరంగా, ప్లికు చదవగానే పట్టుబడానే ఆరాటం…. వీటిని ఈ రచయితు వ్యక్తపరచిన తీరు ఎంతో ప్రేరణనిస్తుంది. త్రికసంధి సూత్రాన్ని ఎంతో సరళంగా ‘‘ఆ, ఈ, ఏ ను మూండ్లు అంటారు. మూండ్ల మీద ఒంటి హ్లు జంట హ్లుగా మారును. జంట హ్లు అగునప్పుడు ముందరి పొడవచ్చు పొట్టిదగును’’ అంటాడు. అక్కడితో ఆగకుండా ‘‘నేను పాఠమును రాసి ఉంటే ఇట్ల రాసి ఉంటును. తొగు సిన్నోళ్ళకు నోళ్ళు తిరగని మాటతో పుస్తకాు నింపేసి చదువుమంటే ఎట్ల?!…’’ అనే ‘‘కోడిగుడ్ల మేస్టురు’’ కథలో మాస్టారి ఆలోచన ఎంత ప్రజాస్వామికమైనదో కదా!!….
తెంగాణము, రాయసీమ, ఆంధ్రము యివన్నీ తావు. తొగు అనేది నుడి. తొగువాళ్ళు ఏుబడికి మీగా ఎన్ని తావులోనైనా ఉండొచ్చుకానీ తొగుజాతి అంతా ఒకటేనంటాడు రచయిత ‘‘తొగు తావు’’ కథలో. టీవీ, సెల్‌ఫోన్‌, సినిమా సంస్కృతు వరవడిలో కమ్మనైన తొగు ఎలా వివిలాడుతున్నదో చూపుతాడు. ఈ రొచ్చుగుంట సంస్కృతు నడుమ వివిలాడే భాష, సరళతరమై ప్రజందరికీ చెందాల్సిన భాష సమస్యపై తొగునాట వస్తున్న కథలేమిటో చూడాంటే భూతద్దం పట్టాల్సిందే. ప్లి పాఠా బోధనాభాష నుండి శాస్త్రసాంకేతిక భాష వరకూ… ఇంకా జీవోూ, కోర్టు తీర్పు వరకూ అందరికీ సుభ గ్రాహ్యమయ్యే భాషనే వినియోగించాలి కదా!… నాటి గిడుగు, గురజాడ నుండి నేటి భాషోద్యమకాయి, సంఘా వరకూ ఉద్యమించేది ఇందుకే కదా అనిపిస్తుంది.
స్త్రీూ, పురుషుూ కలిసే జీవన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా, అందులో స్త్రీ పరిస్థితి మరీ దారుణం. మామూు దైనందిన జీవితం నుండి పండుగ పబ్బా వరకు పితృస్వామిక గోడ లోప ఆమె పడే వేదనను సైతం ఈ కథు పట్టుకున్నాయి. జీవన ప్రవాహాన్ని ఈదేందుకు ఒక పేదింటి గృహిణి పడే శ్రమను, తపననూ ఆమె కూతురి గమనింపు నుండి చక్కగా చెప్పిన కథ ‘సమసిపోయిన తాళిబొట్టు’. కొడుకు, ఆస్తి పంపకాు నుండి, సమర్తూ, చూలాు, బాలింతు వంటి సందర్భాలో వంటు, తిండ్లూ వగైరాతో సహా సంస్కృతిని, దాని వెన్నంటి ఉండే సుఖదుఃఖా దోబూచులాటను కళ్ళకు కట్టిన కథ ఇది. మెట్టినింటి గౌరమ్మ నోము, పుట్టినింట దీపావళి ఒకదానికొకటి ఎదురైన సందర్భంలో…., మానసిక సంఘర్షణను బయటకు కనబడ నీయకుండా ఆ కోడు మెట్టినింటి నోములోకి మౌనంగా ఒదిగిపోయిన వైనమే ‘‘పుట్టినింటి బెమ’’.
భూ మాతకు కొరివిపెట్టే కొడుకు మనిషే కదా…, చిక్కని జానపద అల్లికతో, గొప్ప పర్యావరణ స్పృహతో రాసిన ‘‘కొరివిపెట్టే కొడుకు’’ కథ ముగింపు చదివినప్పుడు ప్రతి పాఠకుడు వేదన పడక తప్పదు. అభివృద్ధి పరిణామక్రమంలో చితికి వత్తిగిల్లిపోతున్న జీవితాను చూపిన కథ ‘‘మా ఊరు బతికిపోయె’’.
హోసూరు ప్రాంత ప్రజ జీవిత విధానాన్ని, భాష నుడికారానే కాక, వారి ఆర్తినీ, ఆపేక్షనూ హృద్యంగా తొపుతూ మనకందించిన పుస్తకం ‘‘మోతుకుపూ వాన’’. అన్నదమ్ముల్లారా! అక్కచెల్లెళ్ళారా!!.. మేమూ తొగుతల్లి బిడ్డమే. ఆయమ్మ ప్రేమ, మమకారమూ, గోరుముద్దూ మాకు కావాలి. మమ్మల్నీ ఆయమ్మ చిటికెన మే పట్టుకోనివ్వండి. మమ్మల్నీ మీతో కుపుకోండి…… అంటూ హోసూరు గడ్డంతా ఎుగెత్తి పిుస్తున్నదా…… అనిపిస్తుంది. ఈ పుస్తకం చదివితే.

admin

leave a comment

Create Account



Log In Your Account