— తుసీదాసు —
తిత్లీ తుపానుకు ఇు్ల పోయి ఉపాధి కరువైతే ఏ దిక్కూ లేక బుర్రకథ చెప్పడానికి ఒక కుటుంబం కదిలి తమ వ్యధని చెప్పుకుంటున్నారిలా….
బుర్రకథ చెప్పాలా.. హరికథ చెప్పాలా….
ఇది బుర్రకథ కాదోయి.. మా దీనస్థితి వినవోయి….
నిదరొచ్చెవే అది తల్లి.. కమ్మని కగన్నెవే ఆది తండ్రి
ఆర్భాటం లేకుండా వచ్చి మా బతుకుల్ని ఆవిరి చేసి
అజడులే సృష్టించి అ్లకల్లోమే చేసింది
నిదురపొద్దుగా లేచి ఊరుగాని సూస్తే
ఒంట్లో నీరెండి పోయె అమ్మా క్ల రత్తము కారేనమ్మా….
క్ల రత్తము కారేనమ్మా.. అమ్మా నేకూలిపోయామమ్మా….
॥ ఇది బుర్రకథ ॥
ఎదిగిన వనమును చూసి మురిసిపోయేవాళ్ళం తల్లీ
అవిచ్చే సంపదతోటి బతుకు సాగించేవాళ్ళం తండ్రి
కొబ్బరి జీడిమామిడే కన్న కొడుకునుకున్నాం తల్లీ
ఎటునుండి వచ్చిందో తల్లీ.. రాకాసి గాలే తల్లి
రాకాసి గాలే తల్లీ.. తిత్లీ పేరెట్టుకొని తల్లీ…. ॥ ఇది బుర్రకథ ॥
గుండె బరువైపోయె.. బతుకిక బారమైపోయె
మంచినీరు కరువాయె.. మా గూళ్ళన్నీ విరిగిపోయె
ఎట్టా బతకాయ్యా.. మేము ఎటని పోవాయ్య
ఎటని పోవాయ్య మేము ఏడతదాచుకోవాయ్యా…. ॥ ఇది బుర్రకథ ॥
చూలాు ముక్కుతున్నా.. పసిపాప కెవ్వుమంటున్నా….
పసువు బాండ్రమన్నా.. పక్షు కంగారుపడినా….
కనికరమే లేదమ్మా.. పిసిరింతైనా ఆలోచించలేదే
పిసిరింతైనా ఆలోచించలేదే అమ్మా.. అసురజాతి గాలే అమ్మా….
॥ ఇది బుర్రకథ ॥
అయ్యలార రండి.. అమ్మలార రండి….
భిక్షములా కాకుండా.. అండగా రండి
పాకుకి ఇది కూడా దోచుకునే సమయమేనమ్మా
కష్టాపాలైన మాకు మీరు తోడుగా రండమ్మా
॥ ఇది బుర్రకథ ॥