— ఓవీవీయస్—
జనవరి ఫస్టు.., జనవరి ఫస్టు.., జనవరి ఫస్టు వచ్చింది
అందరు పండుగ అంటూ ఉంటే నిజమేనేమో అనిపించింది.
చాకొలేట్లు గ్రీటింగ్‌కార్డు ప్లిు చాలా కొంటారు
టీచర్‌గారికి మాస్టారికీ పోటీపడుతూ యిస్తారు
వందా యాభై బడుకు తెచ్చి జల్సా బాగా చేస్తారు
డబ్బు లేని పిల్లోళ్ళంతా చిన్నబోయి చూస్తారు. ॥ జనవరి ॥
కాలేజీ అన్నయంతా గెట్‌టుగెదర్లే చేస్తారు
రోడ్ల మీద గుంపు కట్టి వెల్‌కమ్ పెయింట్లు వేస్తారు
సైలెన్సర్లే ఊడదీసి సర్కస్‌ఫీట్లే చేస్తారు
ఏడవలేక నవ్వలేక పెద్దు చూస్తూ ఉంటారు ॥ జనవరి ॥
ఊళ్ళో యువకు గ్రూపు కట్టి వెల్‌కమ్ కేకు కోస్తారు
హీరోల్లాగ ఫీలైపోతూ కార్లే ఎగరేస్తారు
ఎంజాయ్‌మెంటని పేరుపెట్టి మందు పార్టీు చేస్తారు
గోగోగా వీధు తిరుగుతు కోతిమూకలే ఔతారు
॥ జనవరి ॥
అక్కా మమ్మీ ఆంటీంతా వాకిట ముగ్గు నింపేరు
వేసిన ముగ్గు ఫోటో తీసి లైకుకోసం చూస్తారు
రాత్రి పన్నెండైనాగానీ సెల్ఫీలాపము అంటారు
తుమ్ము తుమ్మి దగ్గు దగ్గి మంచును తిడుతూ ఉంటారు
॥ జనవరి ॥
డాడీ అంకుల్ అందరు కసి స్వీట్లూ బొకుే కొంటారు
అయ్యిన ఖర్చుకు లాభనష్టా లెక్కు చూస్తూ ఉంటారు
బాసు ముందు వరుసు కట్టి కాకాపట్లే పడతారు
షేక్‌హాండ్లిచ్చి, గ్రీటింగ్స్ చెప్పి, చాటుమాటున తిడతారు
॥ జనవరి ॥
కాలీ కడుపు ఎండే బతుకు జనవరి ఫస్టున మారేనా?….
నిన్నటి జీవన వేదన చిత్రం పచ్చని చివుళ్ళు తొడిగేనా??….
ధనిక పేద లోకం బతుకును జనవరి ఫస్టు మార్చేనా….
ముళ్ళదారు కాం నడకకు సుమాు స్వాగతమిచ్చేనా??….