ఒకే కాలం…. మూడు స్థలాలు!!

ఒకే కాలం…. మూడు స్థలాలు!!

  1. ప్రజా ఉద్యమా ఉధృతి దిశగా ఫ్రాన్సు!
    2019వ సంవత్సరం ప్రజా ఉద్యమాకు స్వాగతం పుకుతూ ప్రారంభంకానుండటం ప్రజాతంత్రవాదుందరూ సంతోషించాల్సిన విషయమే! ఫ్రాన్స్‌ దేశంలో కొనసాగుతూన్న ఉద్యమం ‘మెరుపు’ దశను అధిగమించటం కష్టమే అయినా దాని అనుభవాు ప్రపంచమంతా మెగును ప్రసరింపచేసేంత మివైనవి.
    నవంబరు 17 నుండీ, గడిచిన ఆరు వారాుగా ఫ్రాన్సు దేశంలో మెరిసే పసుపు చొక్కాు ధరించిన ఉద్యమకాయి ఊహించని రీతిలో ఆకస్మిక ఆందోళన కొనసాగిస్తున్నారు. డీజొపై 23 శాతం పెట్రోుపై 15 శాతం ధరను పెంచిన ఇమాన్యుయెల్‌ మాక్రాన్‌ ప్రభుత్వ విధానాకు వ్యతిరేకంగా కార్మికు, మధ్యతరగతివర్గాు సాగిస్తోన్న ఆందోళన ఇప్పుడే చల్లారేటట్లు లేదు. ఫ్రాన్సు దేశాన్ని ఆ ఉద్యమం ఎంత అతలాకుతం చేసిందంటే ఈ 6 వారా కాంలో ఫ్రాన్స్‌ దేశాధ్యక్షుడు తన జనాకర్షణను 23 శాతంÑ కేవం టూరిజంలో సుమారు 80 వే కోట్ల రూపాయ వ్యాపారాన్ని కోల్పోయారు. ఒక్కరోజుకు సరాసరిన క్షమందికి పైగా సందర్శకును ఆకర్షించే ఆ దేశం యిపుడు వెవెపోతోంది.
    ఎవరూ ఊహించని విధంగా క్షలాదిమంది (మొదటిరోజైన 17112018నాడు 3 క్షమందికి పైగా) బజారుల్లోకి వచ్చి రోడ్లనూ, వాహనాను ఆకస్మికంగా దిగ్బంధనం చేస్తే ఫ్రాన్సు ప్రభుత్వమే బిత్తర పోయింది. ప్రతిపక్షాు ‘‘మేమెరుగ, మేమెరుగ’’మంటూ నిజాలే చెప్పాయి. గుర్తింపు పొందిన ట్రేడ్‌ యూనియన్‌ నాయకులెవ్వరూ దీనికి నాయకత్వం అందించలేదు. సామాజిక మాధ్యమాలో రగుకుంటూ ఒక్కసారి ‘యెల్లోవెస్ట్‌’ (మెరిసే పసుపుచొక్కాు) ధరించినవారి ఉద్యమంగా, వడగళ్ళ వానలా కురిసింది. ఇంధన ధర పెంపుకు ప్రభుత్వం చెప్పిన సాకు ఏమిటంటే విపరీతమైన డీజిల్‌ వినియోగంతో ‘కర్బన ఉద్గారాు’ పెరిగి భూతాపం ఎక్కువవటానికీ పర్యావరణ కాుష్యం తీవ్రమవటానికీ కారణమవుతోందని! ఇంధనం ధరు పెంచితే వాటి వినిమయం తగ్గి కాుష్యం కూడా ఆ మేరకు తగ్గుతుందనిట!
    అయితే ప్రభుత్వ ఆర్ధిక దాడి అక్కడితో ఆగలేదు. పేద, మధ్యతరగతి వర్గా పెన్షన్లపై అదనపు పన్ను విధించారు. ఇవన్నీ జనవరి 1 నుండి అములోకి రావాలి. వాటికి నిరసనగా ప్రారంభమైన ప్రజా ఉద్యమం విద్యార్థుకు, నిర్మాణయుత కార్మికసంఘాకు కూడా విస్తరిస్తోంది. అలాగే ఉద్యమ డిమాండ్లు కూడా సంపన్నుకు తగ్గించిన పన్నును వ్యతిరేకిస్తోంది. తమ జీతాను పెంచానీ, మెరుగైన పెన్షన్లు కావానీ, సామాజిక అసమానతను తీవ్రంగా ప్రశ్నిస్తూ, విశ్వవిద్యాయాల్లో పేద విద్యార్థు ప్రవేశానికి గ అడ్డంకును తొగించానీ…. చివరగా ‘మాక్రన్‌ ప్రభుత్వం రాజీనామా చేయా’ని డిమాండ్‌ చేస్తూ సాగుతోంది. సారాంశంలో ఉదార ఆర్ధిక విధానాపేరిట అము జరుగుతున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణ దుష్ఫలితాపై ఎక్కుపెట్టేవైపుగా ఉద్యమం రూపం తీసుకుంటోందని పరిశీకుంటున్నారు. ఫ్రాన్స్‌ దేశాన్ని ‘మిలిటరిజం’ వైపుకి నిరంకుశంగా మార్చే ‘తప్పనిసరి మిలిటరీ శిక్షణ’ ఆదేశాల్ని వెంటనే ఉపసంహరించుకోవాని విద్యార్థు కోరుతున్నారు.
    నిర్మాణయుతమైన సంఘటిత పోరాటాు, ఉద్యమాలే కాకుండా కొన్ని ప్రత్యేక కారణా వ్ల ఆకస్మిక ఉద్యమాు (స్పాంటేనియస్‌ స్ట్రగుల్స్‌) కూడా వస్తాయి. పాకు ఏమిచేసినా ప్రజు నోరుమూసుకుని భరిస్తారు అనుకునేవారున్నారు. ఏదో వొక రాజకీయ పార్టీ రెచ్చగొడితే తప్ప ఆందోళనకు సిద్ధపడరనుకునేవారున్నారు. కానీ అవేమీ లేకుండా కూడా బాధిత ప్రజు, ప్రజాస్వామిక ఆకాంక్షు ప్రజల్ని ఉద్యమాల్లోకి పురిక్పొుతాయి అనటానికి తాజా ఉదాహరణే ఫ్రెంచి ప్రజ ‘మెరుపు చొక్కా ఉద్యమం’ (మనం కూడా గతంలో 1978లో రమీజాబీపై అడిక్‌మిట్‌ పోలీసుస్టేషన్లో జరిగిన అత్యాచారానికి నిరసనగా రాష్ట్రమంతా అట్టుడికిపోయిన సంఘటననూ, 1992లో మహిళు మద్యంపై సాగించిన ఉద్యమాన్ని చూశాము).
    ఫ్రాన్స్‌ అంటే విప్లవస్ఫూర్తిని ప్రపంచానికి ప్రసరించిన దేశం. 1789 నాటి రాచరిక భూస్వామ్యాన్ని తుడిచిపెట్టిన మహా విప్లవం, 1871లో మివైన గుణపాఠానందించిన ‘పారిస్‌ కమ్యూన్‌’, 1968లో ఫ్రెంచ్‌ విద్యార్థు ‘రెక్కలిప్పిన రిమ్యాషన్‌…. ఇవన్నీ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యం కవి. ఒక సంక్షోభం నుండి మరొక సంక్షోభంలోకి ప్రవేశిస్తున్న నేటి ప్రపంచ ఆర్థిక ` రాజకీయాలో ఎంతో ప్రజాభిమానంతో స్వతంత్ర అభ్యర్ధిగా, ‘రిపబ్లిక్‌ మార్చ్‌’ పార్టీ పేరుతో ఎన్నికైన మాక్రన్‌ ప్రభుత్వం కూడా రెండేళ్ళలోనే గిలిగిలాడక తప్పని పరిస్థితి. పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించి, పెంచే సామాజిక అసమానతు అనివార్యంగా ఎదుర్కొనే ప్రజా ప్రతిఘటనకు యివి నిరద్శనాు!!
  2. రాజకీయ ప్రమేయంతోనే మత హింసాకాండ!!
    34 సంవత్సరా క్రితం, ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులే చంపివేయగా, వారు సిక్కు మతస్తులైన కారణంగా ఢల్లీిలోనూ తదితర ప్రదేశాలోనూ సిక్కు మతస్తుపై క్రూర హత్యాకాండ జరిపి 4 రోజులో సుమారు 3350 మందిని అత్యంత పాశవికంగా చంపివేశారు. వారిలో ఢల్లీిలోనే 2700 మంది హత్యాచారాకు బలైనారు. ఈ ఘోర కలి నడుమ రాజీవుగాంధీని దేశ ప్రధానిగా ప్రణబ్‌ముఖర్జీ, పి.వి. నరసింహారావుతో కూడిన మూడు తకాయు నిర్ణయం చేశాయి. వారిలో మూడవ వ్యక్తి రాజీవుగాంధీనే కావటం భారత ప్రజాస్వామ్య విశేషం. ‘‘వట వృక్షం కూలినపుడు భూమి కంపించటం సహజం’’ అని యువ ప్రధాని రాజీవుగాంధీ ప్రకటించి, సిక్కుపై జరిగిన హత్యాకాండకు రాజకీయ ఆమోదాన్ని, ఆశీర్వాదాన్ని యిచ్చేశాడు.
    సిక్కుపై హత్యాకాండ సాగించినవారిపై కేసుూ, ఎఫ్‌.ఐ.ఆర్‌.ు, సాక్ష్యాూ, సాక్షు నమోదు ప్రక్రియనంతా కాంగ్రెసునేత కనుసన్నలో జరిపించి, జస్టిస్‌ రంఘనాధ్‌మిశ్రాతో న్యాయ విచారణ తంతుని నడిపించి, బాధితుకు కనీసం పార్లమెంటులో నివాళి కూడా యివ్వకుండానే అధికార బలాన్ని ప్రయోగించారు.
    ఇపుడు ఢల్లీి హైకోర్టు డిసెంబరు 17న సజ్జన్‌ కుమార్‌ (72) అనే ఆనాటి కాంగ్రేసు పార్లమెంటు సభ్యుని హంతకునిగా నిర్ధారించి యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. రాజకీయ ఛత్రచ్ఛాయలో ఎక్కువమంది నేరస్తు తప్పించుకున్నారనీ, పోలీసు, అధికార యంత్రాంగపు మద్దతుతో, కనుసన్నలో మత మారణహోమం సాగించారనీ కోర్టు చేసిన వ్యాఖ్యానాలే చెబుతున్నాయి. సిక్కుపై హత్యాకాండ తదనంతరం జరిగిన పార్లమెంటు ఎన్నికలో సానుభూతి మ్లెవతో కాంగ్రేసుపార్టీ, రాజీవుగాంధీ మంచి మెజారిటీతో గొపొందారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవసినదేమంటే ఆనాటి ఆరెస్సెస్‌ బహిరంగంగా కాంగ్రేసుపార్టీకి ఎన్నికలో మద్దతునందించి, కేవం 2 సీట్లనే భాజపార్టీకి మిగిల్చింది. తర్వాత వాజపేయి ప్రధానిగా వుండగా జస్టిస్‌ నానావతి కమిషన్‌ నియమించి విచారణ తిరిగి జరిపించారు. ఆ కమిషన్‌ నివేదిక ఆధారంగా 2005లో సిబిఐకి కేసును అప్పగించగా అది కేసు నమోదుచేస్తే, ట్రయల్‌ కోర్టును దాటి ఢల్లీి హైకోర్టులో సజ్జన్‌ కుమార్‌కు యావజ్జీవిత శిక్ష ఖరారయింది. ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశముంది కనుక, మొత్తంగా తేలేసరికి నేరగాళ్ళు జైు మెపలే సహజ మరణం పొందితే ఆశ్చర్యమేమీ లేదు. ఇదంతా తెలియపరిచేదేమంటే సంపన్న అధికారవర్గాు ఎంత ఘోర నేరాకు ప్పాడినా నేర ప్రక్రియను తప్పుకు తిరిగే సౌభ్యం వుంది. శిక్ష నుండి సువుగా జారుకునే కుగున్నాయి. అదే సామాన్యుడు ఉదా॥ ఆయేషా మీరా కేసులో సత్యంబాబులాగా పోలీసు తీవ్ర వేధింపుకూ, జైు శిక్షకూ బలికాక తప్పని పరిస్థితున్నాయి. ఈ సందర్భంగా ఢల్లీి హైకోర్టు తన తీర్పులో చేసిన ముఖ్యమైన వ్యాఖ్యానాను గమనించాలి. 1984లో సిక్కుపై జరిగిన హత్యాకాండ తరహాలోనే ‘‘1993లో (బాబ్రీ కూల్చివేత అనంతరం) ముంబాయిలోనూ, 2002లో గుజరాత్‌లోనూ, 2008లో ఒరిస్సాలోని కంధమాల్‌లోనూ, 2013లో ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోనూ హత్యాకాండు జరిగాయి. ఇవి మచ్చుకు మాత్రమే పేర్కొన్నాము. వీటన్నిటిలో సామాన్యాంశమేమంటే మైనారిటీ మతస్తుపైన గురిపెట్టి ఉన్మాదమూకతో దాడు చేయించటం. దాడుకు నాయకత్వం వహించిన వారిని చట్టాన్ని రక్షించాల్సినవారే కాపాడటం!! (ది హిందూ 18122018) పై వ్యాఖ్యానంలోవే కాక యింకా అనేకానేక మతోన్మాద దాడు, హత్యాకాండు సాగించటంలో సంఘపరివార్‌ దూకుడుగా సాగుతూండటం వ్ల మనం కాంగ్రెసు తరహా మత, కు, ప్రాంతీయోన్మాద రాజకీయా గురించి తక్కువ మాట్లాడుకుంటున్నామేమో కానీ ఈ విషయంలో కాంగ్రెసేమీ ‘మిస్టర్‌ క్లీన్‌’ కాదని గుర్తుపెట్టుకోవాలి. నిజానికి 1977లో ఇందిరా గాంధీ ఎన్నికలో ఓటమికి గురయిన తర్వాత కాంగ్రెసుపార్టీనే సిక్కు మతవాదాన్ని పంజాబులో ఆజ్యంపోసి పెంచి పోషించింది. భారత పాకవర్గాు ఆర్ధిక రాజకీయ సంక్షోభంలో కూరుకుపోతున్నకొద్దీ సమస్త నీచ మివనూ, అక్రమానూ, అప్రజాస్వామిక మత, కు, ప్రాంతీయ, హీన సంస్కృతును వ్యాప్తి చేస్తున్నాయి. మతోన్మాద రాజకీయాను అనుసరించటం భాజపాకుకు వ్యూహాత్మకమైన (స్ట్రాటజిక్‌) అంశమైతే, కాంగ్రేసు, తదితర ప్రాంతీయ పార్టీకది (టాక్టికల్‌) ఎత్తుగడకు సంబంధించిన విషయం. ఈ స్వ్పమైన తేడావల్లే భాజపాయేతయి ‘లౌకికవాదు’గా భ్రమక్పొుతూ వుండగుగుతున్నారు.
    మత విద్వేష హత్యాకాండకు పరాకాష్ట దేశ విభజన కాంలో జరిగింది. సుమారు 20 క్షమంది అమాయక హిందువు ముస్లిముూ సిక్కుూ (భారత పాకిస్తాన్‌ దేశాతో కలిపి) ఆనాడు హతులైనారు. క్షలాది మహిళు అత్యాచారాకు బలైనారు. ఒక కోటి 50 క్ష మంది తాము పుట్టిన ప్రదేశాను వీడి దేశ సరిహద్దుకావలికి పారిపోవసి వచ్చింది. ఆనాటి హత్యాకాండను భారత పాకిస్తాన్‌ పాకు నిువరించలేకపోయారు. కనీసం నాటికీ నేటికీ హత్యాకాండకు బయిన, బాధితుయిన పదు క్ష కుటుంబాకు ఈ రెండు ప్రభుత్వాూ, క్షమాపణు కూడా చెప్పలేదు. రాజకీయ ప్రయోజనాకోసం మత హత్యాకాండ, మత విద్వేషమూ, మైనారిటీపై విద్వేషపూరిత దాడుూ నిువరించాంటే ఉపఖండమంతా లౌకిక ` ప్రజాస్వామ్య సంస్కృతి నెకొనాలి. ఆ పని స్వార్ధ రాజకీయ ముఠాు ఎలాగూ చేయవు. ప్రజా ఉద్యమాలే, ముఖ్యంగా శ్రామికవర్గ ఉద్యమాు అందుకు పూనుకోవాల్సి వుంటుంది.
  3. భాండ శుద్ధిలేని పాకమే?
    ఈ నె 7వ తేదీన జరిగిన ఎన్నికలో తెంగాణా రాష్ట్రంలో కెసిఆర్‌ నాయకత్వాన పోటీచేసిన తెంగాణా రాష్ట్రసమితి నాల్గింట మూడు వంతు సీట్లను పొంది తిరుగులేని ఆధిక్యతను సాధించింది. కాంగ్రేసు నాయకత్వాన నాుగు పార్టీ మహాకూటమి ప్రయోగం చతికిపడిరది. సి.పి.ఐ(యం) బహుజన వామపక్ష కూటమి (బి.ఎల్‌.ఎఫ్‌) ఘోరంగా విఫమైంది. గడిచిన 70 ఏళ్ళ ఎన్నిక చరిత్రలో ఎన్నడూ ఎక్కడా లేనిది కమ్యూనిస్టు అభ్యర్ధు (సి.పి.యం) తాము పుట్టిన కులాు ప్రకటించుకుని ఈ ఎన్నికలో పోటీచేసినా ఆయా కులా ఓటర్లు కూడా వీరిని పట్టించుకోలేదు. దీన్నే ‘‘వ్రతం చెడ్డా ఫం దక్కక పోవటమ’’ని సామెత రూపంలో నానుడిగా చెప్పేవాళ్ళు.
    గడిచిన 70 ఏళ్ళల్లో మనదేశంలో బపడిరదేమంటే ఎన్నికలే ప్రజాస్వామ్యమనే భ్రమ! ఎన్నికనేవి ప్రజాస్వామ్య ప్రక్రియే తప్ప దానికదే ప్రజాస్వామ్యం కాదు. ఎన్నికు జరుగుతున్నాయి కనుక ప్రజాస్వామ్యం బపడుతోందని రకరకా మేధావుూ, మీడియా ఊదరగొడుతోంది.
    ఈ కాంలోనే సాంప్రదాయక కువ్యవస్థ బహీనపడుతూండటాన్నీ, ‘కుం’ అనే భ్రమాత్మక భావం బపడుతూ తన వంతు భౌతిక శక్తిని రాజకీయాలో ప్రదర్శిస్తూండటాన్నీ మనం గమనిస్తున్నాం. ప్రజాస్వామ్యం బపడుతూంటే, అప్రజాస్వామికమైన ‘కు’ భావం ఎలా వేళ్ళు తన్నుకో గుగుతోంది? మతం దాని సాకున ఉన్మాదం మర్రిచెట్టు ఊడల్లా ఎలా విస్తరించగుగుతోంది? మధ్యయుగా మౌఢ్యాు ‘పాతాళభైరవి’ సినిమాలో మాంత్రికునిలా తిరిగి ఎలా బతికొస్తున్నాయి?
    ఇవన్నీ అలా వుంచి…. ఎన్నికలో నిజమైన నిర్ణయాత్మక శక్తి ఏది? సరిగా 20 సంవత్సరా క్రితం ‘‘అసెంబ్లీలో నువ్వు అడుగిడాంటేను అరకోటి తక్కువకు అవకాశమే లేదు’’ అని ఒక పద్యంలో రాశాను. అదే యిప్పుడు 50 నుండి 100 రెట్లకు పెరిగింది కదా! అభ్యర్ధుందరూ ఒకే స్థాయిలో ఖర్చుపెడితే అపుడు ప్రజాభిప్రాయంది తుది తీర్పుగా భావించవచ్చు. 25 కోట్ల రూ. నుండి 50 కోట్లుదాకా ఖర్చు చేయగలిగినవారే ఎన్నిక పోటీలో తట్టుకోగలిగిన పరిస్థితి ఏర్పడినపుడు, ఏ కుస్తుడైనా కోట్లాది ధన వినమయస్తుడు కూడా అయితీరాలి కదా! అపుడీ అసెంబ్లీన్నీ ధని‘కు’గూరగంపు తప్ప మరేమవుతాయి?
    నాకు కరీంనగర్‌కు చెందిన ఒక కవి మిత్రుడు ఏం చెప్పాడంటే, ‘‘గడపాటి రాజగోపాల్‌ ప్రకటించిన ఎన్నిక సర్వే ఆనాటికి కరెక్టే. ఆ సర్వే రిపోర్టు కెసిఆర్‌ కళ్ళు తెరిపించి, గడపాటి నివేదికను వమ్ముచేసేట్లు ఓటుకు నోటు రేటును పెంచేవిధంగా, పురికొల్పింది. ఆ విధంగా కెసిఆర్‌కు గడపాటి మేలే చేశాడు’’ అని.
    ఇక్కడ విజయాు పొందుతున్నది చిత్ర విచిత్రమైన అమ్మకా కొనుగోళ్ళ జూదగొండి పొలిటికల్‌ ఎక్షనీరింగులో! సహజమైన ఎన్నిక ప్రక్రియలో కాదు. ధనమూ, కుమూ, మతమూ, సారాను (పేరుకి అవన్నీ చట్టవిరుద్ధమైనవి కనుక) ఎన్నిక ప్రక్రియ నుండి మినహాయిస్తే, ఎంతమంది ఓటర్లు పోలింగుబూతుకు వచ్చి ఓట్లు వేస్తారో పరీక్షించే అవకాశం ఎవరిస్తారు? ఒక్క విడతయినా ఉత్ప్రేరకాను అందరూ విడిచి పంచాయితీ నుండి పార్లమెంటు ఎన్నికదాకా పరిశీనకు, సామాజిక శాస్త్రజ్ఞు పరిశోధనకూ ప్రయోగశాగా వదిలితే ఎంత బాగుండును!!
    వేమన అన్నట్టు ‘‘భాండ శుద్ధిలేని పాకమలే’’, ఫుడ్‌ పాయిజనింగ్‌ అవటానికి తప్ప! ప్రజాస్వామ్యాన్ని విషపూరితం కావిస్తున్న ఎన్నికనే జూదగొండి ప్రక్రియను ప్రజాస్వామ్య విజయంగా చూపే కుహనా మేధావితనం ఎవరిని సమర్ధిస్తున్నట్లు?
    ఎన్నిక ముందువరకూ ఎన్నిక ప్రక్రియలో పెరిగిపోతున్న ధన వినిమయాన్నీ, కుం కార్డునీ, మతవాద ప్రచారాల్నీ మద్యం విస్తారంగా పంచుతూండటాన్నీ పత్రికలో వార్త రూపంలో అందిస్తున్న మీడియానే, ఆ తర్వాత అవేమీ లేనట్టూ…. అంతా ప్రజాస్వామికంగా, చట్టబద్ధంగా జరిగిపోయినట్టూ మట్లాడుతూంటాయి.
    ఇంతకూ నేడు ఎన్నిక ప్రక్రియలో పెరుగుతున్న సంస్కృతి ఏమిటీ..? ఒకవైపున ప్రజను రోజురోజుకీ భిక్షగాళ్ళుగా మారటానికి సిద్ధపడేట్టు దిగజార్చుతూ, మరోవైపు ధని‘కు’ కండ కావరాల్ని ప్రదర్శించుకోవటం!! దీన్ని మేము గిడసబారిపోయిన భారతీయ అర్ధవస ` అర్ధఫ్యూడల్‌ వ్యవస్థకు కాస్తున్న కుక్కమూతి పిందె రాజకీయ సంస్కృతి అంటున్నాము.

26122018 ` దివికుమార్‌

admin

leave a comment

Create Account



Log In Your Account