ఆనంద ఆదివారమా….

ఆనంద ఆదివారమా….

— అరుణ —


‘అమ్మా!’ అంటూ ఆనందంతో కేకు వేస్తూ ఇంట్లోకి దూసుకొచ్చాడు రవి.
ఆ వయసు అంతే, 16 ఏళ్ళ ప్రాయం. తూనీగలా దొరక్కుండా ఎగురుతుంటారు. దారం కడదామని ప్రయత్నిస్తామా, చిక్కినట్లే చిక్కి దారంతో సహా ఎగిరిపోతారు. వాళ్ళకి వాళ్ళే గొప్ప. ప్రపంచాన్ని వాళ్ళ కళ్ళతో చూడమంటారు. ఏదో అద్భుత ప్రపంచంలో తేలియాడుతూ, పెద్దవాళ్ళని ధిక్కరిస్తూ, ప్రతిదీ ఛాలెంజింగ్‌ స్వీకరిస్తూ…. స్వేచ్ఛాలోకంలో విహరిస్తుంటారు.
‘‘అమ్మా, రేపు మర హ్యాపీసండే తొసా. నేను బాగా డాన్సు చేస్తున్నానని నన్ను రేపు కూడా ప్రోగ్రాంకి రమ్మన్నారు. ప్లీజ్‌ అమ్మా, వెళ్తానే’’ అంటూ అమ్మ గడ్డం పట్టుకుని బతిమలాడుతున్నాడు రవి. అమ్మ భుజాను కుదుపుతూ ఒప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు వాడు.
ఇంతలో గేటు ముందు బండి ఆగిన శబ్దం వినపడిరది. నాన్న వచ్చారన్నమాట. రవి హుషారంతా చప్పున చల్లారిపోయింది. అమ్మవైపు చూసి ప్లీజ్‌ అని కన్నుగీటి, కాలేజి నుండి రాగానే స్నానం చేయకపోతే వూరుకోని తండ్రి ఇంట్లోకి వచ్చేలోపలే స్నానా గదిలోకి దూరాడు.
రవి నాన్న నారాయణ వస్తూనే, ‘‘వీడెంతసేపైంది వచ్చి? షూ, స్టాండ్‌లో పెట్టలేదు. బ్యాగ్‌ని అమరలో పెట్టలేదు. కారేజి వాకిట్లోనే వదిలేశాడు’’ అంటూ ఆ తప్పంతా అవాట్లు నేర్పని అమ్మదే అయినట్లు గుడ్లురిమి రవికి వినపడేలా అరచి రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. నాటకంలోని పాత్రలా ఆయన పాత్రని తండ్రి పోషించాడన్నమాట.
రవి అమ్మ శాంత కూడా కొద్ది నిముషా క్రితమే ఇంటికి వచ్చింది. కాళ్ళూ, ముఖం కడుక్కుని మంచినీళ్ళు తాగుదామని వంటగదిలోకి వచ్చిందో లేదో అంతలో రవి వచ్చాడు. వాడు మాట్లాడుతూనే వున్నాడు భర్త నారాయణ రానే వచ్చాడు. ఇహ సర్దే టైమెక్కడిదీ.
శాంత డిగ్రీ వరకూ చదువుకుంది. డిగ్రీ ఫైనల్‌ పరీక్షు రాసిన వెంటనే ఆర్థిక పరిస్థితు సహకరించకపోవటంతో పై చదువుకు పంపకుండా ఆమెకు పెళ్ళి చేశారు తల్లిదండ్రు. శాంత స్నేహితుంతా బి.ఇడి చేస్తున్నారని తనకీ చేయాని వుందని పెళ్ళైన కొత్తల్లో భర్తని అడిగింది శాంత. ‘‘నీవు చదువుూ సంధ్యూ అంటే ఇంట్లో పనులెవరు చేస్తారు, చదువుకయ్యే ఖర్చు ఎక్కడ నుండి వస్తుంద’’ని విసుక్కునేసరికి అభిమానవతి ఐన శాంత మారు మాట్లాడకుండా గృహిణి పాత్రలో ఒదిగిపోయింది.
పెరుగుతున్న ధరు, అవసరాు, ఖర్చు వ్ల బాబుకి 5 ఏళ్ళు వచ్చిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళక తప్పలేదు శాంతకి. ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా చేస్తోంది. పని భద్రత లేని ప్రైవేటు ఉద్యోగాు ఎక్కువ పని చేయించుకుంటూ తక్కువ జీతం ఇస్తారన్నది అందరికీ తెలిసిందే. అందునా ఆడవాళ్ళైతే నోరెత్తరు గనుక మరింత చాకిరీ చేయించు కుంటారు. పాపం! శాంత కూడా స్కూు నుండి వచ్చేసరికి తోటకూర కాడలా వడలిపోతుంది. కాస్తంతైనా విశ్రాంతి తీసుకుంటే గానీ ఉత్సాహం రాదు. రేపు ఆదివారమే గదా కాసేపు రిలాక్స్‌ అయ్యాకే ఇంట్లో పను జోలికి వెళ్దామని నిశ్చయించుకుని మరీ ఇంటికి వచ్చింది. కానీ ఏం లాభం కొడుకు, భర్త ఒకరి తర్వాత ఒకరు వచ్చి ముందుంచిన పనును తచుకుంటూ విశ్రాంతిని పక్కకు నెట్టింది.
నారాయణ కూడా ప్రైవేటు కంపెనీలో ఉద్యోగస్థుడే. ఎడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో చేస్తాడు. చొరవగానూ కుపుగోుగా వుంటూ ఆఫీస్‌లో అందరితో స్నేహంగా ఉంటాడు. కానీ ఏ పనీ పూర్తిచేయడు. ఎక్కువకాం ఎవరితోనూ సంబంధాు కొనసాగించడు. కష్టపడతాడు గానీ ఏదీ నిుపుకోడు. ఎప్పుడూ లెక్కు మీద లెక్కు వేస్తూ, డబ్బు దాచాని, దాచటానికి డబ్బు లేవని ఆదుర్దా పడుతూ వుంటాడు. తనెప్పుడూ కరెక్టేననీ ఎదుటవాళ్ళదే తప్పని వాదిస్తూ ఉంటాడు.
ఇంట్లో మాత్రం నారాయణ శాంతకు భర్త, రవికి తండ్రి. రవిని క్రమశిక్షణలో పెట్టటం అనేది ఆయన సింగిల్‌ పాయింట్‌ ఎజెండా. ఆ పేరుతో నిరంతరం అతని పనున్నీ పర్యవేక్షిస్తూ, చేసిన ప్రతి పనినీ విమర్శిస్తూ, విశ్లేషిస్తూ సరిచేస్తుంటాడు. ఇక శాంతకి ఐతే అతను ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. హఠాత్తుగా వంటగదిలోకొచ్చి కూరు తరగటం వంటి పను చేసి సోషల్‌ మీడియాలో అప్‌డేట్స్‌ పెడ్తుంటాడు. శాంత ఏం చేసినా ఇదేంటి ఇలా చేశావ్‌ అంటూ అలాక్కాదు, ఇలా అంటూ ఆమె చేసిన ప్రతి పనినీ సరికాదంటూ తప్పు ఎన్నుతుంటాడు. ఏమడిగినా ఎందుకు, ఏమవసరం అంటాడు. ఆయనకేం తోస్తే అదే చేస్తాడు. ఎందుకరుస్తాడో తెలియదు. ఎందుకు వాటేసుకుంటాడో తెలియదు. అదే ప్రేమని, నీకు తెలియదంటాడు. బాధ్యతగా వుండటం మాత్రమే తెలిసిన శాంతకు ఈ అయోమయ లోకం అర్ధంగాక రవిని జాగ్రత్తగా పెంచటంపైనే శ్రద్ధ పెట్టింది. రవి ఎక్కడ నారాయణ ప్రభావానికి గురౌతాడో నన్న భయంతో అతని చుట్టూ తన కాలాన్ని కవచం చేసింది. వాడికి అమ్మేలోకం. అమ్మకు రవే లోకం.
రవికి పదవ తరగతిలో 10కి 10 పాయింట్లు వచ్చాయి. అమ్మా కొడుకు ఆనందానికి అవధు లేవు. రవి ఏం చదివాడో ఏమో కానీ శాంత మాత్రం పరీక్షని తెలిసినప్పటి నుండి కళ్ళల్లో వత్తులేసుకుని వాడిని చదివించింది. వాడికి కావాల్సినవి చేసి పెట్టటం, సర్దిపెట్టటం వాడితోపాటు మేల్కోవటం, వాడు జాగ్రత్తగా నిద్రపోతున్నాడా లేదా అని కాపలా కాయటం అలా వాడికంటే ఎక్కువ కష్టపడిరది. రిజ్ట్సు వచ్చినరోజు రవి పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రికి చెప్పాడు. నారాయణ రవికి కంగ్రాచ్యులేషన్స్‌ చెప్పలేదు సరికదా, నిజమా! అని అడిగాడు. రవి చిన్నబుచ్చుకున్నాడు. ‘‘నీకు ఏ వస్తువు ఎక్కడ పెట్టటమో రాదు, ఇన్ని మార్కు ఎలా వచ్చాయిరా’’ అని వికటాట్టహాసం చేశాడు. పాపం, వాడికి ఏడుపొకటే తక్కువ. బిక్కమొహం వేశాడు. ఏం చేసినా, ఎలా చేసినా నాన్న తప్పు పట్టటంతో రవి గందరగోళపడుతూ ఏ పనుూ చేయకుండా తయారయ్యాడు. నారాయణ వ్యంగ్య ధోరణి తెలిసిన శాంత రవిని మరింతగా రక్షిస్తూ వుండటం వ్ల, చాలాసార్లు అచేతనంగా వుండిపోయేవాడు. నారాయణ, రవిని పేరెన్నికగ కాలేజీలో ఇంటర్‌మీడియట్‌ కోర్సులో జాయిన్‌ చేశాడు. శాంతకు అటువంటి రుబ్బుడు కాలేజీంటే ఇష్టంలేదు. రవి ధైర్యం చేసి అక్కడ వద్దు నాన్నా అని చెప్పలేడు. భర్త శాంత మాటను ఖాతరు చేయడు గనుక ఆమె మాట్లాడటం అనవసరం అని వూరుకుంది. నారాయణతో మాట్లాడటంలో చర్చ ఉండదు. ఆర్గుమెంట్‌తో కూడిన గొడవ వుంటుంది. చాలా రభస చేస్తాడు. అతనితో ఎంత వాదించినా తప్పు అని ఒప్పుకోడు చివరకు గేలి చేస్తూ మాట్లాడతాడు. మగవాడినన్న ధీమా అతనిది. చివరికి ఆ ఛీత్కారాను భరించాల్సింది శాంతే. అందుకే ఆమె అతనితో ఏ విషయము గురించి మాట్లాడదు. అసు ఆమె అభిప్రాయాన్నే బయట పెట్టదు. రవి కాలేజీలో చేరాడు. మొదట్లో అక్కడి టీచింగ్‌ విధానానికి, కాలేజి టైమింగ్స్‌తో ఇబ్బందిపడినా త్వరగా సర్దుకున్నాడు. రోజూ ఇంటికి వచ్చి లెక్చరర్స్‌ చెప్పే విధానం గురించి, ఫ్రెండ్స్‌ ఎవరు ఎలా వున్నారో అమ్మతో సరదాగా కబుర్లు చెప్పేవాడు. వాడితో ఉన్నంతసేపు అమ్మ ఆనందానికి అవధుండవ్‌. వాడిక చదువులో పడ్డాడని ఆనందంగా వుంది. ఓరోజు క్లాసుకి సర్కుర్‌ వచ్చింది. ప్రతివారం ప్రభుత్వంవారు నిర్వహిస్తున్న ఆనంద ఆదివారం ఈసారి వీళ్ళ కాలేజి వున్న ప్రాంతంలో జరుగుతుంది కనుక అందరూ పాల్గొనాని వచ్చిన సర్కుర్‌లో అది రవికి అంత ఇష్టంగా లేకపోయినా ఫ్రెండ్స్‌ బవంతం మీద తను కూడా పాల్గొనానుకున్నాడు. అమ్మతో చెప్పాడు. డ్రస్‌, షూ కొనటానికి ఖర్చు అవుతుందికదమ్మా అందుకనే ముందు వద్దనుకున్నానని ఫ్రెండ్‌ బవంతం మీద సరేనన్నానని చెప్పాడు. వాడెప్పుడూ పాపం ఏమీ అడగడు. పుట్టినరోజుకు తప్ప కొత్తబట్టూ కొనరు. అదైనా తను కొనటమే. పోన్లే, ఫ్రెండ్స్‌ అందరి ముందు చిన్నబుచ్చుకోవటం ఎందుకులే అని శాంత ఫర్వాలేదు పాల్గొనమంది. మొదటి ఆనంద ఆదివారంనాటి వాడి పెర్‌ఫార్మెన్స్‌ను చూసి వాళ్ళమ్మ మురుసుకుంది. న్లటి గళ్ళ టీషర్టు, లేత గోధుమరంగు ఫ్యాంటు, వాటికి నప్పే షూ, తమీద వెడల్పాటి గుండ్రటి పెద్ద టోపీ, పాటకు అనుగుణంగా చకచకా చురుకుగా కదుతున్న వాడి అడుగు వెరసి వాడిని అందరూ అభినందించారు. ఆ రూపం, వాడి డాన్సు అమ్మ కళ్ళముందు మెదుతూనే వుంది. ఆనంద ఆదివారం పుణ్యమా అని రవికి కొత్త కొత్త స్నేహాు పెరిగాయి. వేరే కాలేజీల్లో చదువుతున్న ప్లితోనూ స్నేహాు ఏర్పడ్డాయి. అప్పటివరకు అమ్మ చెంగు పట్టుకుని తిరిగినవాడు కాస్తా అమ్మతో సెటైర్‌ు వేస్తూ, నాకివి కావాలి, అవి కావాలి, నేనిలా వుండాంటూ గారాు పోతూ అమ్మను ప్రేమ పేరుతో లొంగదీసుకుంటున్నాడు రవి. స్నేహాూ స్నేహితు ఊహాలోకపు ప్రాయం వాడిని ఉత్తేజపరుస్తున్నాయి. అమ్మకు చెప్పకుండా ఇప్పటివరకూ ఏమీ చేయనివాడు కాస్తా ఇప్పుడు అమ్మకు నచ్చేవి మాత్రమే చెబుతున్నాడు.
ఆనంద ఆదివారం కార్యక్రమాలో వాడి పెర్‌ఫార్మెన్స్‌ని, వాడిలోని టాలెంట్‌ను అందరూ గుర్తిస్తున్నారనే ఉత్సాహం వాడిది. స్కూళ్ళు, కాలేజీలో ఎడతెరపి లేకుండా కూర్చొని చదువును మాత్రమే పొందుతున్న ప్లికి ఇదొక ఆటవిడుపు మరి. చదువుతో పాటు ప్రతిరోజూ కరికుంలో ఉండవసిన ఆట పాటు ప్లి నిద్ర టైమ్‌లోకి, కుటుంబంతో గడిపే టైమ్‌లోకి వచ్చేశాయి.
రకరకా కార్యక్రమా ప్రాక్టీసు, ప్రిపరేషన్‌లో భాగంగా కావల్సినవాటి కోసం వెతుకులాట, దొరికించుకున్న ఆనందం, గ్రూపు మధ్య పోటీ, బైక్‌ రైడిరగ్‌ు, ఫుడ్‌కోర్టు, షికార్లు ఇలాంటి కొత్త కొత్త కార్యక్రమాు, స్నేహపు సమూహా మధ్య రవి కెరటంలా ఎగిసిపడుతున్నాడు.
శాంత మాత్రం వాడి స్నేహాు, ఇంటి పట్టున ఉండకుండా తిరగటం, ఏ విషయాూ పంచుకోకపోవటం, ఖర్చు ఎక్కువగా పెట్టటం ఇవన్నీ ఎటు దారితీస్తాయోనని భయపడుతుంది. వాడేం చెడిపోడులే నా ప్రేమేమీ బహీనమైనది కాదులే అని సరిపెట్టుకుంటుంది.
రవికి మోహన్‌, సాయి, వెంకట్‌ ఫ్రెండ్స్‌ అయ్యారు. వాళ్ళు కారుల్లోనో, బుల్లెట్‌ బైక్‌ మీదో తిరుగుతుంటారు. వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులే ప్రతిరోజూ పాకెట్‌మనీగా వేయి రూపాయిలిస్తారు. వాళ్ళు దేనికీ వెనకాడకుండా డబ్బు ఖర్చుపెడతారు. తల్లిదండ్రు అంగీకారం తీసుకోకుండా వాళ్ళకి అన్పించింది అన్పించినట్లు చేసేయటం, ఎవర్నీ లెక్క చేయకపోవటం రవిని బాగా ఆకర్షించాయి. వాళ్ళతో వుంటే సినిమా హీరోలా దర్జాగా ఉన్నట్లు అన్పించేది. ఎన్ని మార్కు తెచ్చుకుంటే మాత్రమేమి. ఎంత క్రమశిక్షణగా ఉంటేనేమి ఈ దర్జానే వేరు. వాడికి ఏదో ఉన్నతిని సాధించిన భావం ముఖంలో ప్రతిఫలిస్తోంది.
అమ్మకు బాగా చదువుతున్నానని చెబుతూ, స్నేహితుతో ఇక్కడవరకేనంటూ రాత్రిళ్ళు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న మిడ్‌నైట్‌ హోటల్స్‌కి, ఫ్రెండ్స్‌తో షికార్లకి అవాటుపడ్డాడు. ఇవన్నీ చదువు మధ్యలో రిలాక్సింగ్‌గా వాడికనిపిస్తుంది. అలా తిరగటంలో తప్పేముందని అమ్మతో వాదిస్తున్నాడు కూడా.
అర్ధరాత్రి వరకూ మేల్కోవటం, అప్పుడేవో పిచ్చి తిండ్లు తినటం, నిద్రలేకుండా గడపటం, ఫోన్లలో ఛాటింగ్‌, కదిలిస్తే కసురుకోవటం, ఎక్కువ మాట్లాడకపోవటం శాంతకు రవి ప్రవర్తన భయాన్ని కల్గిస్తోంది. వాడు అమ్మ మాటను ఖాతరు చేయటంలేదు. నారాయణకు చూచాయగా చెప్పి చూసింది. కొడుకుని సరిగ్గా పెంచటం చేతకాని శాంతను, ఆమె పెంపకంలో ఉన్న తప్పును ఏకరువుపెట్టి చేతు దుపుకున్నాడు. అంతటితో ఆయన బాధ్యత తీరిపోయింది మరి. ఆయన తండ్రి కదా!
రవి తనకోసమే ఒక గది కేటాయించమని అమ్మపై వత్తిడి చేస్తున్నాడు. అది సింగిల్‌ బెడ్‌రూమ్‌ హౌస్‌. ఇంకో గది ఎక్కడి నుండి తెస్తుంది. ఉన్న రూమ్‌ను ఖాళీ చేయమని భర్తను ఒప్పించటం కష్టం. వాడి గో భరించలేక, రోజూ ఘర్షణ పడలేక హాులోనే పార్టీషిన్‌ కట్టించి వాడికో రూమ్‌ను తయారు చేయించింది. భర్త గొడవ చేశాడు ఏమిటిదంతా అని. చదువుకోవటానికి మీగా వుంటుందని ఆ ఏర్పాటు చేశానని భర్తని ఒప్పించగలిగింది శాంత.
రానురాను రవి ప్రవర్తనలో తేడాను శాంత స్పష్టంగా చూస్తుంది. ఏమీ పట్టనితనం. ఎదురుగా ఉన్నా దేన్నీ గమనించటంలేదు. అన్నం పెడ్తాను నాన్నా అన్నా విసుక్కుంటున్నాడు. ఇంటికి ఏ అర్ధరాత్రికో చేరుకుంటున్నాడు. సరాసరి తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఏమీ మాట్లాడడు. తట్టుకోలేక ఏడుపును దిగమింగుకుంటూ బతిమలాడినా ‘‘నీకెలాగూ స్వేచ్ఛ లేదు, నన్ను కూడా స్వేచ్ఛగా ఉండనివ్వవా’’ అంటున్నాడు. చదువుతున్నాడో లేదో కూడా తెలియదు. ఫోన్‌ ఛాటింగ్‌, మిడ్‌నైట్‌ హోటల్స్‌. శాంతకు ఏమీ పాుపోవటంలేదు.
రవి మారతాడో లేదోనన్న సందేహం శాంతను పట్టి పీడిస్తుంది. ఆశన్నీ వాడిమీదే పెట్టుకుంది. వాడే తన సంతోషం అనుకుంది. అనుకోనిదేదో జరిగిపోతుంది. వాడేమై పోతున్నాడు. తన కొంగు పట్టుకు తిరిగిన తన కొడుకు తనెవరో తెలియనట్లు అయిపోతున్నాడేంటి. వాడిలో మార్పు వస్తుందా? పాత రవి అవుతాడా? ఇవే ఆలోచనతో శాంత కృంగిపోతుంది.
నారాయణకు ఇవేం పట్టలేదు. తనక్కావల్సినవన్నీ భార్య సమకూరుస్తుందా లేదా? అమర్చి పెడుతుందా లేదా, రోజుకు 2, 3 రకా కూరు వండి పెడుతుందా లేదా? తన పను, తన తిండి తను అంతే. కొడుకును మంచి కాలేజీలో చేర్పించాడు. అంత ఫీజు తీసుకుంటున్నప్పుడు చదువు వాళ్ళ బాధ్యతే, వాడికి తక్కువ మార్కు వస్తే కాలేజీ వాళ్ళను తాటతీస్తానంటాడు.
స్నేహితు ప్రభావంతో రవికి బీరు ఆ తర్వాత వైన్‌ అవాటయినట్లుంది. అది రానురాను పెరిగిపోయి అనతికాంలోనే వ్యసనమయిపోయింది. అమ్మకు తెలియకుండా వుండాని పొద్దుపోయి రావటం, అమ్మ అడిగితే కసురుకుంటూ రూమ్‌కి వెళ్ళి పడుకోవటం చేస్తున్నాడు. త్లెవారున నిద్ర లేవగానే రాత్రి తాగిన విషయం గుర్తొచ్చి సిగ్గేస్తుంది వాడికి. పొద్దుటే అమ్మ ముఖం చూడగానే తనలో తనే ముడుచుకుపోతున్నాడు.
తప్పు చేస్తున్నానన్న అపరాదభావం రవిని వేధిస్తోంది. కానీ స్నేహితు ఆ మాయా ప్రపంచంలోకి వెళ్ళగానే ఏం జరుగుతుందో తెలియదు. అమ్మ ముఖం చూసినపుడు జాలేస్తుంది. తన కోసమే అమ్మ కష్టపడుతోందని తొసు. ఆమె కళ్ళ చుట్టూ వున్న నుపు, పీక్కుపోయిన ముఖం అమ్మ బాగా పాడయి రూపురేఖు లేకుండా అవుతోంది. అమ్మను చూసినపుడు మాత్రం ఈ అవాట్లన్నీ మానుకోవానుకుంటాడు. రాత్రికి స్నేహితు కవగానే ఏమౌతుందో తెలియదు. మనసంతా గజిబిజి అయిపోతుంది. ఏదో అసంతృప్తి కసిగా వుంటుంది. ఏం చేస్తున్నాడో తెలియకుండానే చేసేస్తాడు.
రవిని చూసి ఆందోళన చెందటం తప్ప శాంత ఏం చేయలేకపోతుంది. ఏ జన్మలో పాప ఫలితమో అనుభవించాలి గదా, నా నుదుటి రాత ఇంతే అని సర్దుకుంది. పంతుగారి సహా మేరకు పూజూ, వ్రతాూ చేస్తోంది. ఉపవాసాు, నోము, పేరంటాళ్ళతో రోజు గడిచిపోతున్నాయి.
ఇంట్లో మార్కు చూపించటం మానేశాడు రవి. అంతా పైవాడే చూసుకుంటాడన్న నిర్లిప్తతతో శాంత ఉంది. డబ్బు కట్టాం, ఎవడికోసం చదువు చెప్తారని నారాయణ పట్టించుకోవటం లేదు. ఈ వెసుబాటుతో రవి మరింతగా పతనం కాసాగాడు.
పరీక్ష సమయం వస్తోంది. రవి వాకంలో మార్పులేదు. శాంత ఏం చేయాలా అని ఆలోచిస్తూ స్కూు నుండి రాగానే నడుం వాల్చింది. అంతలోనే నిద్రలోకి జారుకుంది. రాత్రి 10 గం॥వుతుంది. చెల్లొ కూతురు సుమతి ఫోన్‌ చేస్తే మెకువ వచ్చి టైం చూసుకుంది.
‘‘పెద్దమ్మా ఎలా వున్నావు? ఏం చేస్తున్నావ’’ంది సుమతి.
శాంతకు అలా పట్టించుకునేవారున్నా రనుకోగానే దుఃఖం పొంగుకు వచ్చింది. రవి ఏం చేస్తున్నాడని సుమతి అడిగింది.
‘‘ఫ్రెండ్స్‌తో చదువుకోవటానికి బయటకు వెళ్ళాడు. పరీక్షు కదా’’ అంది శాంత.
‘‘పెద్దమ్మా నీకో విషయం చెప్పాలి,’’ ఏడుపు గొంతుతో అంది సుమతి.
అయ్యో, ప్లి ఏడుస్తోంది, ఏం జరిగిందోనని బెంబేు పడిపోయింది శాంత, అసలే రోజు బాగోలేదాయె.
‘‘రవి నిన్న నాకు ఫోన్‌ చేశాడు. పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు పెద్దమ్మా’’ అన్నది.
‘‘ఏమని మాట్లాడాడమ్మా.’’
‘‘నీవంటే నాకిష్టం. ఇప్పుడు నిన్ను నూడ్‌గా చూడానుంది. వీడియో కాల్‌ చెయ్‌. నిన్ను మొత్తం చూపించు, చూపించేదాకా చెయ్యి కోసుకుంటూనే వుంటా’’నన్నాడు.
శాంతకు స్పృహ కోల్పోయినంత పనైంది. ఏం వింటున్నాను, బ్రతికే ఉన్నానా అనుకుంది.
సుమతి ఇంకా చెబుతూనే ఉంది.
శాంత వ్ల కావటంలేదు. ఊ కొట్టడం కూడా చేయలేక పక్కనే కూబడిరది.
‘‘నీవేం బాధపడకు పెద్దమ్మ, నీ పెంపకంలో వాడు అలా ఎందుకవుతాడు. వాడెవరికన్నా నా ఫోన్‌ నెంబరు ఇచ్చాడేమో, ఇంకెవరన్నా మాట్లాడేరేమో’’ అని సర్దిచెబుతుంది సుమతి.
‘‘వాడు తాగుతున్నాడా పెద్దమ్మా’’ అని అడిగింది.
‘‘వాడు చాలా ఎబ్‌నార్మల్‌గా వున్నాడు. ఏదో లోకంలో వున్నట్లు మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందెప్పుడూ అలా లే’’డంది.
‘‘ఒరేయ్‌ నీకు చెల్లినవుతానురా అన్నాను. కాదు బావ అనమన్నాడు. నీవు నేను చెప్పినట్లు చేయకపోతే, చచ్చిపోయి ఆత్మనై నీవెంట తిరుగుతానన్నాడు.’’
‘‘నాకో బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడు పెద్దమ్మా. వాడి గురించి అమ్మ, నాన్నతో చెబుతానని బెదిరించాడు. వీడియో కాల్‌ చేస్తావా లేదా అని బ్లాక్‌మెయిల్‌ చేశాడు.’’
‘‘నాకెందుకో భయం వేస్తుంది పెద్దమ్మా, ఎవరికి చెప్పుకోను?’’ సుమతి చెబుతూనే వుంది.
శాంత వింటుంది. కర్తవ్యం ఏమిటో బోధపడటంలేదు.
ఏం చేయాలి? వాడికి ఫోన్‌ చేసి అడిగిస్తే, అమ్మో, తెల్సిపోయిందనుకుని ఏమన్నా చేసుకుంటాడేమో…
మరేం చేయాలి. పోలీసుకి పట్టిస్తే….
వాళ్ళేం చేస్తారు? భర్త అన్నట్లే నీ కొడుకుని నీవు పెంచుకోలేవా? అంటారేమో. పనమ్మాయి భర్త తాగుతున్నాడని, వేధిస్తున్నాడని పోలీసు స్టేషన్‌కి వెళ్తే, ఎవరైనా విటు వచ్చినపుడు నీకు ఫోన్‌ చేస్తాం, వస్తావా? అని అడిగారంట.
అర్ధరాత్రి రోడ్ల మీద పడి తిరిగేలా చేస్తున్నవాళ్ళు, ప్లిల్ని పట్టించుకోనివాళ్ళు, వాళ్ళేం చేస్తారు.
ఏం చేయాలి? నాకీ శిక్ష ఏమిటిరా నాయనా?
ఇలా కావాని పెంచానా వాడిని?
ఏది చెడు, ఏది మంచి నేర్పించాను.
ప్రేమపూరితంగా ఉండాని తెలిపాను.
అందుకా ఈ శిక్ష? అయ్యో, చేసిన పూజ ఫలితమంతా ఏమయ్యింది, ఇదేమిటి సొంత చెల్లెలితోనా ఇలా మాట్లాడేది?
గుండెవిసేలా ఏడుస్తోంది.
గురకపెడుతూ గాఢ నిద్రలో వున్న భర్తని ఆమె ఎక్కిళ్ళ శబ్దం లేపలేకపోయాయి.
నెమ్మదిగా హాల్లోకి వచ్చి టేబుల్‌ దగ్గర కూర్చొని రవి కోసం ఎదురు చూస్తోంది. రవి రానే వచ్చాడు. అమ్మను గమనించకుండానే సరాసరి రూమ్‌లోకి వెళ్ళి తుపులేసుకున్నాడు.
తుపు వైపు నిర్వికారంగా చూసింది.
ఇప్పటివరకూ జరుగుతున్నదంతా తన ఖర్మ అనుకుంది. మొక్కుకున్న దేవుళ్ళన్నా, చేసిన పూజ ఫలితమైనా వాడి బుద్ధిని మార్చకపోతాయా అనుకుంది.
సుమతి అన్నట్లు నా పెంపకం ఇలా అయ్యిందేమిటి?
వాడెందుకు అలా అయ్యాడు. ఇంట్లో ఆర్ధిక పరిస్థితు అన్నీ వాడికి తొసు.
ఖర్చు లెక్కంతా వాడిచేతే వేయిస్తానుగా. వాడేదంటే అదే ఎప్పుడూ చేయలేదు కూడా. పరిస్థితును వాడికి అర్థం చేయించాను.
ఈ స్నేహాు ఏమిటో?
ఈ ఆనంద ఆదివారాు ఎవరికోసమో, ఎందుకోసమో? ఏ మిమ నేర్పిస్తున్నారు?
అర్ధరాత్రి హోటళ్ళను ఎందుకు నడుపుతున్నారు?
ముక్కుపచ్చలారని ప్లికి తాగ బోయిస్తుందెవరు? కుటుంబాలో చిచ్చు పెడుతుందెవరు?
శాంతకు బాధకన్నా, అవమానం ఎక్కువ వేధిస్తుంది. దారితప్పిన కొడుకు వ్ల నుగురిలో పరువేం కావాని భయపడుతుంది.
తన ముఖం తను చూసుకోవటానికే భయపడుతుంది.
ఒక్క క్షణం రవిని చంపేసి తానూ చచ్చిపోవానుకుంది.
ఇన్ని కష్టాకోర్చి బ్రతుకుతుంది ఇందుకా అనుకుంది.
ఈ దుఃఖం ఎలా తీరుతుంది?
కొడుక్కి ఏమన్నా అయితే అన్న ఊహనే భరించలేని శాంత, తన కొడుకుని చెడ్డవాడుగా సమాజానికి చూపించుకోలేని శాంత కాసేపు ఘర్షణ పడ్డారు, వేదన పడ్డారు.
తెల్లారిపోయింది.
ఏమి చేయాలో తోచక తచ్చాడుతున్న శాంతకు తన కొలీగ్‌ సునీత గుర్తుకొచ్చింది. ఆవిడ ఏదో సాహిత్యసంస్థలో పనిచేస్తూ కరపత్రాు పంచేది. పత్రికకు చందాు కట్టించేది. పేపర్లో నిర్భయలాంటి సంఘటను జరిగిన వెంటనే స్టాఫ్‌రూమ్‌లో మీటింగ్‌ పెట్టేది. ప్లికి ఎప్పుడూ అందరం సంతోషంగా వుండే సమాజం రావాని బోధిస్తూ వుంటుంది.
సునీత గుర్తుకురాగానే శాంత మనసు ఏదో దారి దొరికినట్లు కుదుటపడిరది. భర్తకు కాఫీ కలిపి ఇచ్చి, కారేజీు సిద్ధంచేస్తూ ఉండగా అనిపించింది. ఒకవేళ సునీతతో కూడా పరిష్కారం కాకపోతే ఈ కారేజీలోనే విషం కపాన్న ఆలోచన వచ్చింది శాంతకు.
ఆ ఆలోచనకే నిువునా కంపించిపోయింది.
దేవుడా! అందామని నోరు తెరచి అయ్యో అనుకుంది. రవి వచ్చి కారేజి తీసుకున్నాడు. వాడిని పరీక్షగా చూసింది. వాడి ముఖం అంతా పీక్కుపోయింది. కళ్ళు గుంటు పడ్డాయి. జుట్టు పెరిగింది. చొక్కా బాగా ూజు అయ్యి వేలాడుతుంది. వీడు నా రవేనా, నీకేమిటిరా ఈ కష్టం అనుకుని గుండెకు హత్తుకోవా నుకుంది. వాడు నన్నూ ఎలా చూస్తాడో అనే ఆలోచన వచ్చి భయకంపితురాలైంది.
ప్లిు ఇలా ఎందుకవుతున్నారు? తల్లిదండ్రు నుండి ప్లిను వేరు చేస్తుంది ఎవరు? ఏ తల్లీ తన ప్లిు చెడిపోవాని అనుకోదుగా.
శాంత స్కూుకు వెళ్ళటమే సరాసరి సునీత దగ్గరకి వెళ్ళింది. పర్సనల్‌ విషయం మాట్లాడాని చెప్పింది.
శాంత అంటే స్కూులో అందరికీ గౌరవమే. సీనియర్‌ టీచర్‌గానేకాక భూదేవి కున్నంత సహనం, ఓర్పు ఉన్న టీచర్‌గా అందరూ ఆమెను ప్రేమగా చూస్తారు. ఈ మధ్య శాంత ఎందుకో నిస్సత్తువగా పరధ్యానంగా వుండడం సునీత గమనించకపోలేదు. కాకపోతే కుటుంబాలో హింస మామూలేగా అనుకుంది.
ఖాళీ పీరియడ్‌ చూసుకుని సునీత శాంతని కలిసింది.
ఎక్కడ మొదుపెట్టాలో, ఎలా చెప్పాలో….
ముందే తన్నుకొస్తున్న ఏడుపును ఆపుకుంటూ రవి విషయం చెప్పింది శాంత.
‘‘నేను ఎప్పుడూ నాకు తెలిసి ఎవరికీ అన్యాయం చేయలేదు, మోసమూ చేయలేదు. అందుకని వాడిని విచ్చవిడిగానూ పెంచలేదు. వాడెందుకిలా అయ్యాడు’’ అని సునీత చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చింది. భూమిలోకి కృంగిపోతున్నట్లుంది ఆమెకు.
సునీతకూ బాధేసింది. ఎవరితోనూ ఎప్పుడూ కనీసం పెద్దగా కూడా మాట్లాడని శాంతకు ఎంత కష్టమొచ్చింది అనుకుంది.
కుటుంబమే ప్లిల్ని పెంచదనీ సమాజమే పెంచుతోందని శాంతకు అర్ధం చేయించాను కుంది. రవి ఇలా కావటానికి కారణం నీవు కాదు అని చెప్పానుకుంది. ఎవరి ప్రయోజనా కోసం ఇక్కడ బ్యాం బందీ అవుతుందో, చదువు పేరుతో హింసింపబడు తున్నారో సినిమాు, టి.వి.ు, ఇంటర్‌నెట్‌ు, పబ్‌ు, మిడ్‌నైట్‌ హోట్సు, ఆనంద ఆదివారాు ఎందుకు నిర్వహింపబడుతున్నాయో, ఎలా విషసంస్కృతి ప్రబుతోందో, జీవితాు ఎందుకు విచ్ఛిన్నమవుతున్నాయో, కుటుంబాు ఎలా వీధిపావుతున్నాయో వివరించానుకుంది.
సునీత ఆవేశాన్ని తగ్గించుకుని తన విద్యార్థు సహాయంతో రవిని హాస్పిటల్‌లో చేర్పించింది.
వాడొక పట్టాన లొంగలేదు. చాలా గలాభా చేశాడు. విరగ్గొట్టాడు, విసిరికొట్టాడు. బీభత్సం చేశాడు. వాడికి ఆ్కహాల్‌ మాత్రమే కాదు, డ్రగ్స్‌ కూడా అవాటయ్యాయని డాక్టర్స్‌ చెబితే శాంత త్లడిల్లిపోయింది.
డాక్టర్స్‌ వస్తున్నారు, చూస్తున్నారు.
రవి కాసేపు బాగానే వుంటున్నాడు. అంతలోనే కోపంతో వూగిపోతున్నాడు. తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. వెర్రిగా నవ్వుకుంటున్నాడు. పిచ్చిగా శూన్యంలోకి చూస్తూ వున్నాడు….
డాక్టర్‌గారు వచ్చారు, ప్లిు ఏమౌతున్నారో, ఎలా వుంటున్నారోనని గమనించుకోవాలి గదమ్మా అన్నారు. దీనికంతటికీ కారణం నేనే అయినట్లు.
డాక్టర్‌గారు అదే అన్నారు. మా ఆయన అదే అన్నారు, పకరించటానికి వచ్చిన స్నేహితు, చుట్టాు అదే అన్నారు. ఒక సునీత తప్ప.
వాడు పొద్దున 7 గం॥కి బడికెళ్తే రాత్రి 8 గం॥కు వస్తున్నాడు. అలా చదివించకపోతే ఈ గడ్డు రోజుల్లో ఉద్యోగాు వస్తాయో, రావో…. ఉద్యోగా పోటీ ఎలా వుంది? ఆ పోటీలో గెవాంటే అలా చదువుకోవాల్సిందేగా. అనుభవపూర్వకమైన చదువును ప్లికి దూరం కావటానికి నేను కారణం కాదే, చదివిన వాళ్ళకి ఉద్యోగాు చూపించక పోవటానికి నీ ఇష్టమొచ్చినట్లు బ్రతకటమే గొప్పతనమనే హీరోయిజపు సినిమాు నన్ను నాలాంటి అమ్మల్ని అడిగి తీయటం లేదే.
రోజుకో కొత్తరకం ఫోను, కొత్తరకం బండ్లు, రకరకా బ్రాండెడ్‌ దుస్తు, వస్తువు ఒకటేమిటి పదిరూపాయు సంపాదిస్తే వెయ్యి రూపాయు ఖర్చు పెట్టించే విధానాు, అలా ఖరీదైన బ్రతుకే ‘హుందాతనం’ అనే భ్రమకు కారణం నేను కాదే. ముక్కుపచ్చలారని ప్లికి ‘మందు’ అవాటు చేస్తుందెవరు, మాదకద్రవ్యాు ఎక్కడ నుండి వస్తున్నాయి. ప్లి జీవితాల్లో ఒత్తిడి ఎక్కడిది?
ఆనందం అంటే తిని, తిరిగి, ఆడి పాడటమనే ఆనంద ఆదివారా సంస్కృతికి కారణం ఎవరు? మివను ధ్వంసం చేస్తుందెవరు? మివల్లేని సమాజంలో ఈ తరం ప్లిల్ని లాక్కెళ్తుంది ఎవరు?
ఎవరి ప్రయోజనాకి ప్లిు బలౌతున్నారూ? కారణమా! నీవు కన్పించని అదృశ్య శక్తివి కావు. మా శక్తి యుక్తును క్లొగొడుతున్న వర్గంచే పోషించబడుతున్న విషసంస్కృతివి. యుద్ధం ప్రకటిస్తున్నాం ` కాచుకో…. ఆవేశంగా అనుకుంది శాంత.

admin

leave a comment

Create Account



Log In Your Account