అన్నసత్రాలు – ప్రజావేగు టీ.వీ పరిశీన

అన్నసత్రాలు – ప్రజావేగు టీ.వీ పరిశీన

— గౌరీ శంకర్ —

ప్రభుత్వం ఆర్భాటంగా, హడావిడిగా ఏర్పాటుచేసిన ‘అన్నసత్రాు’ ఎలా పనిచేస్తున్నాయో తొసుకోవడానికి ‘ప్రజావేగు టెలివిజన్‌’ తన ప్రతినిధును రాష్ట్రంలోని ఆయా కేంద్రాకు పంపింది. ఒక బృందం వైశాఖపురంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఏర్పాటుచేసిన సత్రం వద్దకు చేరుకుంది. అప్పుడు సరిగ్గా మధ్యాహ్న భోజన సమయం. సత్రం ముందు జనం బాయి తీరి వున్నారు. పథకం బ్రహ్మాండంగా నిర్వహింపబడుతున్నట్లుంది అనుకున్నారు బృందంలోని సభ్యు. సత్రంలోనికి ప్రవేశించింది బృందం. భోజనం చేస్తున్న ఒక వ్యక్తితో మాట్లాడటం మొదుపెట్టారు.
‘‘నువ్వేం చేస్తుంటావు?’’
‘‘భవన నిర్మాణ కూలిని.’’
‘‘భోజనం ఎంతకు పెట్టారు?’’
‘‘5 రూ॥కు.’’
‘‘భోజనం ఎలా వుంది?’’
‘‘రుచిగానే వుంది.’’
‘‘ఇంతకు ముందు ఎక్కడ తినేవాడివి?’’
‘‘బయట ఒక చిన్న హోటల్లో తినేఓణ్ణి.’’
‘‘ఎంత ఖర్చు చేసేవాడివి?’’
‘‘ముప్ఫై రూపాయు.’’
‘‘దీని గురించి నువ్వేమనుకుంటున్నావు?’’
‘‘భోజనం రుచిగానే వుంది. అయితే కూర, అన్నం ఒకసారి మాత్రమే వడ్డిస్తున్నారు. మాలాంటి పేదవారికి కడుపునిండా పెట్టానుకుంటున్నాను.’’
‘‘అయ్యా! మీరు చెప్పండి. మీరేమనుకుంటున్నారు ఈ కార్యక్రమం గురించి?’’
‘‘అనుకునేందుకేం వుందండి, ఇది మంచి కార్యక్రమమే. నేను అడుక్కుంటూ వుంటాను. 5 రూ॥కే భోజనం పెడుతున్నారని తెలిసి వొచ్చాను. గంటసేపట్నుంచి లైన్లో వున్నాను. తీరా ఇప్పుడు భోజనం అయిపోయిందంటున్నారు. అటు సూడండి! స్కూటర్లమీదా, బళ్ళ మీదా భార్యా ప్లితో వచ్చి ఎలా తిన్తొన్నారో మాలాంటి నిజమైన పేద్లోకి తిండి దొరకడంలేదు. ఇది అన్యాయం కదా! ఆకలితో వున్నోళ్ళందరికీ పెట్టగలిగితేనే గదా ఇది నిజంగా మంచి కార్యక్రమం అవుతుంది. ఏవంటారు?’’
ఇంకొక బృందం కైలాసపురం వెళ్ళింది. అక్కడకు వెళ్ళేసరికి సత్రం గేటు మూసేసి వుంది. గేటు బయట నిబడి కొందరు కేకు వేస్తున్నారు.
‘‘ఏమైంది?’’ అని ఒక వ్యక్తిని పుకరించాడు టి.వి. ప్రతినిధి.
‘‘చూడండి! ఒక అరగంటే టోకెన్లిచ్చి భోజినాలైపోయాయని గేట్లు మూసేసారు.
అడిగితే మీకు సమాధానం సెప్పాల్సిన అవసరం లేదంటున్నాడు. ఈ్ల సంగతి మీకు తెలీదండి. మిగిలిపోయిన భోజనాన్నీ అమ్మేసుకోడానికే సూత్తన్నారు. మీరే అడగండి.’’
‘‘ఏమండీ, ఏమిటి విషయం? నిజంగా భోజనాలైపోయాయా?’’
‘‘అయ్యా! నేనిక్కడ సెక్యూరిటీ గార్డును. 300 భోజనాలే వచ్చాయి, అయిపోయాయి. అదే చెబుతుంటే వీళ్ళు నమ్మడంలేదు. మేమేం చేస్తాం చెప్పండి?’’
మరొక బృందం కాంటూరు రామాటాకీస్‌ సెంటర్‌లో పెట్టిన సత్రం వద్దకు చేరుకుంది. బయట అంతా కోలాహంగా వుంది. చాలామంది వెనుదిరిగి వెళ్తున్నారు. బహుశా భోజనాు చేసేసి వెళుతున్నట్లున్నారు అనుకున్న ప్రతినిధి ఒక వ్యక్తిని పిలిచి అడిగాడు.
‘‘అయ్యా! మీరు భోజనం చేయడానికొచ్చారా?’’
‘‘అవును.’’
‘‘చేసేసారా?’’
‘‘ఏటి సేత్తావండి? వచ్చిన్లోు రెండువే మందున్నారు. టోకెన్లు మూడొందమందికిచ్చారు. ఇప్పుడు మల్లీ రెండు కిలోమీటర్లు యెనక్కు నడుసుకెల్లి నపై రూపాయలెట్టి బోంచెయ్యాలి. సూడండి యెంతమంది యెనక్కి తిరిగెల్లిపోతన్నారో, ఇదేం బాగనేదండి.’’
‘‘అయ్యా! మీరు చెప్పండి, ఈ పథకం గురించి మీరేమను కుంటున్నారు?’’
‘‘పథకం మంచిదేనండి. పేదోళ్ళకి తక్కువ ధరకే కడుపు నిండుతుంది. కాకపోతే జనం మరింత సోమరిపోతులైపోతారండి. అటు చూడండి! తాగి వస్తున్నారు, తినేసి పోతున్నారు. ఇంటికైనా వెళ్తున్నారో, లేదో. అదండీ సంగతి!’’
వేరొక బృందం ఖాసింకోట అగ్గిమర్రిచెట్టు దగ్గరున్న సత్రానికి వెళ్ళింది. తీరా అక్కడికి వెళ్ళేసరికి అసు సత్రం తెరవనే లేదని తెలిసింది. చాలా కొద్దిమంది వచ్చిపోతున్నట్లుగా వుంది. వాళ్ళలో వాళ్ళు వివిధ రకాుగా వ్యాఖ్యానాు చేసుకుంటున్నారు.
ఒకాయన ఇలా అంటున్నాడు. ‘‘ప్రచారం చేయడానికి పెట్టే వంద కోట్లు దీని మీద పెడితే పేదకింత తిండి దొరుకుతుంది. ఇది చాలా అన్యాయం. ఆర్భాటంగా పథకాు మొదుపెట్టేసి వాటిని ఆదిలోనే నీరుగార్చేస్తే ప్రజు ఆ మాత్రం అర్థం చేసుకోలేని వెర్రివాల్లేం కాదు. ఎలా బుద్ధిచెప్పాలో వారికి తొసు.’’
చదువుకున్నవాడిలా కన్పిస్తున్న ఒక వ్యక్తిని టి.వి. ప్రతినిధి పుకరించాడు.
‘‘ఏమైంది? ఇక్కడ సత్రం అసు తెరిచినట్లే లేదు?’’
‘‘ఔనండీ! నాుగు రోజు క్రితం మా ఎమ్మెల్యేగారు హడావుడిగా ప్రారంభోత్సవం చేసారు. వంటకాు రుచిచూసి చాలా బ్రహ్మాండంగా వున్నాయని, ఇటువంటి పథకం దేశంలోనే ఎక్కడా లేదని పొగడ్త వర్షం కురిపించారు. మళ్ళీ ఈరోజు వరకూ దీనిని తెరవనే లేదు. ఎన్నిక మానిఫెస్టోలోని 31వ పేజీలో ఈ పథకం గురించి చెప్పారు. ఒక రూపాయికే టిఫిన్‌ పెడతామని, 5 రూ॥కే భోజనం పెడతామని చెప్పుకున్నారు. తీరా చేసి టిఫిన్‌ కూడా 5 రూ॥ని ఇప్పుడంటున్నారు. అలాగైనా ఫర్వాలేదు. కానీ అసు సత్రమే తెరవలేదుగా. జనాల్ని మోసం చేయడానికి కాకపోతే పదవిలోకొచ్చిన నాుగున్నరేళ్ళకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది వీళ్ళకు అన్నసత్రాు తెరవాని. ఎందుకు హడావిడిగా ప్రారంభోత్సవాు చేసేస్తున్నారు. ఎన్నిక స్టంటు కాకపోతే మరేమిటండీ?’’
అప్పుడే అటుగా తన మోటర్‌సైకిల్‌పై పోతున ఒక వ్యక్తి టి.వి. ప్రతినిధును చూసి అక్కడికి వచ్చాడు. ‘‘సార్‌! నేను చెబుతాను వినండి. ఈ మొత్తం పథకాన్ని ఓ యిద్దరు మంత్రు కాంట్రాక్టుకు తీసుకున్నట్లుగా మాకు తెలిసింది. వాళ్ళ అనుచరుతో ఈ కేంటీన్లని నడుపుతున్నారు. అక్షయపాత్ర వాళ్ళకి ఒక్కొక్క భోజనానికి డెబ్భై రూపాయు చెల్లిస్తున్నారట. ఒక్కొక్క కేంటిన్‌ పెట్టడానికి కోటి రూపాయు ఖర్చట. బ్రహ్మాండంగా కమీషన్లు సంపాదిస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టు. కాదు.. కాదు…. మూడు పిట్టు. పేద్లోకి అతి తక్కువకే భోజనం, టిఫిన్‌ పెడుతున్నట్లు వుంది. ఎన్నిక ప్రచారం జరుగుతున్నట్లుంది. పెద్ద్లోకి జేఋ నిండిపోతున్నాయి. అవండీ తెలివితేటంటే!’’
‘‘చూస్తుంటే మీరు ప్రతిపక్షానికి చెందినవాళ్ళలా వున్నారే!’’
‘‘నేనొక కంప్యూటర్‌ ఆపరేటర్నండీ, మనకెందుకు ఈ పార్టీు? మీరలా అన్నారు కాబట్టి నేనొక వీడియో క్లిప్పింగ్‌ చూపిస్తాను చూడండి.’’
‘‘ఓప్‌ా! ఎంతలా తోసుకుంటున్నారు చౌకగా దొరికే భోజనా కోసం. అరెరె వచ్చినవాళ్ళని కొడుతున్నారే…. లాగిపారేస్తున్నారు కూడా….’’
‘‘అన్నిచోట్లా యిలా ఉండకపోవచ్చు సార్‌. కానీ పేదరికం ఇంకా ఎక్కువగానే వుందని చెప్పుకోవాలి. ఔనంటారా?’’
ఒక బృందం రాజధానికి దగ్గరలోనున్న ఒక మోస్తరు పట్టణంలో నిర్వహింపబడుతున్న ఒక సత్రానికి చేరుకుంది. భోజనావుతున్నాయి. ఒక టేబుల్‌ వద్ద ఒక మహిళ భోజనం చేస్తోంది. టి.వి. ప్రతినిధి ఆమెను పుకరించింది.
‘‘మీరేం చేస్తుంటారు?’’
‘‘ఎమ్మార్వో ఆఫీసులో కాంట్రాక్టు బేసిస్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాను.’’
‘‘భోజనం ఎలా వుంది.’’
‘‘బాగుందండి! రుచిగా వుంది, వేడిగా వుంది.’’
‘‘ఇంతకు ముందు ఎక్కడ తినేవారు?’’
‘‘యింటి దగ్గర నుండి ఉదయాన్నే వండి తెచ్చుకునేదాన్ని. చల్లారిపోయి వుండేది. యిప్పుడు వేడివేడిగా తింటున్నాను. హెల్త్‌కి మంచిది కదండీ.’’
‘‘సార్‌! మీరు చెప్పండి. ఈ పథకం ఎలా వుందనుకుంటున్నారు?’’
‘‘పథకం మంచిదేనండి. పేదోళ్ళకి మూడు పూటలా మంచి తిండి తక్కువకే దొరుకుతుంది కదండీ. కాకపోతే ఈ పథకం ఎన్నాళ్ళు నడుస్తుందో…. ఏమో!’’
‘‘ఎందుకలా అంటున్నారు?’’
‘‘ఎందుకేంటండి? నిన్నా మొన్నా పేపర్లు చూస్తే ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉందంటున్నారు. ఈ నె జీతాు చెల్లించడానికే డబ్బు లేని పరిస్థితంటున్నారు. మరోపక్క రెండువంద కోట్లతో అమరావతిలో ఎన్‌టిఆర్‌గారి స్మారక వనం ఏర్పాటుచేస్తారట. ఎక్కడనుంచొస్తాయండీ వీటన్నిటికీ డబ్బు?’’
అటువైపుగా వెళుతున్న ఒక విద్యార్థి బృందం టి.వి. ప్రతినిధును చూసి అటువైపు వచ్చింది.
‘‘మేడమ్‌ ఈ పథకం గురించి నేను మాట్లాడానుకుంటున్నాను’’ అంది ఒక విద్యార్థిని.
‘‘మీరేం చేస్తున్నారు?’’
‘‘నేను యూనివర్శిటీ స్టూడెంట్‌ను’’
‘‘ఏం చెప్పానుకుంటున్నారు?’’
‘‘యువతకు ఉద్యోగాు కల్పించకుండా నిరుద్యోగభృతి పేరుతో వెయ్యి రూపాయు పంచుతున్నారు. కొంతమంది యువకు కేవం అయిదు వంద రూపాయతో మూడు పూటలా తిని తిరుగుతున్నారు. ఇది నిష్క్రియాపరత్వానికి దారి తీస్తుంది. మరొక విషయం తెంగాణలో 10 జిల్లాల్లో ఇదే పథకాన్ని అముచేయడానికి 11 కోట్లు ఖర్చు చేస్తే ఇక్కడ 13 జిల్లాకు 200 కోట్లు ఖర్చు చేస్తున్నామంటున్నారు. అంటే ఇందులో అవినీతి జరుగుతున్నదనే కదా. అందరూ ఆలోచించాల్సిన విషయం ఇది!’’
టి.వి. స్టేషన్‌లో వివిధ బృందాు రికార్డు చేసిన వీడియో క్లిప్పింగును ప్రసారం చేసిన, మీదట ఆ కార్యక్రమ వ్యాఖ్యాత ఇలా అంటున్నారు. ‘‘మా ప్రియమైన ప్రేక్షకుందరికీ శుభోదయం! మా ప్రతినిధు సేకరించిన వివిధ వీడియో క్లిప్పింగు చూసారు కదా. మిశ్రమ స్పందన కన్పిస్తోంది. పథకం మంచిదేనంటున్నారు. మెనూ రుచిగానే వుందంటూనే తగినంత ఆహారం పెట్టడంలేదంటున్నారు. నిజమైన పేదవారికి అందాల్సినవి మధ్యతరగతివారు లాక్కుంటున్నారని ఆరోపిస్తున్నారు. కొందరైతే ప్రచారానికి పెడుతున్న ఖర్చుని ఇటువైపు మళ్ళిస్తే కడుపునిండా తిండి పెట్టవచ్చంటున్నారు. మరి కొందరేమో ఇది ప్రజాకర్షక పథకమని, ఓట్ల బ్యాంకుగా మచుకోదచే ఎన్నిక ముందు పెట్టారని, దీనివన ప్రజు సోమరిపోతుగా మారే అవకాశం వుందని అంటున్నారు. మరికొందరు ఇందులో అవినీతి ఎంత దాగివుందో చెప్తున్నారు.
చూస్తూనే వుండండి, మరిన్ని విశేషాతో త్వరలోనే మరలా మీ ముందుకొస్తుంది ప్రజావేగు టి.వి. అంతవరకూ అందరికీ సెవు! బై బై!!

admin

leave a comment

Create Account



Log In Your Account