— బాలాజీ — కలకత్తా
నవంబర్ 10-17 తేదీల్లో 16 విభాగాల్లో 70 దేశా 171 సినిమాతో 15 హాళ్లలో 24వ కోల్‌కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరిగింది. పూర్తినిడివి కథా చిత్రాతో పాటు 150 డాక్యుమెంటరీూ, ఘుచిత్రాూ అదనంగా వున్నాయి. భారత అంతర్జాతీయ చనచిత్రోత్సవం ఢల్లీికి (ఆ తర్వాత గోవాకి) శాశ్వతంగా చేరి, నాుగేళ్ల కొకసారైనా కకత్తాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరిగే వీల్లేదని తేలిపోయిన తర్వాత, కలకత్తా సినీ ప్రేమికు కోసం వామపక్ష ప్రభుత్వం ‘కకత్తా ఫిల్మ్ ఫెస్టివల్’ అనే పోటీరహిత ప్రదర్శన ప్రారంభించింది. కకత్తా పేరు మారిన తర్వాత అది కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్‌గా, మామాతా బెనర్జీ హయాంలో హంగూ ఆర్భాటం ఎక్కువై, ‘కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ పేర కార్నివల్‌గా అభివృద్ధి చెందింది. తళుకుబెళుకు ఆరంభ, అంతిమ కార్యక్రమాు ఫెస్టివల్లో భాగమయ్యాయి. భారీ నగదు బగుమతుతో పోటీ విభాగాు ప్రారంభమయ్యాయి. మొదట్లో ప్రగతిశీ అంశాపై వుండే సినిమాలే ఎక్కువగా వుండేవి. కానీ ఇప్పుడు ఇతివృత్తం ఏదైనా అంతర్జాతీయ చనచిత్రోత్సవాల్లో పాల్గొంటే చాు కోల్‌కతా ‘మెనూ’లోనికి చేరిపోతున్నాయి సినిమాు. కొన్ని ఫక్తు కమర్షియల్స్ (సంఖ్యలో తక్కువైనా) లిస్టులో తిష్ట వేస్తున్నాయి. కానీ, ‘రాజహంస’ల్లాంటి సినీ ప్రేమికు తమకు కావసిన పాను నీళ్ల నుంచి వేరుచేసుకుని ఆస్వాదిస్తున్నారు. ఈ యేడాది సినిమా ఉత్సవ ప్రధాన కేంద్రం ‘నందన్’ పరిసరాు భారీ పోస్టర్లతో ‘మమతా’మయం కావడం వివాదానికి దారితీసింది. ‘పోస్టర్లలో కనిపిస్తున్న ఈవిడ ఏయే సినిమాు తీసిందో నాకైతే తెలీదు’ అని ఒక బెంగాలీ యువ దర్శకుడు ‘ప్యానెల్ డిస్కషన్’లోనే అనేశాడు. హౌరా జిల్లా వార్డు కౌన్సిర్ నిర్మించిన నాుగు నిమిషా తృణమూల్ ప్రచార సినిమాను షార్ట్ ఫిల్మ్ విభాగంలో చూపడంతో రచ్చరచ్చ ఐపోయింది. కాబట్టి రాబోయే రజతోత్సవ సంబరంలో ఈ పొరపాట్లు జరక్కపోవచ్చని ఆశించవచ్చు.
ఎన్నెన్నో విభాగాల్లో ఎన్నో సినిమాు :
బెంగాలీ సినిమాకు వందేళ్ళు నిండిన సందర్భంగా బెంగాలీ సినీ గమనానికి ప్రాతినిధ్యం వహించే సినిమాను ‘100 యేళ్ళ సినిమా’ విభాగంలో చూపారు. బెంగాలీ పనోరమా విభాగంలో ఇంకా విడుదకాని ఐదు సినిమాను చూపారు. సునీల్ బెనర్జీ 1967లో నిర్మించిన ‘ఏంటనీ ఫిరంగీ’ సినిమాని ప్రారంభ సినిమాగా చూపారు. ఇవే కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘పునరుద్ధరించిన క్లాసిక్స్’ విభాగంలో సత్యజిత్ రాయ్ అపూ త్రయంతో (పథేర్ పాంచాలీ, అపరాజితో, అపూర్ సంసార్) పాటు నాట్యకారుడు ఉదయ్ శంకర్ 1948లో నిర్మించిన ‘క్పనా’, ఫెడెరికో ఫెలినీ ‘అమార్కార్డ్’, మైకెలేంజెలో ఏంటోనియోని ‘బ్లో అప్’, ఓర్సన్ వేల్స్ ‘ది మాగ్నిఫిసెంట్ ఎంబర్సన్స్’, ఎప్పటికీ అజరామరమైన విటోరియో డి సికా ‘బైసైకిల్ థీవ్స్’ సినిమాు చూపించారు. ఈ సంవత్సరం ఫోకస్ దేశంగా ఆస్ట్రేలియాని ఎంచుకున్నారు. ఐకానిక్ ఆస్ట్రేలియన్ సినిమా, సమకాలీన ఆస్ట్రేలియా సినిమాతో పాటు, ఆ దేశపు ఘనాపాటి ఫిలిప్ నాయిస్ నిర్మించిన ఎనిమిది సినిమాను రెట్రోస్పెక్టివ్ విభాగంలో చూపారు. ఇరాన్ దర్శకుడు మాజిద్ మాజిదీ సినిమాు మరో రెట్రోస్పెక్టివ్ విభాగంలో చోటుచేసుకున్నాయి. స్పెషల్ ఫోకస్‌గా సమకాలీన ట్యునీషియా దేశపు సినిమాు చూపించారు. స్వీడన్ మాస్టర్ ఎర్నెస్ట్ ఇంగ్మర్ బర్గ్మన్ సినిమాు ఏడిరటినీ, మేరీ నైరిరాడ్ అతనిపై నిర్మించిన ‘బర్గ్మన్ ఐల్యాండ్’ అనే మూడు గంట డాక్యుమెంటరీని చూపి ఆ మహాదర్శకుడికి శతవార్షిక నివాళి అర్పించారు. స్పెషల్ స్క్రీనింగులో ఆదిత్య విక్రమ్ సేన్‌గుప్తా దృశ్యకావ్యం ‘జొనాకి’, సుజిత్ సర్కార్ ‘అక్టోబర్’, సంజయ్ నాగ్ ‘యువర్స్ ట్రూలీ’తో పాటు శివేంద్రసింగ్ దుంగర్పూర్ చెకోస్లొవేకియా సినిమాపై నిర్మించిన 429 నిమిషా నిడివిగ ‘చెక్‌మేట్: ఇన్ సర్చ్ ఆఫ్ జిరి మెంజెల్’ డాక్యుమెంటరీని చూపారు. గ్రేట్ మాష్టర్‌గా బిమల్ రాయ్ ‘పెహలా ఆద్మీ’, ‘యహూదీ’, ‘సుజాత’ వంటి ఐదు సినిమాను ప్రదర్శించారు. అరుదైన అ్పసంఖ్యాక భారతీయ భాషల సినిమా విభాగంలో ఎనిమిది సినిమాను ప్రేక్షకు ముందుంచారు. మేస్ట్రో విభాగం అతిరథమహారథు తాజా సినిమాతో కిక్కిరిసిపోయింది. దక్షిణ కొరియా కిమ్ కి దుక్ ‘హ్యూమన్, స్పేస్, టైం అండ్ హ్యూమన్’, ఫ్రాన్స్ గొదార్ ‘ది ఇమేజ్ బుక్’, పోలెండ్ పావెల్ పావ్లికోవస్కీ ‘కోల్డ్ వార్’, ఇరాన్ జాఫర్ పనాహీ ‘3 ఫేసెస్’, టర్కీ నూరీ బిల్జె సీలాన్ ‘ది వైల్డ్ పియర్ ట్రీ’, డెన్మార్క్ లార్స్ వా ట్రయర్ ‘ది హౌస్ దట్ జ్యాక్ బిల్ట్’, గ్యాస్పర్ నో ఫ్రెంచి మ్యూజికల్ ‘క్లైమాక్స్’, నాుగు గంట నిడివి గ వ్ డియాజ్ ఫిలిప్పీన్స్ మ్యూజికల్ ‘సీజన్ ఆఫ్ ది డెవిల్’ ఇలా దేన్నొదిలి దేన్ని చూడాలా అన్నట్టుంది ఈ విభాగం. ‘సినిమా ఇంటర్నేషనల్’ అన్నది అంతర్జాతీయ సినిమా అతిపెద్ద విభాగం. చనచిత్రాల్లో సరికొత్త ఒరవడి దిద్దిన ‘ఇన్నోవేషన్ ఇన్ మూవింగ్ ఇమేజెస్’ పేర అంతర్జాతీయ చనచిత్రా పోటీ, భారతీయ చన చిత్రా పోటీ, ఎంపిక చేసిన ఆసియా సినిమా పోటీ (నెట్‌ప్యాక్ అవార్డు)తో పాటు డాక్యుమెంటరీ, ఘుచిత్రా కోసం పోటీ విభాగం, సాధారణ ప్రదర్శన విభాగం వున్నాయి. చిల్డ్రెన్స్ స్క్రీనింగ్ విభాగంలో బహు ప్రశంసు పొందిన ఆదిత్య ఓమ్ ‘ది టీచర్’తో పాటు మరో రెండు భారతీయ సినిమాు, ‘సుపా మోడో’ అనే జర్మనీ సినిమా ప్రదర్శించారు.
పోటీల్లో గొపొందిన సినిమాు :
అంతర్జాతీయ సినిమా పోటీ విభాగంలో ఏష్ మే ఫెయిర్ నిర్మించిన వియత్నాం సినిమా ‘ది థర్డ్ వైఫ్‌్’ బెస్ట్ సినిమాగా 51 క్ష రూపాయ చెక్కుతో సహా గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డు గొచుకుంది. ఇంత ఖరీదైన సినిమా అవార్డు ఇంకెక్కడా లేదని ప్రశంసించాడు విశేష అతిథిగా వచ్చిన దర్శకుడు సుజిత్ సర్కార్ . ఈజిప్టు సినిమా ‘యొమెద్దినె (జడ్జిమెంట్ డే)’ దర్శకుడు అబూ బకర్ సావ్కీ 21 క్ష రూపాయ చెక్కుతో బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నాడు. బెంగాలీ సినిమా ‘తారీఖ్’ దర్శకురాు చుర్నీ గంగులీకి, ‘జెనెజిస్ (జెనెసిస్)’ అనే హాంగరీ సినిమా దర్శకుడు అర్పద్ బోగ్దాన్‌కూ జ్యూరీ స్పెషల్ మెన్షన్ సర్టిఫికెట్లు అందించారు. భారతీయ సినిమా పోటీ విభాగంలో ప్రవీణ్ మోర్చాలే సినిమా ‘విడో ఆఫ్ సైలెన్స్’ ఉత్తమ సినిమాగా 7 క్ష రూపాయ చెక్కు, ట్రోఫీతో హీరాలాల్‌సేన్ మెమోరియల్ అవార్డు గొచుకుంది. భూకేంద్ర సిద్ధాంతాన్ని నేటికీ ప్రచారం చేసుకు తిరిగే కె.సి.పాల్‌పై నిర్మించిన ‘సూర్జొ ప్రితిబీర్ చార్‌దికే ఘొరె (ది సన్ గోస్ రౌండ్ ది ఎర్త్)’ సినిమా దర్శకుడు అరిజిత్ విశ్వాస్‌కు ఉత్తమ దర్శకుడిగా హీరాలాల్ సేన్ స్మారక పురస్కారం (5 క్ష రూపాయు) అందించారు. ఇంద్రదీప్ దాస్‌గుప్తా నిర్మించిన ‘కేదారా (సాంగ్స్ ఆఫ్ సైలెన్స్)’లో ప్రదర్శించిన నటనకు జ్యూరీ స్పెషల్ మెన్సన్ అవార్డు కైవశం చేసుకున్నాడు చాలాసార్లు జాతీయ బహుమతి అందుకున్న దర్శకుడు, నటుడు కౌశిక్ గంగులీ. ‘ది స్వీట్ రెకియమ్’ అనే భారతీయ సినిమా కోసం దర్శకద్వయం రితూ సరిన్, తెంజింగ్ సోనమ్‌కు నెట్‌వర్క్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఆసియన్ సినిమా (నెట్‌పాక్) అవార్డు దక్కింది. మరాఠీ సినిమా ‘గధుల్’ (దర్శకుడు గణేశ్ శెలార్) ఉత్తమ ఘు చిత్రంగా, ‘సే చీజ్’ (దర్శకురాు ఈశానీ కంజీలాల్ దత్తా) ఉత్తమ డాక్యుమెంటరీగా ఒక్కో క్ష రూపాయ నగదుతో బహుమతు సంపాదించాయి. 17 వ తేదీన న్యూటౌన్ నజ్రూల్ తీర్థ ఆడిటోరియంలో జరిగిన ముగింపు ఉత్సవంలో ఈ బహుమతు అందజేశారు. ఉత్సవానికి పనికొచ్చే ఒక్క సినిమానైనా తయారుచేయలేకపోవడం మన తొగు సినిమా ఫ్డీు దౌర్భాగ్యం. ఇక, ఈ చిత్రోత్సవంలోని కొన్ని మంచి సినిమా కథాకమామీషు చూద్దాం.
ది థర్డ్ వైఫ్ (2018Ñ వియాత్నాంÑ దర్శకురాు ఏస్ మేఫెయిర్): 19 వ శతాబ్దపు వియత్నాం గ్రామంలో ఒక వయసు మళ్ళిన జమిందారుకి మూడో భార్యగా వస్తుంది 14 యేళ్ల మే. మగబిడ్డని కని ఇవ్వగలిగితే ఆమె ప్రత్యేక హోదా పుచ్చుకోగదు. కానీ ఆమె ఆశను అడియాశ చేస్తూ ఆడప్లి పుడుతుంది. మొదటి, రెండో భార్య పరిస్థితి కళ్ళారా చూడనే చూసింది. శరీరవాంఛ అంటే ఏమిటో తెలీకుండానే గర్భం దాల్చింది. అదేమిటో తెలిసేసరికి తన జీవితం ఇక చీకటి గదుల్లో మగ్గిపోవసిందే అనే కఠిన వాస్తవాన్ని గ్రహిస్త్తుంది. రహస్య సంబంధం నెరిపిన స్త్రీకి దొరికిన శిక్షేమిటో అదే కుటుంబంలోని మరో ఉదంతంలో కళ్ళారా చూస్తుంది. ఇటువంటి స్త్రీ జీవితం మళ్ళీ తన బిడ్డకా? ప్రాణాు హరించే పసువుపచ్చని విషపు పూ సంగతి గుర్తొస్తుంది ఆమెకు. తన అందమైన పొడవాటి శిరోజాల్ని కత్తిరించి నదిలోకి వదిలేస్తుంది. తన మొదటి సినిమాకే కకత్తాలో గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డు గొచుకుంది ఈ సినిమా దర్శకురాు. కాస్ట్యూమ్స్, ఫొటోగ్రఫీ అన్నీ కలిపి ఒక్కో ఫ్రేము దృశ్యకావ్యంలా మలిచి మనల్ని అనాటి వియత్నాం గ్రామీణ వాతావరణంలోకి తీసుకుపోతుంది ఈ సినిమా. విడో ఆఫ్ సైలెన్స్ (2018Ñ ఇండియాÑ దర్శకుడు
ప్రవీణ్ మోర్చాలే): కాశ్మీర్‌లో మిటరీ వారు అర్ధ్రరాత్రి ఎత్తకుపోగా, శాశ్వతంగా ‘మిస్సింగ్’ లిస్టులోకి చేరిపోయే అమాయకులెందరో! తమ భర్త జాడ తెలీక గవర్నమెంటు ఆఫీసు చుట్టూ ఏళ్ళ తరబడి తిరిగేవారిని ‘హాఫ్ విడో’ ంటారు. 11 యేళ్ళ పాప, ఆనారోగ్యంతో బాధపడే అత్తతో బ్రతుకీడ్చుతూ వారానికోరోజు రిజిస్టరాఫీసు చుట్టూ తిరిగే ఒక హాఫ్ విడో కథ ఈ సినిమా. కనీసం తన భర్త డెత్ సర్టిఫికెట్ అయినా ఇప్పించండని ప్రాధేయ పడుతుంది. తనతో ఓ రాత్రి హోటల్‌లో గడిపితే సర్టిఫికెట్ ఇప్పిస్తానని అంటాడు రిజిస్టరాఫీసరు. నిరాకరించిన ఆవిడపై కక్ష సాధిస్తాడు. బ్యాంకుకు వెళితే ఆమెను మృతురాలిగా ప్రకటించిన దస్తావేజు రిజిస్టరాఫీసు నుండి అందాయనీ, ఇకపై ఆమె తను బ్రతికున్నట్టు తెలియజెప్పే పత్రాు జమకట్టాని ప్రభుత్వకార్యాయాన్నీ డిమాండు చేస్తాయి. బ్రతికున్నా ఇక చచ్చినట్టే. ‘నన్ను కాదన్నావ్, ఇక బతికినన్నాళ్ళు లైఫ్ సర్టిఫికెట్ కోసం తిరుగు’ అని సవాు చేస్తాడు ఆ ఆఫీసరు. చివరికి ఆమె లొంగుతుంది. చెప్పిన హోటల్‌కి వెళుతుంది. హోటల్ గదిలో అధికారిని హత్యచేస్తుంది. ఇప్పుడు చట్టం ముందు చిక్కు ప్రశ్న. ఆల్రెడీ చనిపోయిన వ్యక్తి చంపగదా? కాశ్మీరులో వంద కొద్ది అనామక శవాను పాతిపెట్టిన స్థలాు బయట పడ్డాయనీ, అమాయకుల్ని చంపి టెర్రరిస్టుల్ని చంపామని లెక్కచూపితే ప్రమోషన్లు రావడం వన ఇటువంటి ‘మిస్సింగు’ ఉదంతాు పెరుగు తున్నాయనీ, తను టూరిస్టుగా వెళ్ళి సీక్రెట్‌గా సినిమా తీశానని ఈ దర్శకుడు స్క్రీనింగు అనంతరం జరిగిన ఇష్టాగోష్టిలో చెప్పాడు. బూసాన్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఈ సినిమా ఈ చిత్రోత్సవంలో భారతీయ భాషాచిత్రా విభాగంలో ఉత్తమ సినిమాగా అవార్డు అందుకుంది. హ్యూమన్, టైమ్, స్పేస్ అండ్ హ్యూమన్ (2018Ñ సౌత్ కొరియాÑ దర్శకుడు
కిం కి దుక్) : కిమ్ కి దుక్ తన తొలినాళ్ళలో ‘స్ప్రింగ్, సమ్మర్, వింటర్, ఫాల్ అండ్ స్ప్రింగ్’ అనే ఎవర్‌గ్రీన్ కళాఖండం నిర్మించాడు. అంచంచొగా అతని సినిమా క్రాఫ్టింగ్ ఇంకా పదునెక్కుతూ వచ్చింది. కిమ్ సినిమా వుంటే మిగతావి వాయిదా వేసుకోవసిందే అనే పరిస్థితి వచ్చేసింది. కిమ్ తాజా సినిమా కథాక్షేత్రం మర ఫిరంగి అమర్చిన ఒక పాతకాపు యుద్ధనౌక. వారం రోజు విహారయాత్ర కోసం ఆ నౌక బయల్దేరుతుంది. అందులో పెళ్ళెన కొత్త జంట, ఒక కాబోయే సెనెటర్ (రాజకీయ నాయకుడు), ఆయన కొడుకు, కొందరు దుండగు, వారి నాయకుడు, కొందరు సెక్స్ వర్కర్లతో పాటు చాలా మంది వుంటారు. ‘స్ప్రింగ్, సమ్మర్ …’ లానే ఈ సినిమా కొన్ని అధ్యాయాుగా నడుస్తుంది. ‘హ్యూమన్’ పర్వంలో మానవ సమాజంలోని అవక్షణాన్నీ ఆ షిప్పులో యధావిధిగా తమ స్వరూపం ప్రదర్శిస్తాయి. దుండగు బాస్ రాజకీయ నాయకుడిని మచ్చిక చేసుకుంటాడు, ఇతర ప్రయాణికుపై దాదాగిరీ చెలాయిస్తుంటాడు. వీరందరి మధ్యలో మూగ వీక్షకుడిలా ఒక ముసలాయన వుంటాడు. (ఇటువంటి పాత్ర ఒకటి కిమ్ సినిమాల్లో సాధారణంగా కన్పిస్తుంటుంది.) ఆయన ఓడలో ఒక కుంచెతో తుడుస్తూ మట్టికణాను సేకరించి డబ్బాల్లో నింపుతూ, వాటిలో విత్తనాు పాతి మొక్కు పెంచే ప్రయత్నాు చేస్తూ వుంటాడు. రాజకీయ నాయకుడికీ, ఇతర ప్రయాణికుకీ వేర్వేరు రకా భోజనాు ఇస్తుండడంతో గొడవ మొదలౌతుంది. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు హనీమూన్‌కై వచ్చిన కుర్రాడు. ఆ రాత్రికల్లా ‘గుణ పాఠం’ నేర్పుతాడు దుండగు ముఠా నాయకుడు. కొత్త పెళ్ళికొడుకును హత్యచేసి, పెళ్ళికూతురును చెరబడతాడు. ఆ తర్వాత రాజకీయ నాయకుడి పక్కలో వేసేస్తాడు. రాజకీయ నాయకుడి కుమారుడిది ముసుగేసిన దొంగ స్వభావం. అన్యాయాన్ని ఎదిరిస్తూనే అన్యాయంలో భాగస్వామి అవుతుంటాడు. తన తండ్రి తర్వాత అతడు కూడా స్పృహ తప్పిన ఆ అమ్మాయిని చెరుస్తాడు. ఇక ‘స్పేస్’ పర్వం. కథ అధివాస్తవిక జగత్తులోకి వెళిపోతుంది. తరువాతి ఉదయం సరికి షిప్పు శూన్యంలో తేలియాడు తున్నట్టు తొస్తుంది. నౌక సిబ్బందితో సహా ప్రయాణికుంతా భయకంపితులౌతారు. ఆకస్మికస్థితిలాంటి పరిస్థితి నెకొంటుంది. ఆహారన్విపై, తాగునీటిపై నియంత్రణకై పోట్లాట మొదలౌతుంది. రాజకీయ నాయకుడు దుండగు సహాయంతో ఆయుధబంతో న్విపై పట్టు సాధిస్తాడు. చెరచబడ్డ ఆమ్మాయి ఆత్మహత్య చేసుకోబోతే, ఆమెను కాపాడి వారిస్తాడు ముసలాయన. మట్టిని సేకరించే తన పనిని కొనసాగి స్తుంటాడాయన. ‘టైం’ పర్వంలో ఈ సర్వైవల్ కొట్లాట మరింత వూపందు కుంటుంది. మిగతా వారికి ఆహారాన్ని రేషనింగు చేస్తూ, తాము సుష్టుగా భుజిస్తుంటారు రాజకీయ నాయకుడు, ముఠా సభ్యు. దొంగతనంగా ఆహారాన్ని అమ్మబోయిన ఒక దుండగుడిని కాల్చిచంపేస్తాడు వారి నాయకుడు. ఆహారం కోసం కొట్లాట, హత్య పరంపర కొనసాగుతుంది. చివరికి మిగిలిన కొద్దిపాటి ఆహారం కొట్లాటలో అగ్నికి ఆహుతౌతుంది. చనిపోయినవారి మాంసాన్ని భోజనం కోసం వేరుచేసి, ఎముకల్ని కాల్చి, బొగ్గుచేసి మొక్కు పెంచే ప్రయాత్నాు సాగుస్తునే వుంటాడు ముసలాడు. రెండు కోడిప్లిల్ని కూడా పెంచుతుంటాడాయన. రేప్ బాధితురాు గర్భవతి అని తొస్తుంది. కడుపులో బిడ్డకు తండ్రెవరో తెలీని పరిస్థితి! మనిషి మాంసం తిని బ్రతికే దశ మొదలౌతుంది. భూమి భవిష్యత్తును మెటాఫర్‌లా చూపిస్తుంటాడు దర్శకుడు. చివరికి ఆ గర్భిణీ అమ్మాయి, రాజకీయ నాయకుడి కొడుకు మిగుతారు. ముసలాడు కూడా ఒక దశలో బ్రతికున్న ఇద్దరి కోసం తన శరీరపు మాంస ఖండాల్ని గిన్నెలో వేసి, తన రక్తపు పాదముద్రల్ని షిప్ డెక్‌పై వదిలి అదృశ్యమౌతాడు. అతడెవరు? మనిషికి బ్రతకడమెలానో నేర్పడానికొచ్చిన దేవుడా? మనిషి మాంసం తిని బోరుకొడుతోందని గుడ్డు పెట్టేలోగానే ఒక కోడిని చంపేద్దా మనుకున్న రాజకీయ నాయకుడి కొడుకుని కాల్చిచంపేస్తుంది ఆ అమ్మాయి. చివరికి షిప్పులో ఆమె ఒక్కర్తే మిగుతుంది. కొద్ది రోజుకి కోళ్ళు గుడ్లు పెడతాయి, ముసలాడు నాటిన చెట్లు పండ్లు, కాయు కాస్తాయి. మనిషి మనుగడకు అనుకూ వాతావరణం తయారయ్యే సరికి ఆమె మగబిడ్డను ప్రసవిస్తుంది. పదిహేడేళ్ళ తర్వాత మళ్ళీ ‘హ్యూమన్’ పర్వం. బిడ్డ టీనేజిలో వున్నాడు, వాడు పిస్టల్‌ని చేతిలోకి తీసుకునేసరికి తల్లికి చివుక్కుమంటుంది. కడుపునిండా తిండి పడ్డాక, వాడికి తన తల్లి మీదే ‘మోహం’ కుగుతుంది. ఫ్రాయిడ్ ‘ఈడిపస్ కాంప్లెక్స్’ సిద్ధాంతం మనకు గుర్తుకు వస్తుంది. ఆ సరికి అక్కడ చెట్లతో అడవి తయారైవుంటుంది. తల్లి అడవిలోకి దౌడుతీస్తే, ఆమెను కుమారుడు వెంబడిస్తుండగా కెమేరా జూమౌట్ అవుతుంది. నేపథ్యంలో నీపు భూగ్రహం మన భవిష్యత్తును మెటాఫర్‌లా గుర్తు చేస్తున్నట్టు సినిమా అంతమౌతుంది. సినిమా మొదలైన కొద్ది నిమిషాకే మనం హై వోల్టేజ్ డ్రామాలో ఉక్కిరిబిక్కిరి అవుతాం. ‘స్ప్రింగ్, సమ్మర్…’ లాంటి స్లో సినిమాతో మన మదిలో ఎంత గాఢ ముద్ర వేస్తాడో, ఊపిరిసపనివ్వని సర్రియలిస్టు డ్రామాతో కూడా అంతే ఆకట్టుకుంటాడు దర్శకుడు. స్క్రిప్టు రైటర్‌గా రంగప్రవేశం చేసిన కిమ్ కి దుక్ తన టైట్ స్క్రిప్టుతో దక్షిణ కొరియా సినీరంగంలో తన ప్రత్యేకతను చాటుకోవడమే కాక, ఆ దేశాన్ని అంతర్జాతీయ క్షితిజంపై అందరూ గుర్తించేలా చేశాడు.
3 ఫేసెస్ (2018Ñ ఇరాన్Ñ దర్శకుడు జాఫర్ పనాహీ) : ప్రముఖ నటి బెహ్నాజ్‌్ జాఫ్రీకి ఒక వాట్సప్ వీడియో అందుతుంది. తను నటి కావానుకుంటున్నాననీ, కానీ తమ ఛాందస కుటుంబం అడ్డుతగడం వన ఆత్మహత్య చేసుకుంటున్నాననీ ఒక మారుమూ గ్రామం అమ్మాయి పంపిన వీడియో అది. అమ్మాయి వివరాు తొసుకోడానికి జాఫ్రీ తన స్నేహితుడైన జాఫర్ పనాహీని తోడు తీసుకుని సుదూర పర్వత ప్రాంతానికి బయల్దేరుతుంది. అమ్మాయి బ్రతికి వుందా లేదా అనే సస్పెన్సును మొదటి దృశ్యంలోనే సృష్టించిన తర్వాత రోడ్ మువీగా సాగుతుంది ఈ సినిమా. అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసే క్రమంలో గ్రామీణుల్లో కరుడుకట్టిన సనాతనభావా శ్యపరీక్ష చేస్తాడు. కథలో ఏమీ లేనట్టుంటూనే ఎన్నో సంగతుల్ని చర్చిస్తుంది ఈ సినిమా. సినిమాు తీయరాదని పనాహీపౖౖె ప్రభుత్వం 20 యేళ్ల నిషేధం విధించి ఇప్పటికి ఎనిమిదేళ్ళయింది. ఈ దశలోనే అతడు నిర్మించిన నాుగో సినిమా ఇది. గృహబందీగా వుంటూనే ‘దిసీజ్ నాట్ ఎ ఫిల్మ్’, ‘క్లోజ్డ్ కర్టెన్’ నిర్మించాడు. టెహరాన్‌లో ‘టాక్సీ’వాలా రూపమెత్తి మరో సినిమా తీశాడు. ఇప్పుడీ సినిమా. షూటింగు చేస్తున్నట్టు ఆర్భాటం లేకుండానే గప్‌చిప్‌గా సినిమా తయారుచేసి చిత్రోత్సవాలికి స్మగుల్ చేయాలి. ఈ ప్రతిబంధకాకు తగ్గట్టే అతని స్క్రిప్టు వుంటాయి. ‘థ్రీ ఫేసెస్’ నటనారంగంలోకి వచ్చిన లేక రాబోయిన ముగ్గురు స్త్రీ కథ. సమాజం కట్టుబాట్లను ఎదిరించి నటిగా మారి, ఇప్పటికీ గ్రామీణు మాటల్లో వేళాకోళానికి గురయ్యే నటి ఒకటో వ్యక్తి. నటిగా ప్రస్తుతం నీరాజనాందుకుంటున్న బెహ్నాజ్ రెండో వ్యక్తి. బెహ్నాజ్ జాఫ్రీ కాపాడటానికి వచ్చిన భవిష్యత్ నటి మూడో ‘ముఖం’ అన్నమాట. ఒకాయన తన ఎద్దు పుంసత్వాన్ని వర్ణించడంలోనూ, సున్తీచేసిన చర్మం మగాడి భవిష్యత్తును నిర్ధారిస్తుందన్న చర్చల్లోనూ గ్రామీణుల్లోని పురుషాధిక్య మనస్తత్వాన్ని ఎండగట్తాడు దర్శకుడు. గ్రామీణు కనీస అవసరాు తీరకపోవడంపై జాలిపడుతూనే, వారి అతి ఛాందసత్వంపై దాడిచేస్తాడు. పనాహీ గురువు అబ్బస్ కియోరుస్తమీ సెమీ ఫిక్సన్ సెమీ డాక్యుమెంటరీ (‘ది మిర్రర్’ వగైరా) ఛాయు ఈ సినిమాలో కనిపిస్తాయి. యొమెద్దినె (జడ్జిమెంట్ డే)(2018Ñ ఈజిప్టుÑ దర్శకుడు
అబూ బకర్ షాకీ) : కుష్టువ్యాధి నయం కాగా, చెత్తకుప్ప్నుండి పనికొచ్చే వస్తువు ఏరుకుని బ్రతుకుతున్న అందవికారమైన నడి వయస్కుడు బసాయ్. అతను ప్రేమించిన మానసికరోగి కూడా మరణిస్తుంది. చిన్నప్పుడు తనను కుష్టురోగు కేంద్రంలో నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయిన తండ్రిని నిదీయడం కోసం గాడిదలాగే బండిలో వేమైళ్ళ దూరంలోని తమ ఊరికి బయల్దేరుతాడు. ప్రక్కనే వున్న అనాథ శరణాయం నుండి తప్పించుకుని వచ్చిన ‘ఒబామా’ అనేపిల్లాడు తోడౌతాడు. మనిషి తన మూలాల్ని వెదుక్కునే రోడ్ మువీగా సాగుతుందీ సినిమా. అంత దూరభారాల్ని అతిక్రమించలేక బండిలాగే గాడిద చనిపోతుంది. ఆ ఇద్దరూ పోలీసుకి చిక్కుతారు, తప్పించుకుంటారు. వికలాంగ, మరుగుజ్జు బిక్షగాళ్ళ దళం వారికి సహకరిస్తుంది. రౖుెలో, బస్సులో వారు ప్రయాణం కొనసాగుతుంది. చివరికి పెరాలిసిస్‌తో బాధపడుతున్న తండ్రిని కుస్తాడు బసాయ్. ‘పురుగు కంటే హీనంగా చూసే సభ్యసమాజం నుండి కాపాట్టానికే నిన్ను గౌరవంగా బ్రతకగ లెప్రసీ సెంటర్‌కి చేర్చాను’ అని తండ్రి చెబుతాడు. అన్నయ్య కుటుంబంతో కలిసి వారం రోజు సరదాగా గడిపిన తర్వాత, మళ్ళీ తన ప్రపంచం కోసం తిరుగు ప్రయాణమౌతారు బసాయ్, అనాథ ‘ఒబామా’. ‘ఒబామా’ అంటే టీవీలో కనిపించే వ్యక్తే అన్న డైలాగు ద్వారా దర్శకుడు సామ్రాజ్యవాదంపై చిన్న సెటైర్ వేశాడు దర్శకుడు. ‘అంతిమ తీర్పు దినం’ (జడ్జిమెంట్ డే) రోజు దేవుడి ముందు ప్రతి ఒక్కరూ సమానులే అనే ఇస్లాం మతభావన ప్రకారం ఈ సినిమాకు పేరు పెట్టారు. ఎన్నో అవార్డు పొందిన ఈ సినిమా ఉత్తమ విదేశీ సినిమాగా ఆస్కారు కోసం ఈజిప్టు దేశపు ఎంట్రీగా ఎంపికైంది. ఈ సినిమా దర్శకుడు ఈ చనచిత్రోత్సవంలో ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నాడు. ఎన్ ఇంజినీర్డ్ డ్రీమ్ (2018Ñ ఇండియాÑ దర్శకుడు
హేమంత్ గబా) : మన నారాయణ, శ్రీచైతన్యకు తదన్నే విధంగా రాజస్థాన్ కోటాలో సాగే ఐఐటీ, మెడికల్ కోచింగ్ ఇండస్ట్రీకు శస్త్రచికిత్స చేసిన డాక్యుమెంటరీ సినిమా ఇది. సూరజ్ అనే అబ్బాయి ఆలిండియాలో ఐఐటి ర్యాంక్ సంపాదించుకున్నాడు గత ఏడాది. అతడు వైబ్రెంట్ కోచింగ్‌లో చేరక మునుపటి నుంచి, కోటాకు కుటుంబంతో ప్రయాణమైనపుడు, క్లాస్‌రూంలో, స్టడీ కోసం వున్న అద్దెకొంపలో, పరీక్ష సెంటర్ బయట ఇలా రెండేళ్ళ నుంచి ఓపికతో రికార్డు చేస్తూ తీసిన డాక్యుమెంటరీ. వివిధ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన విద్యార్థుల్ని పరిశీలిస్తుంది ఈ సినిమా. ‘ఈ ఎగ్జాం సెంటర్‌లో ఏసీ వుందా, ఫ్యాన్లవీ సరిగా పనిచేస్తున్నాయా లేదా’ అని వాకబుచేసే తండ్రి, తమ్ముడికి ఆలిండియా ఫిఫ్త్ ర్యాంక్ వచ్చినా ఫస్ట్ ర్యాంక్ రాలేదని ఏడ్చే అక్కయ్య, స్టూడెంట్ విజయాన్ని సెబ్రేట్ చేస్తూ రోడ్లపై డాన్సు చేస్తున్న కోచింగ్ సెంటర్ టీచర్లు, తీరా ‘నాుగో తరగతి నుండి ఒక్క ఆట ఆడని, ఒక్క నిమిషం టీవీ చూడని’ స్టూడెంట్ మాత్రం ‘ఐఐటిలో తర్వాత ఏం చదువుతావ్, ఏం చేస్తావ్’ అని అడిగితే బిక్క మొహం వేసుకుని నాన్న వైపు చూస్తాడు. ‘సెకెండ్ ఛాన్సులో ఐఐటి కోసం వచ్చిన వారి కోసం తొమ్మిది నెల టైమే వుంటుంది, తల్లి గర్భంలో కూడా తొమ్మిది నెలే, ఇక్కడ తొమ్మిది నెల శ్రమ తర్వాత మీరు కొత్త మనిషిగా మళ్ళీ పుట్టబోతున్నారు’ అని ఉపోద్ఘాతం ఇస్తున్న ఒక ప్రిన్సిపల్ మాటు తమాషాగా వుంటాయి. కోటాలో ఆత్మహత్యు అధికమే. కుటుంబం నుంచి వేరుపడటం భరించలేక, వొత్తిడి తట్టుకోలేక విద్యార్థు దూరానవున్న ఆ టవర్ పైకెక్కి దూకేస్తుంటారని చూపుతాడు ఒక విద్యార్థి. ఇన్ ఎ ల్యాండ్ ఫార్ అవే (2018Ñ మళయాళంÑ దర్శకుడు
జోషీ మేథ్యూ) : టీచర్ల నియామకాు లేక, విద్యార్థు సంఖ్య తక్కువై అవసాన దశలో వున్న ఒక ఆదివాసీ ప్రైమరీ స్కూును మూసెయ్యాని కొందరు పంచాయతీ పెద్దు కుట్ర పన్నుతారు. కానీ, సామాజిక స్పృహ గ ఓ రిటైరైన టీచరమ్మ ప్రయత్నాతో అ స్కూు పునర్జీవితమవడమే కాక, అక్కడి ప్లిు జిల్లాస్థాయి పోటీల్లో ధీటుగా రాణిస్తారు. ఈ క్రమంలో ఆ పంతుమ్మ తన ప్రాణాలే పణంగా పెడుతుంది. ఒక సమాజాన్ని మేల్కొపడంలో ఒక విద్యాయం పాత్ర, మంచి ఉపాద్యాయు పాత్ర ఎటువంటిదో తెలియజెప్పే మనసును ద్రవింపజేసే అందమైన కథ. ‘ఇదా’ తర్వాత పోలెండ్ మాష్టర్ పావెల్ పావ్లికోవస్కీ చిత్రం ‘కోల్డ్ వార్’ (2018), జన్మనిచ్చినందుకు తల్లిదండ్రుపై కేసువేసిన పదకొండేళ్ళ పిల్లాడి కథ ‘కఫర్నమ్’ (2018Ñ లెబనాన్Ñ దర్శకురాు నదినె బాకీ), ఉరెగ్వే స్వాతంత్య్ర పోరాట యోధు అనుభవించిన జైు జీవితంపై వచ్చిన ‘ఆ ట్వెల్వ్ యర్ నైట్’ (2018Ñ దర్శకుడు
ఆల్వారో బ్రెక్నర్), మూగ అమ్మాయి పురుషాధిక్యతను ఎదిరించిన వైనాన్ని చూపే ‘సిబెల్’ (2018Ñ టర్కీÑ దర్శకు ` జి.జియోవనెట్టి, కాగ్లా జెన్సిర్కీ), ‘బర్డ్స్ ఆఫ్ ఎ ప్యాసేజ్’ (2018Ñ కొంబియా), ఇరాన్ సినిమా ‘ఎండ్‌లెస్ (2018), కాన్ ఫెస్టివల్లో గ్రాండ్ జ్యురీ అవార్డు పొందిన జపాన్ సినిమా ‘ది షాప్‌లిప్టర్స్’ (2018) ఇలా చాలా మంచి సినిమాు చూసే అవకాశం అందించింది ఈ చిత్రోత్సవం. ‘కంచరపాలెం’ సంబరంతోనే మన సరదా తీరిపోవాలా అన్నది తొగువారు వేసుకోవాల్సిన ప్రశ్న.