— ఓ.వి.వి.యస్. రామకృష్ణ —
గాంధీని కడతేర్చిన చేతులే
మరకన్నిటిపైనా వ్లెవేసి
వంటచెరకునూ, పిడకనూ దాచిన
ఆ మరుగుదొడ్ల గోడపై కళ్ళజోడునెక్కిస్తాయి.
త్రిశూలాూ, రామబాణాూ
జమ్మిచెట్లపైన యోగాసనాు వేస్తూ
ఇండియాని అఖండ భారతం చేయాన్న
చీపురుకట్ట ఆత్రాన్ని చూస్తూ ఉంటాయి.
విశ్వగురువు అడ్డ నిువు నామాు
ఆకలి కడుపుపై పూజా వస్త్రాు కప్పి
చేతుూ, ముడ్లూ కడుక్కోవడమెలాగో
అధికార బోధనా కార్యక్రమంగా మార్చేస్తాయి.
ఐదారు ఎంబి అంబానీ భిక్షతో
స్వచ్ఛ భారత్ యాప్‌ు డౌన్లోడ్ ఐపోతాయి
ఔత్సాహిక యువకు ఆన్లైన్ భజను చేసి
స్వచ్ఛతా యజ్ఞంలో దేశభక్తిని పొందుతారు.
రాజకీయ సినీక్రీడా సెబ్రిటీ
దేశభక్తి చీపురుకట్ట సెల్ఫీ మహోద్యమంలో
దినపత్రికు, టీవీూ ధగధగా మెరిసిపోయి
డ్రయినేజిలాగ దేశభక్తి పొంగిపొరుతుంది.
అర్ధరాత్రి సైతం బస్తీను శుభ్రంచేసే
కార్మికు అన్నమో రామచంద్రా!! ఆర్తనాదాను
స్వచ్ఛతా బడ్జెట్ల వేకోట్ల రూపాయ సొమ్ము
ప్రచార ఆర్భాటమై హోరెక్కించి వెక్కిరిస్తుంది.
జనాభాకు తగినట్టు కార్మికునూ పెంచాని,
పని పరిస్థితును మెరుగుపర్చకపోవడం అన్యాయమని,
జీవన భద్రత కల్పించడం కనీస న్యాయమన్న డిమాండ్లన్నీ
ఊడ్చిపారేయాల్సిన పరమ చెత్తగా మారిపోతాయి.
నదు పరిశుభ్రత కోసం
పర్యావరణ పరిరక్షణ కోసం
ప్రొఫెసర్లు చేసే దీక్షు అంతిమంగా
ప్రాణత్యాగాుగా పరిణమిస్తుంటాయి.
దేశానికి శుభ్రతను నేర్పినందుకుగాను….
కాుష్య రాక్షసుడి మదమణచినందుకుగాను…..
భరతమాత ముద్దుబిడ్డ మన అధినేతకు
‘‘ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్’’ అవార్డు వరించేస్తాయ్.