సృజనశీలి మానవుడే అభ్యుదయ సాహిత్యానికి జవం ` జీవం

సృజనశీలి మానవుడే అభ్యుదయ సాహిత్యానికి జవం ` జీవం

సృజనశీలి మానవుడే అభ్యుదయ సాహిత్యానికి జవం ` జీవం

— వై. విజయ్ కుమార్ —

భౌతికవాద తాత్త్విక విమర్శకు వై. విజయ్‌కుమార్‌ శతజయంతి సందర్భంగా మెవరించిన ‘యమంచిలి విజయకుమార్‌ రచను’ సంకనం నుండి ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము. ` సం॥

ఈ భౌతిక ప్రపంచంలోఅనేక సామాజిక ఘటను, చారిత్రక పరిణామాు సంభవిస్తుంటాయి. అవి అనేక రకాుగా అనేక విధాుగా జరుగుతుంటాయి. వాటినన్నింటినీ సాహిత్యం ప్రతిబింబించాల్సిందే. కాని వాటన్నింటిలో ప్రపంచానికి మానవునికి మధ్య సంబంధాలో జరిగే పరిణామం ముఖ్యమైనది.
ప్రపంచం, దానితోపాటు సమాజం స్థిరంగా వుండదు. మారుతూ ఉంటుంది. వాటితోపాటు మానవుడు మారుతుంటాడు. ప్రపంచం మానవునిలో మార్పు తెస్తుంది. మానవుడు ప్రపంచాన్ని మారుస్తుంటాడు. ఆ రకంగా ప్రపంచం మానవు మధ్య పరస్పర సంబంధం వుంటుంది. అయితే యీ సంబంధానికి ఆధారమేమిటి? అది ఎందుకు మారుతుంది. అది నియమబద్ధమా లేక యాదృచ్ఛికమా అనే ప్రశ్ను వుదయించక మానవు.
మానవుడు ఒక ప్రత్యేక జంతువు. ఆలోచించే జంతువు. అందువనే అతనికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానముంటుంది. అంతేగాక అతడు చరిత్ర నిర్మాత కూడా.
ఆలోచనగవాడు కాబట్టే మానవుడు తన చుట్టూ వున్న ప్రపంచాన్ని గురించిన చిత్రాన్ని రూపొందించుకోగడు. ప్రపంచాన్ని వున్నదున్నట్లుగా వాస్తవంగా చూడగగడమే కాదు, అది తన దృష్టిలో ఎలా వుంటే బాగుంటుందో, యెలా తీర్చిదిద్దాలి అని కూడా ఆలోచిస్తాడు. వాస్తవ ప్రపంచానికీ అతను కోరుకునే ప్రపంచానికీ మధ్యనున్న వ్యత్యాసాన్ని అర్థంచేసుకోగడు. తను కోరుకున్న ప్రపంచాన్ని సాధించానుకుంటాడు. ఈ ప్రయత్నం అతనిలో ఆశలను ఆశయాను రేకెత్తిస్తుంది.
తన ఆశయా ప్రకారం ప్రపంచాన్ని రూపొందించేందుకు అతడు నిరంతరం ప్రయత్నిస్తాడు. ఆ రకంగా మానవునిలో ప్రపంచాన్ని తనకనుగుణ్యంగా మార్చానే ప్రబమైన ఆకాంక్ష, సృజనాత్మక ప్రేరణ ఎ్లప్పుడూ వుంటాయి. అయితే ఒక్కొక్కపుడు ఈ ఆశు, ఆశయాు నిర్ధిష్ట సామాజిక, చారిత్రక పరిణామాననుసరించి అస్తవ్యస్తంగా అవ్యక్తంగా వుండవచ్చు. ఒక్కొక్కపుడు స్పష్టంగా, బంగా, నిర్దిష్టంగా వుండవచ్చు. ఈ ఆశయసాధన అంత తేెలికైనదేమీ కాదు. అనేక అడ్డంకును, చిక్కును ఎదుర్కోవసి ఉంటుంది.
ఒక వైపున మానవుడు తన చుట్టూ వున్న ప్రపంచాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుంటే, రెండవ వైపున పరిసర ప్రపంచం తన ప్రభావాన్ని ప్రసరించి అతనిని మార్చేందుకు ప్రయత్నిస్తూ వుంటుంది. చరిత్రలో యీ పోరాటాన్ని చూస్తూనే వుంటాం. ఈ పోరాటంలో ఒక్కొక్కప్పుడు మానవుడు నెగ్గడం, మరొకప్పుడు ఓడిపోవడం గమనిస్తూనే వుంటాం. అశేష ప్రజానీకం ఏకమై సదాశయ సాధనకు తమ శక్తియుక్తును సమీకరించగగినప్పుడు సమాజంలో కరుడుగట్టిన భావాను, సంప్రదాయాను, ఛాందసత్వాను అధిగమించి ముందుకు పోగగుతారు. సమాజాన్ని అభ్యుదయ పథంలో నడిపించగుగుతారు. మరికొన్ని సందర్భాలో మానవు అభ్యుదయ సృజనాత్మక ప్రేరణ సమాజంలో పాతుకుపోయిన ఆచారాు, అవాట్లు, సంప్రదాయాు, మతమౌఢ్యం, కట్టుబాట్లు వగైరా అవరోధాను అధిగమించలేక, సమాజ పునాదును కదల్చలేక తాత్కాలికంగా వెనుకడుగు వేయడం కూడా సంభవిస్తుంది. ఉదాహరణకు మనదేశంలోనే స్వాతంత్య్ర పోరాట సమయంలో మన ప్రజు కు, మత, ప్రాంతీయ, భాషా విభేదాను విస్మరించి ఐక్యమై సమరం సాగించారు. కాని నేడు కు, మత, ప్రాంతీయ విచ్ఛినకర ధోరణు విజృంభించి ప్రజను తిరిగి పట్టి పీడిస్తున్నాయి. 
మానవునికీ, ప్రపంచానికీ మధ్య ప్రతి చారిత్రక దశలోనూ ఘర్షణ సాగుతూనే వుంటుంది. మానవుడిని ప్రభావితం చేసేందుకు ప్రపంచమూ, ప్రపంచాన్ని మార్చేటందుకు మానవుడూ ఘర్షణ పడుతూనే వుంటారు. ఈ ఘర్షణను ‘‘ రెండు విరుద్ధ శక్తు మధ్య ఘర్షణగా’’ భావించవచ్చు. ఈ ఘర్షణలో మనకు రెండు రకా వ్యక్తిత్వం గ మానవు గోచరిస్తారు.
మొదటిరకం : సృజనాత్మకతశక్తిగ మానవుడు
రెండవ రకం : సమాజంచే సృష్టించబడిన మానవుడు
మొదటిరకం మానవుడు సమాజాన్ని మార్చవసిన సంచనాత్మక పరిస్థితు యేర్పడినప్పుడు, విప్లవకర పరిణామాు సంభవిస్తున్నప్పుడు ఆ పరిస్థితుచేత ప్రభావితుడై చైతన్యవంతుడై వాటితో పాటు అభివృద్ధి చెంది సామాజిక మార్పుకోసం జరిగే విప్లవకర పోరాటానికి చోదకశక్తిగా పనిచేయగ మానవుడు. అటువంటి పరిస్థితులో మొత్తం దేశాన్నీ లేక ప్రపంచాన్నే మార్చివేయగ సంఘటను జరుగుతున్నపుడు అతడు వాటిలో చురుకుగా పాల్గొంటూ ప్రధాన పాత్రధారి అవుతూ వాటికి నాయకత్వం వహిస్తూ తన చారిత్రాత్మక పాత్రను నిర్వహిస్తాడు. సమాజాన్ని మార్చానే ఉన్నత ఆశయం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తాడు. సక త్యాగాకు సిద్ధమవుతాడు. తన ఆశయసిద్ధికి సమాజంలోని అడ్డంకును ఎదుర్కొని సంకెళ్ళను సడలించి పోరాడగ స్వేచ్ఛను, సాహసాన్ని, సృజనాత్మకశక్తిని, అకుంఠిత దీక్షను ప్రదర్శిస్తాడు.
ఇక రెండవ రకం మానవుడు సమాజ పరిణామక్రమాన్ని అర్థం చేసుకోలేక తన పరిసర పరిస్థితు ప్రభావానికి లొంగిపోయి రాజీపడి వ్యక్తిత్వాన్ని చంపుకొని అసమర్ధుడుగా బతుకు యీడుస్తూ మనుగడ సాగించే మానవుడు.
మానవ సమాజం ఉద్భవించిన నాటి నుండి మానవుడు సంపూర్ణ స్వేచ్ఛ కొరకు పోరాడుతూనే వున్నాడు. సామాజిక వ్యవస్థను మార్చేందుకు కృషి చేస్తునే వచ్చాడు. అయితే ప్రతిసారీ అతను ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోతూవచ్చాడు. సామాజిక వ్యవస్థ మారినప్పుడల్లా గతంలో కన్నా సాపేక్షికంగా కొంత స్వేచ్ఛ పెరిగినట్లు కనబడినా, మళ్ళీ తిరిగి తన స్వేచ్ఛను హరించే పరిస్థితుకు బానిసైపోతూ వచ్చాడు. శాశ్వతంగా సంపూర్ణ స్వేచ్ఛగ సంపూర్ణ మానవుడు మన గలిగిన సమాజం వస్తుందా? అనే ప్రశ్నను మాటిమాటికీ ఎదుర్కొంటూ వస్తున్నాడు.
చివరకు 19వ శతాబ్దంలో మార్క్స్‌ ఏంగెల్స్‌ ఆ ప్రశ్నకు సమాధానాన్ని సమకూర్చగలిగాడు. మానవుడు సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించగ సామాజిక వ్యవస్థ సాధ్యమేనని, దానిని మానవుడు సాధించవచ్చనీ వారు వక్కాణించారు. మానవ సమాజం కొన్ని నిర్దిష్ట నియమాననుసరించి ఒక దశ నుండి మరొక దశకు, ఒక వ్యవస్థ నుండి మరొక వ్యవస్థకు అభివృద్ధి చెందుతూ వచ్చిందని వారు శాస్త్రీయంగా రుజువు చేశారు.
తొలిదశలో మానవు అనేక వే సంవత్సరాు వర్గరహిత ఆదిమ కమ్యూనిస్టు సామాజిక దశను కలిగి వుండేవారు. తరువాత వర్గా కింద విభజించబడి: కొద్దిమంది ఉన్నత వర్గావారు అశేష ప్రజానీకాన్ని అతి దారుణంగా, క్రూరంగా, నిర్ధాక్షిణ్యంగా దోపిడికి గురిచేసే వర్గ వ్యత్యాసం గ సామాజిక ఆర్థికవ్యవస్థల్లో బానిస, వ్యూడల్‌, పెట్టుబడిదారీ వ్యవస్థునలిగిపోతూ వచ్చారని మార్క్స్‌, ఏంగెల్స్‌ు సోదాహరణంగా వివరించారు. మళ్ళీ తిరిగి అత్యున్నత స్థాయిలో వర్గరహితమైన, దోపిడీకి తావులేని ఒక దేశాన్ని మరొకదేశం, ఒక జాతిని మరొకజాతి పీడిరచని, మానవుందరూ సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ సర్వతోముఖాభివృద్ధి పొందగ కమ్యూనిస్టు వ్యవస్థ వచ్చితీరుతుందని చెప్పారు. వారు చెప్పినట్లు నేడు కమ్యూనిజం మొదటిదశ అయిన సోషలిస్టు వ్యవస్థ కొన్ని దేశాలో సాధించబడిరది.
ఒక సామాజిక వ్యవస్థ నుండి మరొక వ్యవస్థలోనికి సమాజం పరిణామం చెందినప్పుడల్లా మానవుడు క్రమేపి అభివృద్ధిని సాధిస్తూనే వున్నాడు. దానితోపాటు అతని స్వేచ్ఛ కూడా సాపేక్షికంగా పెరుగుతూనే వుంది. ఉదాహరణకు బానిస సమాజంలోని బానిసకన్న ఫ్యూడల్‌ వ్యవస్థలోని అర్ధబానిసలైన రైతు స్వేచ్ఛ అధికం. అలాగే పెట్టుబడిదారీ వ్యవస్థలోని పారిశ్రామిక కార్మికు, ఫ్యూడల్‌ రైతుకన్నా ఎక్కువ స్వేచ్ఛను అనుభవిస్తారు. సోషలిస్టు సమాజం వర్గ రహితంకావడం వన మానవుడు సంపూర్ణ స్వేచ్ఛను పొందగగుతాడు.
ఇదే సందర్భంలో మరొక విషయాన్ని కూడా గమనించాలి. సామాజికవ్యవస్థ మారినప్పుడల్లా నూతన వ్యవస్థ తొలిదశలో అంతకు ముందుకన్న మానవు స్వేచ్ఛ గణనీయంగా పెరుగుతుంది. వర్గ సమాజాల్లో యీ పెరిగిన స్వేచ్ఛ ఎంతోకాం నివదు.
విప్లవం ద్వారా ఒక సామాజిక ఆర్థికవ్యవస్థ స్థానంలో మరొక వ్యవస్థ వచ్చిన తర్వాత. వర్గ సమాజాలో కొంతకాం వరకు ఉత్పత్తి శక్తుకూ ఉత్పత్తి సంబంధాకూ మధ్య సమన్వయం వుంటుంది. సమాజాభివృద్ధి సాగుతుంది. ఈ కాంలో మానవునికి కొంత యెక్కువ స్వేచ్ఛ వుంటుంది. కాని కొంతకాం తర్వాత యీ సమన్వయం చెదిరిపోతుంది. ఉత్పత్తి శక్తు త్వరగా అభివృద్ధి చెందుతాయి. స్థిరపడి కరుడుగట్టిన సామాజిక సంబంధాు మాత్రం పెరగవు. ఈ దశలో సమాజంలో నిస్తబ్ధత వన సృజనాత్మక శక్తిగ మానవుని స్థానంలో నిస్తబ్ధ మానవుడు దర్శనమిస్తాడు. ఈ నిస్తబ్ధత యెంతో కాం సాగదు. ఉత్పత్తి శక్తుకు, ఉత్పత్తి సంబంధాకు మధ్య ఘర్షణ అనివార్యంగా పదును దేుతూంటుంది. ఈ ఘర్షణ క్రమేపీ వర్గపోరాట రూపం ధరిస్తుంది. ఈ వర్గ పోరాటా ద్వారా, సామాజిక వ్యవస్థ బహీనపడుతున్నకొదీ ఆ సమాజగర్భంలోనే ప్రవర్థితమవుతున్న నూతన సామాజిక వ్యవస్థ కోసం జరిగే పోరాటాన్ని అణగగొట్టేందుకు స్వార్థపర పాకవర్గాచే స్వేచ్ఛ హరించబడుతుంది. స్వేచ్ఛ కోసం పోరాటాు విజృంభిస్తాయి. ఉద్యమాు చెరేగుతాయి. స్వేచ్ఛ కోసం నూతన మివ కోసం జరిగే యీ ఉద్యమంలో చైతన్యవంతులైన అభ్యుదయకాముక ప్రజు పాల్గొంటారు. ఆ ప్రజకు కొంతమంది ప్రముఖ వ్యక్తు నాయకత్వం వహిస్తూ ముందుకు వస్తారు. ఉద్యమ నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తారు. ఉద్యమం అలాంటి నాయకు అభివృద్ధికి దోహదం చేస్తుంది. వారు ఉద్యమాభివృద్ధికి దోహదం చేస్తారు. ఉద్యమ సంజాతులైన వీరు ఉద్యమ నిర్మాతు కూడా అవుతారు. ఆ రకంగా కొన్ని సామాజిక పరిస్థితులో సమాజాభివృద్ధి కృషిలో, చరిత్ర నిర్మాణంలో కొంతమంది వ్యక్తు పాత్ర వుంటుంది. ఉద్యమంతో పాటు వీరి వ్యక్తిత్వం, నాయకత్వ పాత్ర పెరుగుతుంది. ఆయా అభివృద్ధి దశలో గొప్ప వ్యక్తు, మానవేతిహాసంలో మహాత్ము, వీరునబడే వారందరూ యిలా తయారైనవారే. ప్రపంచ సాహిత్య చరిత్రలో ఆయా దశలో స్వేచ్ఛ కోసం మానవు సాగించిన వీరోచిత పోరాటాతో ప్రభావితులై ఉత్తేజితులై అనేకమంది గొప్ప రచయితు వాస్తవికతా దృక్పథంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచను చేయడం చూస్తాం. ఆ ఉద్యమాలో భాగస్వాములై వాటితో పాటు తమ వ్యక్తిత్వాన్ని పెంచుకుంటూ వాటికి సాహసోపేతంగా నాయకత్వం వహిస్తూ స్వేచ్ఛాసాధనకు తమ సర్వస్వాన్నీ అర్పించిన మహాపురుషును, వీరవనితను తమ రచనలలో ప్రధానపాత్రుగా చిత్రించి సంపన్నవంతమైన, జనరంజకమైన, ప్రయోజనకరమైన సాహిత్యాన్ని సృష్టించటం మనం చూస్తాం. బహుశా ప్రపంచంలో శాశ్వత మిమగ ఉత్తమ సాహిత్యం అలాంటి దశలలోనే మెవడిరదని చెప్పవచ్చు. పతనమవుతున్న ఫ్యూడల్‌ వ్యవస్థను నిశితంగా, వ్యంగ్యంగా విమర్శిస్తూ అపహాస్యం చేస్తూ ఆ వ్యవస్థపైన అసహ్యాన్ని, ఆగ్రహాన్ని కుగజేస్తూ మహోన్నత సాహిత్యాన్నిÑ బాల్జాక్‌, షేక్‌స్పియర్‌, సెర్వాంటిస్‌, ష్లిర్‌లాంటి మహారచయితు సృష్టించారు. ఫ్యూడల్‌ వ్యవస్థ నుండి విముక్తి కోసం, స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం నినాదాతో పోరాటం సాగిన దశలోÑ వాల్టేర్‌, రూసో, డైడరాట్‌ లాంటి వారు ఉత్తమ సాహిత్యాన్ని మెవరించారు. జార్‌ చక్రవర్తు నిరంకుశ పానకు వ్యతిరేకంగా, అక్టోబర్‌ విప్లవానికి పూర్వం రష్యాలో పుష్కిన్‌, గోగోల్‌, డాస్టావిస్కీ, టాల్‌స్టాయ్‌, చెహోవ్‌, షెడ్రిన్‌, గోర్కీ మొదగు ప్రఖ్యాత రచయితు అపూర్వమైన సాహిత్యాన్ని అందించారు. మనదేశంలో కూడా స్వాతంత్య్ర సమరకాంలో ఎనలేని అభ్యుదయ సాహిత్యం మెవడిరది. ప్రేమచంద్‌, టాగోర్‌, బంకిం, సుబ్రహ్మణ్య భారతి, మ్కురాజ్‌ ఆనంద్‌, సజ్జాద్‌ జహీర్‌ లాంటి ప్రఖ్యాత రచయితు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సాహిత్యాన్ని సృష్టించారు. మన తొగుసీమలో స్వాతంత్య్రోద్యమ కాంలోనూ, నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటదశలోనూ అనేకమంది రచయితు, కవు, గాయకు స్పందించి తమ కలాకు పదునుబెట్టి తమ గళాను విప్పి అనేక ప్రక్రియలో అపూర్వ కళాసృష్టి చేశారనడంలో అతిశయోక్తి లేదు. ఆ రెండు దశలోను సృష్టించబడిన తొగు సాహిత్యం యీనాటికీ సాటిలేని జనాదరణ పొందగుగుతూంది. ఈ నేపథ్యంలోనే సాహిత్యార్ణవంలోని అటుపోటును అర్థం చేసుకోవాలి. పైన చెప్పినట్లు సమాజంలోని ఒక దశలో స్వేచ్ఛ పెరగడం, మరొక దశలో తరగడంవన: సమాజమూ మానవు మధ్యనున్న సంబంధాు, వాటితో పాటు వారి ఆలోచను, అనుభూతుూ మారుతుంటాయి. మొత్తం మీద పరిస్థితు మానవున్ని ప్రభావితం చేస్తాయి. కాని మానవుడు వాటికి బానిస కానక్కరలేదు. ఆలోచను గ మానవుడు వాటిని మార్చేందుకు, తనకనుకూంగా మచుకునేందుకు, తన ప్రయోజనాను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. వాటిని మారుస్తాడు. ఆ రకంగా తన కనుగుణ్యమైన పరిస్థితును మానవుడు సృష్టించుకోగడు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకే పరిణామక్రమంలో మానవుడు, పరిస్థితు రెండు వేర్వేరు పార్శ్వాు. ఒకానొక చారిత్రక సందర్భంలో మానవునిపై పరిస్థితు ప్రభావం హెచ్చుగా వుంటే, మరొక సందర్భంలో పరిస్థితును మానవుడు ప్రభావితం చేస్తాడు. ఆ రకంగా సామాజిక చారిత్రక అభివృద్ధికి సంబంధించిన మానవుని సృజనాత్మక కృషి ఒక్కొక్కప్పుడు హెచ్చుస్థాయిలోనూ, మరొకప్పుడు తగ్గు స్థాయిలోనూ వుంటుంది. స్థూంగా మానవుని వ్యక్తిత్వాభివృద్ధిని మూడు దశుగా విభజించవచ్చు. పెట్టుబడిదారీ వ్యవస్థకు పూర్వ మానవుడు తన తొలి సమగ్రతను కోల్పోని మొదటి దశ. ఈ దశలో మానవుడు ప్రపంచంలో తన సంబంధాను పూర్తిగా నిర్థారించుకోలేకపోయాడు. తన చుట్టూ తనకుతాను సృష్టించిన పాదార్థిక, ఆత్మిక పరిసరా నుండి విడవడలేక పోయాడు. పెట్టుబడిదారీ సంబంధాు పూర్తిగా నెకొన్న దశ రెండవదశ. ఈ దశలో పెట్టుబడిదారీ శ్రమ విభజన, సామాజిక సంబంధా ఫలితంగా తాను కూడా ఒక సరుకుగా మారి తన వ్యక్తిత్వాన్ని దాదాపు పూర్తిగా కోల్పోయి తన సృజనాత్మక శక్తును పరాయీకరణ చేసిన దశ. మూడవదశ, ఆఖరుదశ కమ్యూనిజం దశ. ఈ దశలో మానవుడు సామాజిక అస్తిత్వం కలిగిన, సంపూర్ణ మానవత్వంతో కూడిన స్వేచ్ఛా మానవుడుగా జీవించగడు. అందుకే ‘‘కమ్యూనిజం అంటే మానవత్వం అనీ’’ ‘‘మానవు సార్వత్రికాభి వృద్థికి దోహదం చేసే స్వేచ్ఛా పూరిత వ్యక్తిత్వం’’ అనీ నిర్వచించబడిరది. సమాజాభ్యుదయానికి పాటుపడే మానవుడే అభ్యుదయ సాహిత్యంలో నాయకుడు, జవం, జీవం గ మకుటధారి. (డా॥ ఎస్వీ సత్యనారాయణ, డా॥ కందిమళ్ళ భారతి సంపాదకుగా కన్నా బన్ను ప్రచురణు, హైదరాబాదువారు సెప్టెంబరు 2018లో ప్రచురించిన ‘యమంచిలి విజయకుమార్‌ రచను’లో ‘సాహిత్యం`మానవుడు’ వ్యాసంలోని కొంత భాగం)

admin

Related Posts

leave a comment

Create Account



Log In Your Account