సృజనశిల్పి నిర్మలానంద

సృజనశిల్పి నిర్మలానంద

— చందు నాగేశ్వర రావు —

ప్రాకృతిక శక్తి వ్ల
గొంగళిపురుగు సీతాకోకచిుకై
రెక్కవిప్పి విహరించింది.
స్వశక్తితో
భాషాభివ్యక్తికి, భావవ్యాప్తికి
ముప్పన మల్లేశ్వర రూపం
పడిన తపన ఆ తపస్సు
‘విపుల్‌’గా నిర్మలానందగా
అనువాద కధానుసంధానమై
రసపూరితమై విప్పారింది.
అనువాద రచనని సృజనాత్మకం
రణ రమ్య రసజ్ఞంగా
ఎత్తిపట్టి నిువెత్తైన దిట్ట.
భాషావికాసానికి
జాతు పునర్వికాసానికి
సాయుధు కండని హెచ్చరించి
సాహితీ ప్రక్రియ
ఆయుధాల్ని అందించిన కమ్మరి.
నీ నుంచి కవిత్వం రావాలి
రాయగవని విశ్వాసం నింపి
నిద్రాణమైన శక్తిని
ముద్రాణం వైపు నడిపించిన
సృజను శిల్పి.
మహాపండితుమని గర్వించి
విధుల్ని విస్మరించి, నిధుల్ని ప్రేమించే
బహుభాషా కోవిదులారా
పది చదివి పదింతు ఎదిగి
భాష మధ్యన వారధిjైు
సారధ్యం నెరపిన యోధుడు
తొగు భాషా ూషన్‌
సాహితీ రాహుల్‌
నిర్మలానంద సాంకృత్యాయన్‌.
బాధ్యతల్ని గుర్తుచేస్తున్నాడు
బాధిస్తున్నాడు బోధిస్తున్నాడు
ప్రజాసాహితీ సాంస్కృతికోద్యమానికి
నువ్వో కధ….. బాకీ ఎప్పుడిస్తావని
ఆత్మీయ పీడకుడా
నిజమే!
మేమెప్పుడూ రాస్తూ యిస్తూ
పోవాల్సిన రుణగ్రస్తుమే
ఆ పీడనం తీయనిది తీరనిది
పాస్తీనా ‘‘నేను నేకొరిగితే!?’’
ఆవేదన, ఆక్రోశాతో కంపించింది
మా స్ఫూర్తి నీవు మీ ఆర్తి మాదని
సాహితీలోకపు సంఫీుభావం అందించావు
‘మా నెత్తురు వృథాకాద’ని ప్రకటించి
కన్నీళ్ళను సిరాగా మరిగించి
హృదయాల్ని పిండి, పండిరచి
మాతో ‘కలా కవాతు’ చేయించావు
‘‘యుద్ధం ఒక గుండెకోత’’ కాకూడదని
వేయి గుండెల్ని రగిలించిన నిప్పురవ్వ
పిసరంత విశ్రాంతి కోరని తారాజువ్వ
త్రికరణశుద్ధితో క్ష్యసిద్ధికై శ్రమించిన
నీ మరణం
పునఃనిర్మాణ ప్రేరణ
సాహితీ రణనినాద పునరంకిత ధారణ
ఎందుకంటే
నువు రాయగలిగి రాయకుంటె
వాడు రాయకూడనిది రాసి
తన వెంట నడిపించుకుంటాడు
కలాు ముడుస్తావా
కుబుసం విడుస్తావా? అని
మొద్దుల్ని నిద్రలేపి యెద్దుల్లా దిద్ది
యుద్ధానికి సిద్ధంచేసిన
మేటి మావటి.
ఎవరు నీకు సాటి?
లేదు గుణాత్మక పోటీ?
‘మన్యం వీరుని పోరుదారి’
పట్టించిన పధికుడా!
ప్రజాతంత్ర సమాజానికి
ూషన్‌ని స్యొూషన్‌గా
కొటేషన్‌తో చూపిన పరిశోధకుడా!
‘జ్ఞాన్‌పీఠ్‌’ దీదీ మహాశ్వేతాదేవిని
గోదావరి, కళింగహరిత శ్వేత వనావైపు
నడిపించిన ప్రజాహితుడా, స్నేహితుడా!
వీరవనిత దుర్గా బాభి త్యాగాల్ని
దభీున లోకం ముందు కుమ్మరించిన
అనితర సాధ్య సత్యాన్వేషకుడా!
విశ్వమానవుడా అవిశ్రాంత శ్రామికుడా!
మాపై
నిర్మ ఛాయు
ప్రసరిస్తూనే వుంటాయ్‌,
మీ స్ఫూర్తితో
అక్షరాయుధుమై
ప్రజ్వలిస్తూనే వుంటాం.
సంపద్వంతమైన సంపాదకుడా శెవ్‌.

admin

leave a comment

Create AccountLog In Your Account