‘‘సుఖాంతం’’

‘‘సుఖాంతం’’

— సత్య భాస్కర్  —          

మూడో పెగ్‌ నెమ్మదిగా గొంతులోంచి దిగుతోంది. ఇప్పుడిప్పుడే మందు తాూకు ప్రభావం శరీరం మీద కనపడుతోంది. తలో చుట్ట చుట్టుకుపోయిన ముళ్లకంపలాంటి ఆలోచను ఉపశమిస్తున్నాయి. ఏదో ఒక గమ్మత్తయిన ప్రశాంతత, ఉత్తేజం తకెక్కుతోంది.
ఎదురుగ టేబుల్‌ మీద వున్న ప్లేటులోని జీడిపప్పు ఫ్రై ను తీసి నోట్లో వేసుకున్నాడు పీతాంబరం! అలా నముతూనే బార్‌ అంతా కలియ చూసాడు. ఖరీదయిన ఫర్నిచర్‌. ఆందమయిన నగిషీు చెక్కిన స్తంభాు, గోడ మీద అజంతా సుందరీమణు బొమ్మతో కళ కళ లాడిపోతోంది. సిటీలో చాలా ఖరీదయిన బార్‌ Ê రెస్టారెంట్‌ అది. దాని పైన లాడ్జ్‌ కూడా అంతే ఖరీదుగా ఉంటుంది. అందుకే అక్కడకు వచ్చేవాళ్ళ స్టేటస్సే వేరుగా ఉంటుంది. దానిలో అడుగు పెట్టాంటేనే జేబులో వేకు వే రూపాయుండాలి.
పీతాంబరం ఎప్పుడు సిటీకి వచ్చినా ఈ లాడ్జిలోనేె దిగుతాడు. ఆ బార్‌లోనే మందు కొడతాడు. ఎవరితో పనున్నా అదే బార్లో మీటింగ్‌ పెడతాడు. దాన్నిబట్టి అవతవాడికి పీతాంబరం స్టేటస్‌ తెలిసిపోతుంది. ఎప్పట్లా ఈ సారి వచ్చింది బిజినెస్‌ పనిమీద కాదు. స్వంత పనిమీద. కుటుంబ వ్యవహారం. గుండె మీద పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడప్లి పెళ్లి వ్యవహారం!
ఎదురుగా సీతాపతి కూర్చుని వున్నాడు. అతనికి ఈ ఖరీదయిన వాతావరణం నచ్చినట్టు లేదు. అతను తాగను కూడా తాగడు. ఈరోజుల్లో పుట్టాల్సిన వాడు కాదు. మొదటి నుండీ అంతే. కాలేజిలో ఇద్దరూ క్లాస్‌ మేట్స్‌. హాస్ట్టల్‌లో రూమ్‌ మేట్స్‌. కాలేజీలో చేరిన దగ్గరనించి ఇద్దరూ మంచి స్నేహితుయిపోయారు. ఎంత కలిసి పోయారంటే ఒకే కంచం, ఒకే మంచం అన్నంత! అయినా ఆశ్చర్యంగా ఇద్దరూ భిన్న ధృవాు. పీతాంబరం మొదటినుండి దూకుడు స్వభావి. చదువు కన్నా కాలేజీ రాజకీయాలో ఎక్కువ రాణించేవాడు. గ్యాంగు మెయింటైన్‌ చేయడం, దాదాగిరి చేయడం వెన్నతో పెట్టిన విద్య. యూనియన్‌ ఎక్షన్లలో గెలిచేవాడు, హాస్టల్‌ మెస్‌కు సెక్రెటరీగా ఉండేవాడు. సందు దొరికితే చాు తినేసేవాడు. వీడికి చదువు రాక అడుక్కు తింటాడని పెద్దు దీవించే వారు. కానీ అదేమి కా మహిమో! చదువులో బొటాబొటి మార్కుతో గట్టెక్కినా, నేడు పీతాంబరం కోటీశ్వరుడు! పెద్ద కాంట్రాక్టర్‌, బ్డిర్‌, రియ్టర్‌ ఒకటేమిటి డబ్బు సంపాందించడం వాడికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. పీతాంబరం బొమ్మయితే సీతాపతి బొరుసు. బుద్ధిగా చదువుకున్నాడు. క్రమశిక్షణ, నీతి, నిజాయితీ అతని ప్రాణం. ఏ గొడవల్ల్లోనూ జోక్యం చేసుకునే వాడు కాదు. తన చదువేమిటో, తన బ్రతుకేమిటో! అదే లోకం. మంచి మెరిట్‌తో పాస్‌ అయ్యాడు. చదువు పూర్తయ్యక ఇద్దరూ ఎవరిదారిన వాళ్ళు విడిపోయారు. కొన్నాళ్ళు ఉత్తర ప్రత్యుత్తరాు నడిచాయి. క్రమంగా సంబంధాు పుచనయ్యాయి. ఎవరికే వారే అయ్యారు. ఎవరి జీవితాల్లో వాళ్ళు సెటిల్‌ అయ్యారు.
దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత పీతాంబరం సీతాపతిని వెదుక్కుంటూ వచ్చాడు. సీతాపతి సిటీలో స్టేట్‌ గవర్నమెంట్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడని కనిపెట్టాడు. ఫోన్‌లో పాత స్నేహాన్ని తిరగతోడాడు. అర్జెంటుగా కవాని అన్నాడు. ఇంటి దగ్గర వాలిపోయాడు.
‘‘నువ్వేమీ మారలేదురా సీతాపతి!’’ అని అప్యాయంగా చూస్తూ అన్నాడు పీతాంబరం. ‘‘మారకపోవడమేటి! యాభయి ఏళ్ళు మీద పడ్డాయి. ఇద్దరు ప్లిు. సంసారం! త్లెజుట్టు… నీవు మట్టుకు బాగా ఎదిగిపోయావు!’’ అని అంతే అభిమానంతో అన్నాడు సీతాపతి.
‘‘హహ హ ‘‘ఏమి ఎదిగానులే! ఎదో అలా గాలికి కొట్టుకుంటూ వచ్చాను. చదువబ్బలేదుగా! అందుకే వ్యాపారంలో దిగా.. మనకున్న పుకుబడితో నెమ్మదిగా కాంట్రాక్టు పడుతూ వచ్చా. తర్వాత రియల్‌ ఎస్టేట్‌లోకి ‘‘దాని బూమ్‌తో ఒక్కసారిగా కలిసొచ్చింది.. అంతే.. అని కాసేపాగి తనే మళ్ళీ మొదలెట్టాడు. ‘‘ఏమయినా ‘నీ అంత ప్రశాంతమయిన జీవితం కాదు నాది. నువ్వు చూడు మొదటినుండి ప్లాన్డ్‌గా వున్నావు. బాగా చదువుకున్నావు. ఉద్యోగం సంపాదించావు. పెళ్ళిచేసుకుని హ్యాపీగా సెటిల్‌ అయిపోయావు. ‘‘అని అంటూనే చేతిలో గ్లాస్‌ ఎత్తి ఒక్క గుక్కలో ముగించేశాడు. వాళ్లనే గమనిస్తున్న బేరర్‌ పరుగున వచ్చి’ ‘ఏమన్నా కావాలా సార్‌! ‘‘అని వినయంగా అడిగాడు. ‘‘మరో పెగ్‌’’ ఆర్డర్‌ ఇస్తూనే తినడానికి వేరే స్నాక్స్‌ చెప్పాడు. బేరర్‌ వెళ్లిపోయాక సీతాపతి వైపు తిరిగాడు. సీతాపతి చేతుల్లోని కోకాకోలా గ్లాస్‌ అలానే వుంది. కొద్ది కొద్దిగా సిప్‌ చేస్తున్నాడు. దాన్ని తాగేస్తే మళ్ళీ తెప్పిస్తాడేమోనని భయం. అందుకే దాన్ని పూర్తికానీయకుండా చూస్తూ ఎదురుగ ప్లేట్‌లోని పకోడీని నముతున్నాడు.
‘‘సరే! నేను నిన్ను వెదుక్కుంటూ వచ్చిన పని చెబుతాను విను! నాకు నీ మీద ఉన్నంత నమ్మకం ఎవరిమీద లేదు. అందుకే నిన్ను వెదుక్కుంటూ వచ్చాను. పది రోజుగా ఏమి చేయాలో తెలీక పిచెక్కిపోతోంది.’’ అని ఆగాడు పీతాంబరం.
అంతటి కోటీశ్వరుడు, మొనగాడు తన సహా కోసం రావడమేమిటి? వాడిస్నేహం, నమ్మకం చూసి సీతాపతికి చిన్ననాటి పీతాంబరమే ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నట్లు అనిపించింది. పొద్దున్న నుండి ఇద్దరి మధ్య వున్న అంతరం, భేషజం కాస్త తొగిపోయి యవ్వన కాం నాటి అరమరికు లేని స్నేహం తిరిగొచ్చినట్టయింది. నవ్వుతో మొహం విప్పారింది. ‘‘నువ్వే పెద్ద మొనగాడివి! నా సహా నీకెందుకు!’’ అని అన్నాడు సీతాపతి. ‘‘అవన్నీ పక్కకు పెట్టేయ్‌ నా మాట విని నేను ఏమిచేయాలో నాకు సహా చెప్పు! ఇది నా జీవిత సమస్య!’’ అని మొదుపెట్టాడు. ఇంతలో బేరర్‌ వచ్చి ఆర్డర్‌ చేసిన పెగ్‌, స్నాక్స్‌ సర్వ్‌చేసి వినయంగా వెనక్కి వెళ్ళిపోయాడు. ‘‘నీకు చెప్పాగా నా ఏకైక కూమార్తె స్వాతి! బంగారు తల్లి. దాన్ని తుచుకుంటేనే నా వొళ్ళు పుకరించి పోతుంది. అంత ప్రేమగా పెంచాను. దాని ఫోటో నీకు చూపించాను. ఎంత బాగుంటుందో నువ్వే చూసావు. చా తెలివైనది. వంద కోట్ల ఆస్తికి వారసురాు. దానికి పెళ్లి చేయాలి.’ అని అంటూ ఎదురుగ గ్లాస్‌లోని ద్రవాన్ని ఒక సిప్‌చేసి టేబుల్‌ మీద పెట్టాడు.
తదేకంగా వింటోన్న సీతాపతికి మేటర్‌ అర్థమవుతోంది. ఇదేదో వాళ్ళ అమ్మాయి పెళ్ళి వ్యవహారంలాగుంది. ‘‘చేయి. దానికేముంది! సంబంధం వెదకమంటావా!’’ అని అడిగాడు సీతాపతి. ‘‘సంబంధం వెదకడం కాదు. అదే నన్ను వెదుక్కుంటూ వచ్చింది. అబ్బాయి అమెరికాలో ఉంటాడు. వాళ్ళ తల్లిదండ్రు, కుటుంబం మొత్తం యాభై అరవై ఏళ్ళ క్రితమే ఆ దేశం వెళ్లి సెటిల్‌ అయిపోయారు. అబ్బాయి కూడా చాలా బాగుంటాడు. స్వంత కంపెనీ ఉందిట. నేను వంద కోట్లకు అధిపతినైతే వాళ్ళు వే కోట్లకు ఎదిగారు.’’ అని ఆగాడు పీతాంబరం.
‘‘మరింకేమిటి!? అమ్మాయికి నచ్చలేదా!? అని ఆతృతగా అడిగాడు సీతాపతి.
వందు, వే కోట్ల గురించి వినడం, పేపర్లలో చదవడమే తప్ప అంతటి వాళ్ళను చూసింది లేదు. తన స్నేహితుడు ఆ స్థాయిలో వున్నందున తనకు ఆ స్థాయి అంటినట్లుగా అనిపించింది. ఆ ఖరీదయిన బార్‌ వాతావరణమే మత్తెక్కించేలాగుంది.
‘‘నో.. నో.. అదికాదు’’ అని అడ్డంగా తూపుతూ మాట్లాడాడు’’ అమ్మాయికి నచ్చాడు. అబ్బాయికీ మా అమ్మాయి నచ్చింది… వాళ్ళ మాటు.. వీళ్ళ మాటు విని ఇంటర్నెట్‌లో మాట్రీమోనీ సైట్‌లో పెట్టడంతో నా నెత్తికొచ్చింది… అమ్మాయి ఫోటో, ప్రొఫైల్‌ చూసి అబ్బాయివాళ్ళు కుటుంబంతో సహా పడిపోయారు..’’ అని అన్నాడు పీతాంబరం.
మరి ఏమిటీ సమస్య అన్నట్టు చూసాడు సీతాపతి. ఈ సస్పెన్స్‌ భరించలేక గ్లాస్‌లోని కోకాకోలాను సగం ఖాళీచేసాడు. 
సీతాపతి కూడా తాను చెప్పే విషయంలో సీరియస్‌గా ఇన్వాల్వ్‌ అయ్యాడని నమ్మకం కలిగాక ఇక అసు విషయం చెప్పాని డిసైడ్‌ అయిపోయాడు పీతాంబరం.
‘‘అదేరా! ఇక్కడే అసు సమస్య వుంది! నీ సహా కావాల్సింది ఇక్కడే! వాళ్ళు నా సంబంధం ఒప్పుకోవడానికి మొదటి కారణం వాళ్ళది మాది ఒకే వూరు కావడం! వాళ్ళు ఈ దేశం వదిలి వెళ్ళినపుడు మాది ఒక పల్లెటూరు. కానీ ఈ రోజు మాది కూడా ఒక పెద్ద సైజు టౌన్‌ అయింది. వాళ్ళ తాతు, తండ్రుది మావూరే. ఎలాగో చదువబ్బడంతో రైల్వేలో పనిచేసే ఒకాయన సహాయంతో వీళ్లు ఆ దేశం వెళ్ళిపోయారట! అలా వెళ్ళిపోయి అక్కడే సెటిల్‌ అయిపోయారు. ఆ పిల్లాడు కూడా అక్కడే పుట్టాడట.’’ అని ఒక సిప్‌ వేయడానికి ఆగాడు పీతాంబరం.
‘‘ఏదో ఒక కారణం వెళ్ళడానికి! అంతా మంచిదే గదరా! వూరు పేరు లేనివాడికంటే మీ వూరు వాడవటం మంచిదేగా!’’ అని అన్నాడు సీతాపతి. ఆ మాటు విననట్టే పీతాంబరం కొనసాగించాడు. ‘‘ఇక్కడే వుంది తిరకాసు. వాళ్ళు మా ఊరి వాళ్లు అన్నా గాని వాళ్ళది ఏ కుం అని అడగవే!? నీకు బొత్తిగా లోకజ్ఞానం లేదు. ఇంకా విద్యార్థి దశలో లాగానే వున్నావు. వాళ్ళు మా ఊరి మా వీరిగాడి చుట్టాురా!? అని తకాయ పట్టుకున్నాడు పీతాంబరం.
ఇప్పుడర్ధమైంది సీతాపతికి! కుం సమస్య వచ్చిపడిరదన్నమాట! పీతాంబరం నిఖార్సయిన అగ్రవర్ణం. ఊరిలో దొర కుటుంబం. మా తాతు నేతు తాగారు మా మూతు వాసన చూడండనే రకం. కానీ పీతాంబరం మటుకు అడ్డంగా సంపాదించి దొర పోకడు పోతున్నాడు. కాలేజీ రోజుల్లో ఎన్నోసార్లు తనే వాడికి ఫీజు కట్టేవాడు. తనకొచ్చే మనీఆర్డర్‌నే ఇద్దరూ పంచుకునేవాళ్ళు. ఈ రోజు డబ్బు, హోదా రావడంతో కుం కూడా నిద్రలేచి నెత్తిన కిరీటం అయి కూర్చున్నట్లుంది. ‘‘ఇప్పుడు ఏమిటి సమస్య!?’’ అని సీరియస్‌గా అడిగాడు సీతాపతి.
‘‘ఏముందిరా!’’ చూస్తూ.. చూస్తూ… వే కోట్ల వారసుడిని వదుకోలేను. మరోవైపు మా ఊరి మా వీరిగాడితో సంబంధం కుపుకోలేను. గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడో అక్కడ ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో పెళ్ళిచేసి పంపేద్దామంటే వాళ్ళు ఒప్పుకోవడంలేదు. మన ఊరిలోనే పెళ్ళిచేయాట. మా వీరిగాడితో పాటు, ఆ పేటలోని బంధువుందరిని పిలిచి మా ఊరిలోనే రిసెప్షన్‌ చేస్తారట!.. అలా చేస్తే నా పరువేమవు తుంది చెప్పు! ఊరిలో వాళ్ళంతా నా మొఖాన ఉమ్మేయరా! వాళ్ళదేముంది… వాళ్ళదారిన వాళ్ళు చక్కగా అమెరికా వెళ్ళిపోతారు. ఈ వీరిగాడు తెల్లారితే బావ అంటూ నా ఇంటి ముందు కూర్చోడు!! నా కుం వాళ్ళ ముందు త ఎత్తుకొని తిరగగనా!? అని అంటూ తన బాధ అంతా వెళ్ళగక్కాడు పీతాంబరం.
నాుగు పెగ్‌ు పడేసరికి పీతాంబరం మొఖమంతా బూరెలాగా ఉబ్బింది. రెగ్యుర్‌గా తాగడం వ్ల బుగ్గు బార్‌ లైట్‌ మెతురులో కెంపుల్లా మెరుస్తున్నాయి. కళ్ళు పొడుచుకు వచ్చి మొఖమంతా వికృతంగా కనపడుతోంది. అంతసేపు ఏకాగ్రతగా వింటున్న సీతాపతి కోకాకోలా గ్లాస్‌ను చేతిలో తీసుకుని మొత్తం తాగేశాడు. ఒక పకోడీ తీసుకుని నముతూ చుట్టుపక్క చూడసాగాడు. అప్పుడప్పడే బార్‌ అంతా నిండుతోంది. అంతా బలిసినవాళ్ళే! వీళ్ళకి ఇలాంటి సమస్యుంటాయన్నమాట అని అనుకున్నాడు.
‘‘నన్నేమి చేయమంటావు చెప్పు! అమ్మాయి అబ్బాయి తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఒకరికి ఒకరు తెగ నచ్చేసారు. కుం తక్కువ వాడయినా అమెరికాలోనే పుట్టి పెరిగినందుకో ఏమో త్లెగా బొద్దుగా ఉంటాడు కుర్రాడు. వాడికి కుం అంటేనే తొసో తెలీదో!! మా పిల్లాడంటే అసు నమ్మలేము! అంత బాగుంటాడు.. ఈ ఇంటర్నెట్‌ మా కొంప ముంచింది. వాళ్ళ కుం విషయం చివర్లో బయటపడిరది. ఈ సినిమాు చూస్తున్నావు గదా.. నేను కాదంటే మా అమ్మాయి గోడ దూకి అమెరికా పారిపోయేలాగుంది! మా తలెక్కడ పెట్టుకోవాలో తెలీయడంలేదు.’’ అని భోరుమన్నాడు పీతాంబరం.
పొద్దుటినుండి వెంటబెట్టుకుని తిప్పుతోంది. ఈ విషయం త్చేడానికేనా! అంత పెద్ద వ్యవహారకర్తకు ఈ విషయం త్చేడం రావడంలేదు. పిచ్చివాడిలా తిరుగుతున్నాడు! తాగుతున్నాడు! ఇప్పటికి వారం రోజుయిందట ఈ లాడ్జిలో మకాం పెట్టి! ఈ రోజే తన అడ్రస్‌ పట్టుకుని ఇంటికొచ్చాడు. అప్పటినుండి వదడం లేదు.
పీతాంబరం నిమ్మళించాడని నమ్మకం కలిగాక మొదలెట్టాడు సీతాపతి.
‘‘చూడు పీతాంబరం! నీ బాధ నాకు అర్థం అయింది. నీ ఆశ కూడా నాకు అర్ధం అయింది. ఇంత వ్యవహారకర్తవు, ఇంత చిన్న విషయానికే బెంబేలెత్తిపోతున్నావు ఎందుకు!?.. అలా కోపంగా చూడకు.. సరే! పెద్దవిషయమే! అమ్మాయికి నచ్చిన సంబంధం. వే కోట్ల వారసుడు. పెళ్ళి చేస్తే ఇద్దరూ సుఖపడతారు. ఒక తండ్రిగా నీ మీద నమ్మకం పెట్టుకున్న నీ బిడ్డకు న్యాయం చేసినవాడవు అవుతావు. అది నీకు చేయాని వున్నా నీకు కుం అడ్డం వస్తోంది.. మొగుడు కొడితే బాధ లేదుకానీ తోటి కోడు నవ్వినందుకు బాధ అయిందన్నట్లుంది. వీరిగాడు నీకు చుట్టమవుతాడని నీ బాధ! నీకిష్టం ఉంటే కుపుకో లేకపోతే మానుకో! ఇక సమాజంలో నా పరువే మవుతుంది.. రేపటి నుండి ఎలా తలెత్తుకు తిరగాలి అని అంటున్నావు.!’ ఇక్కడ ఆగాడు సీతాపతి.
ఏమిటి!? అన్నట్టు చూసాడు పీతాంబరం.
‘‘నీవు ఏమి అనుకోకుంటే నేను కొన్ని నిజాు మాట్లాడతా..!’’ అని పర్మిషన్‌ కోసం చూసాడు.
‘‘అలాగే నీ ఇష్టం! ఏమయినా మాట్లాడు. నా చుట్టూ వున్నవాళ్ళు నా హోదా, పుకుబడి, డబ్బుచూసి భయపడి నాముందు ఏమీ మాట్లాడరు. నాకు కావాల్సింది నిజాలే! అందుకే నిన్ను వెదుక్కుంటూ వచ్చా!’’ అని చెప్పి బేరర్‌కు మరో పెగ్‌ తెమ్మని సైగ చేసాడు పీతాంబరం.
‘‘సరే! నిజాు నిష్టూరంగా ఉంటాయి. అయినా ఒక్కోసారి మాట్లాడక తప్పదు. రోగి బాధపడతాడని అవసరమయినప్పుడు డాక్టర్‌ సర్జరీ చేయకుండా మానడుకదా! ఇప్పుడు నేను మాట్లాడేది నీ మంచికోసమే! నువ్వేమైనా అనుకో నేను చెప్పేది చెబుతాను. తర్వాత నీ ఇష్టం!.. సరే పరువు గురించి మాట్లాడుతున్నాం కదా!… మీ తల్లిదండ్రు ఆర్థిక పరిస్థితి నాకు తొసు. కాసుకులేని వాడిని కుక్క కూడా లెక్క చేయదని, అందుకే ఎలాగయినా సంపాదిస్తా అని అనేవాడివి. నువ్వు సంపాదించిందంతా న్యాయంగా సంపాదించిందేనా!? నీలాంటివాళ్ళ గురించి బయట ఏమనుకుంటున్నారో నీకు తొసా!?.. నీ డబ్బు, నీ బగం చూసి భయంతో జనం నిన్ను గౌరవిస్తున్నారు. అదే నీ పరువని భ్రమ పడుతున్నావు. అందరు లోలోప ఛీ..ఛీ.. అని తిట్టుకునేవాళ్ళే! ఒక్కసారి నేమీదకొచ్చి ఆలోచించు. నీవు ఏనాడయితే అడ్డదార్లలో జనాను ముంచుతూ సంపాదించడం మొదలెట్టావో ఆనాడే నీ పరువు, నీ కుటుంబం పరువు, నీ కుం పరువు గంగలో కలిసిపోయింది.! ఈ పెళ్ళితో నీకు కొత్తగపోయే పరువేది లేదు… నీ ప్లి నీలాంటిదికాదు. అభం శుభం తెలియనిది. ఆ పిల్లాడిని చూసి ఇష్టపడి ఆశపడుతోంది. చక్కగా పెళ్ళిచేసి అమెరికా పంపేయి! అదైనా స్వచ్ఛంగా బతుకుతుంది.’’ అని ఆగి, మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు. 
‘‘ఇందాక నువ్వు మాట్లాడుతూ ఆ పిల్లాడు అమెరికాలో పుట్టాడు. వాడికి కుం అంటే ఏమిటో తొసో లేదో! అని అన్నావు. దాన్నిబట్టే మనకు ఏమి అర్థం అవుతోంది?… ఈ ప్రపంచంలో దాదాపు 650 కోట్ల జనాభా వుంటే కేవం మనదేశంలోనే ఈ కులాన్ని పట్టుకుని వేలాడుతున్నాం. కువృత్తు ఏనాడో పోయినా ఈ కుం గుదిబండలా పట్టుకుని మనల్ని వదడంలేదు. మీ ఊరి పరిధిలోనే ఆలోచిస్తే నీకు ఇది పెద్ద సమస్యగా కనపడుతుంది. అదే నువ్వు విశా పరిధిలో చూడు! ఈ కుం ఎంత అసంబద్ధంగా, కాం చెల్లిందిగా కనబడుతుంది. అందుకే నా సహా ఏమిటంటే.. మన కాంచెల్లిన భావాతో, లేని పరువును ఊహించుకుంటూ ప్లి జీవితాను నాశనం చేయొద్దు. హాపీగా అమ్మాయికి నచ్చిన సంబంధం చేసేయ్‌!’’ అని తేల్చేసాడు సీతాపతి.
ఆ మాటు ఆసాంతం వింటూ వున్న పీతాంబరం రాయిలా బిగుసుకుపోయాడు. మొఖం అంతా కందగడ్డలాగయిపోయింది. చేతిలో గ్లాస్‌ చేతిలోనే వుంది. నిువు గుడ్లేసుకుని సీతాపతిని చూస్తుండిపోయాడు. ఇద్దరి మధ్య గాలి స్థంభించినట్లయింది. డాక్టర్‌ పేషెంట్‌ను చూసినట్టుగా పీతాంబరం మొహంలోకి చూస్తూ చివరి ప్రశ్న అడిగాడు.
ఇంతలోనే పీతాంబరం జేబులోని సెల్‌ మోగింది. అప్పటిదాకా ఒక ట్రాన్సులో వున్న పీతాంబరం ఉలిక్కిపడి సెల్‌ బయటకు తీసి నెంబరు చూసి ఆన్‌ చేసాడు. సీతాపతిని కూడా వినమని సైగ చేస్తూ స్పీకర్‌ ఆన్‌చేసాడు. ‘‘ఆ చెప్పమ్మా..!! అని అన్నాడు. ‘‘నాన్న నీకో విషయం చెప్పాలి! అంకిత్‌ నన్ను కవడానికి ఇండియా వచ్చాడట. సిటీలోనే గ్రాండ్‌ కాకతీయలో దిగాడట. మన వూరు రావడానికి రూట్‌ మ్యాప్‌ అడుగుతున్నాడు. నువ్వు సిటీలోనే ఉన్నావని చెప్పాను. నువ్వు వెళ్ళి వెంటబెట్టుకొని రా నాన్న! అంకిత్‌ నెంబర్‌, రూమ్‌ నెంబర్‌ నీకు వాట్సాప్‌లో పెడతాను సరేనా!’’ అని ఉత్సాహం పరవళ్ళు తొక్కుతూ చెప్పుకుంటూ పోతోంది స్వాతి అవతలివైపు నుండి!
సీతాపతి పీతాంబరాన్ని చూస్తున్నాడు. ఆ తండ్రి ఏమి నిర్ణయం తీసుకుంటాడు! ఏమి జవాబిస్తాడోనని ఊపిరి బిగపట్టాడు.
‘‘నాన్నా! మాట్లాడవేమిటి!? వినపడుతోందా!? అని అడుగుతోంది.
పీతాంబరం ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. కళ్ళ నుండి నీళ్ళు కారుతుండగా ‘‘అదేంటమ్మా! నాకు ఒక్కమాట చెబితే ఎయిర్‌పోర్ట్‌కు కార్‌ పంపేవాడినికదా!? మీ ప్లింతా ఇంతే! నేను వెంటనే హోటల్‌కి వెళ్ళి అబ్బాయిని కలిసి మన ఇంటికి తీసుకువస్తాను. అన్ని ఏర్పాట్లు చేయమని అమ్మకు కూడా చెప్పు! మేము బయుదేరే ముందు ఫోన్‌చేస్తాలే! అబ్బాయికి చెప్పు! నేను ఒక గంటలో వస్తానని! సరేనా!’’ అని అన్నాడు పీతాంబరం.
‘‘థ్యాంక్యు డాడీ!’’ అని ఫోన్‌ పెట్టేసింది
ఇద్దరు స్నేహితు మొహాలో చిరునవ్వు మతాఋ వెలిగాయి. విషయం అంతా అర్థమైంది సీతాపతికి.

admin

leave a comment

Create AccountLog In Your Account