వదిలేయ్‌..

వదిలేయ్‌..

— డి. నటరాజ్ —

వదిలెయ్‌.. వదిలెయ్‌..
నిన్నా మొన్నా అటు మొన్నా నేడూ గంటా నిముషం
సున్నా అరసున్నా
గడిచినదంతా గడిచేదంతా విడిచిన కుబుసంలా
పక్షిదులిపిన ఈకెల్లా. మబ్బు వదలిన చంద్రునిలా..
వదిలెయ్‌.. వదిలెయ్‌.. వదిలెయ్‌..
చిట్లిన జాడు వెతుకుట మాని.. మాలిన కుండను వదిలెయ్‌
గతం కుక్కు తిన్న ఎంగిలి విస్తరాకని తలిచి,
దానిని వెతుకుట, కొకుట మానేయ్‌
ఎంతకుట్టినా అతుకు మిగిలే బొంతని వదలి కావలికుక్కకు వేసేయ్‌
వదిలెయ్‌ వదిలెయ్‌ వదిలెయ్‌
మొన్నటి పాకీ రోడ్డుని, నిన్నటి మురుగుగుడ్డను వదిలేసి
నేటి నదీ తీరానికి నడిచెయ్‌
డబ్బుగుంతలో దాక్కున్న దేవుడ్ని, చలికప్పని మతం గొంగళిని,
దేహానికి దేహానికి మధ్యన కుం కత్తుల్ని వదలి
నేటి మెత్తని పచ్చికపై రేపటి పసిపాపలా
నడిచెయ్‌ నడిచెయ్‌..నడిచెయ్‌..
చూడు చూడు నవమాసాు అంధకారం వదిలి
అపుడేపుట్టిన బిడ్డను చూడు
ప్రకృతియే వింతగా జూసే ప్యూపా విడిచిన
చిుక రెక్కు మెరుపు చూడు
చూడుచూడు పారే నీటి పరవళ్ళకు జడిసి
ఒడ్డుకు కొట్టుకుపోతున్న తెట్టును చూడు
వదిలెయ్‌ వదిలెయ్‌ నీకునీవే
కాళ్ళకు కట్టుకున్న సంకెళ్ళొదిలెయ్‌
పీకకు చుట్టుకుంటున్న బంధాలొదిలెయ్‌
సంసారపు నిప్పులో కోరిక జాతర వదిలెయ్‌
శ్వాస ప్చీగా అడ్డుపడే ముక్కుదిబ్బడకు మందెయ్‌
నిన్నా మొన్న అక్రమాకు పుట్టిన
నేడు అనే అనాధ బిడ్డకు నేనున్నాంటూ, నీవే నేనని
నేనే నీవని ఎత్తుకు ముద్దాడెయ్‌…

` డి. నటరాజ్‌

admin

leave a comment

Create Account



Log In Your Account