రాజకీయ వల ` 2019

రాజకీయ వల ` 2019

‘‘దిక్కులేనివాడికి దేవుడే దిక్కు’’ అనేది మన తొగు సమాజపు జీవితానుభవం నుండి ఏనాడో పుట్టిన సామెత. జీవన సంక్షోభంలో కొట్టుమిట్టాడే సామాన్య ప్రజ విషయంలో యిది నిజమే కాని, దేశ ప్రజను రకరకా సంక్షోభానుండి బయటపడవేస్తామంటూ రాజకీయాధికారాన్ని చేపట్టే పార్టీు, పాకు కూడా తమకు దేవుడే దిక్కుగా చూస్తున్నారంటే వాళ్ళు స్వయంగా సంక్షోభంలో చిక్కుకున్నారన్నమాటే!!
వ్యక్తిగతంగా దైవభక్తినీ, మత విశ్వాసానూ కలిగివుండటం వేరు. వాటి పేరిట ప్రజలో ఉన్మాదాను వ్యాపింపచేసి, తద్వారా భించే (సాంఘిక) శక్తిని రాజకీయాధిపత్యానికి వినియోగించుకోవడం వేరు. మొదట వారిని మనం భక్తునుకుంటాం. రెండవవారిని మాంత్రికును కుంటాం. మన సాహిత్య కళా భావజాంలో ఇలాంటి క్షుద్రమాంత్రికు గురించి మనకు బాగా తొసు.
మన కాపు మాంత్రికు, ‘‘రాజుని మించిన రాజసాన్ని ప్రభువుని మించిన ప్రభుభక్తి’’ని ప్రదర్శించేవారిలాగా దేవుని మించిన దైవభక్తిని ప్రదర్శిస్తారు. తాము కాపాడకపోతే దేవుడే లేకుండా పోతాడనుకుంటారు. శబరిమలోకి 1050 ఏళ్ళ నడుమ వయసున్న మహిళు అడుగిడ కూడదని ఆంక్షు విధించింది మనుషులా, దేవుడా అంటే దేవుడేనంటారు. రాకూడదని వారిని రాకుండా దేవుడే చేసుకుంటాడు కదా, నడుమ మీరెందుకు కత్తు, కఠార్లతో కాపలా కాయటం అంటే మేము అడ్డుపడకపోతే దేవుడేం చేసుకోలేడంటారు.
బాబ్రీ మసీదు విషయంలో కూడా అంతే. మీరు ఉన్నదని ప్రచారం చేసే రామాయాన్ని, మీరు నమ్ముతున్నట్లే బాబరు చక్రవర్తి పడగొట్టి 492 సంవత్సరాయిపోయింది కదా! ఇపుడు మీరు రామాయాన్ని నిర్మిస్తే తప్ప రామునికి తగు న్యాయం జరగనట్టేననుకుంటున్నారు. రాముడిని మీరు సర్వశక్తివంతునిగా భావిస్తున్నారా, నిస్సహాయుడనుకుంటున్నారా? అని ప్రశ్నిస్తే తామే రామునిగుడి కట్టకపోతే రాముడు స్వయంగా ఏమీ చేసుకోలేడనే వారు నమ్ముతారు. ‘‘సంఘపరివార్‌ రక్షతి రామః’’ అంటే సంఘపరివారమే రాముని రక్షిస్తుంది అని అర్ధం. తాము రామునికంటె గొప్పవారమనుకొంటారు. ఆచరణలో దైవశక్తిని మించినదే మానవశక్తి అని రుజువుపరుస్తారు.
భారతీయ జనతాపార్టీ మీద దేవునికి లేక రామునికి కరుణ లేదని నా నమ్మకం. అదే ఉంటే నాుగేళ్ళలో ఇన్నిన్ని ఘోరమైన తప్పు చేయనిచ్చేవాడేనా? కనీసం స్విస్‌ బ్యాంకులో దాగిన క్ష కోట్ల భారతీయ సంపదనైనా వారి ద్వారా తెప్పించి యిచ్చేవాడు కాదా!
మనదేశపు ఎన్నికు దైవ, మత విశ్వాసా ప్రాతిపదికన కాకుండా సాధారణ మానవులైన భారతీయు నిర్మించుకున్న రాజ్యాంగచట్టం ఆధారంగా జరుగుతున్నాయి. ప్రకృతి అందించినవీ, మానవు నిర్మించినవీ…. అన్నీ లౌకికమైనవే. అనగా ఇహలోక వాస్తవికమైనవి. వాటి ప్రాతిపదికన ఇప్పుడు ఆలోచన చేద్దాం.
ప్రజాస్వామిక యుగంలో ప్రజ జీవన సమస్యలైన పేదరికం, నిరుద్యోగం, విద్య, వైద్యం, సాంఘిక, సాంస్కృతిక సమానత్వం, దోపిడీ పీడన నుండి రక్షణ, కష్టానికి తగిన ప్రతిఫం, స్త్రీపురుష సమానత్వం ఇలాంటి లౌకిక సమస్యు మాత్రమే ఎజెండాలో వుండాలి. వీటికి భిన్నంగా వ్యక్తిగత స్థాయికి పరిమితం కావాల్సిన దైవ, మత విశ్వాసాను సామాజిక సంఘర్షణాంశాుగా, విద్వేష ఉన్మాదాుగా రెచ్చగొట్టి, వాటిద్వారా ఓట్లుసీట్లు పొంది రాజకీయాధికారాన్ని చేపట్టే విధానమే క్షుద్ర రాజకీయం. దేశ ప్రజు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యకు తామే పరిష్కారం చూపగవారమంటూ నాుగున్నర ఏళ్ల క్రితం కేంద్ర పానాధికారాు చేపట్టిన నరేంద్ర మోడీ పరిపాన సమస్త రంగాలో పైఫల్యానే చవిచూస్తుంటే, వారికి మతోన్మాదం తప్ప మరో దిక్కులేని స్థితికి దిగజారిపోనున్నారు. మన దేశాన్ని ఒక సాంస్కృతిక రాజకీయ సంక్షోభం నుండి మరో సాంస్కృతిక రాజకీయ సంక్షోభంలోకి యిది నడిపిస్తుంది. సమాజాన్ని మరింత అశాంతిలోకి, అభద్రతలోకి నెట్టటం తప్ప మత ఉన్మాద రాజకీయాకు మరొక దిక్కు వుండదు. తాజాగా... కేంద్రప్రభుత్వం రెండేళ్ల క్రితం చేసిన పెద్దనోట్ల రద్దును కిరాతకమైన చర్యగా అరవింద్‌ సుబ్రహ్మణ్యం ప్రకటించాడు. అతనెవరో కాదు, 4 ఏళ్ళపాటు మోడీ ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సహాదారు. పెద్దనోట్ల రద్దు ప్రజకు ఇచ్చిన పెద్ద షాక్‌ అన్నాడు సుబ్రహ్మణ్యం. తద్వారా తన ప్రకటనతో కేంద్ర ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చాడు. పెద్దనోట్ల రద్దు కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో కూరుకుపోతుందనీ, అభివృద్ధి కుంటుపడిరదనీ ఆయన చెబితే, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గణాంకా ప్రాతిపదకను మార్చి అంకెగారడీ అభివృద్ధిని చూపిస్తున్నాడు. రిజర్వు బ్యాంకునూ, సిబిఐనీ తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాని వారు చేసే ప్రయత్నం వికటించక తప్పదు. ప్రధానమంత్రే స్వయంగా సుప్రీంకోర్టుకి పరోక్షమైన హెచ్చరికు చేస్తున్నాడు. ఒకవైపున కాంగ్రెసు వారి వొత్తిడికి సుప్రీంకోర్టు భయపడి, లొంగి వారి కోరిక ప్రకారం బాబ్రీ మసీదు వివాదాన్ని పరిష్కరించకుండా వాయిదా వేసిందని స్వయంగా ప్రధానే ఆరోపిస్తున్నాడు. తద్వారా అధికారంలో వున్న ప్రభుత్వాకు సుప్రీంకోర్టు కూడా తవంచే స్థితి వున్నదని చెప్పకనే చెబుతున్నాడు. మరొక వైపు తమ ఎన్నిక రాజకీయాకు సానుకూంగా వుండే తీర్పు సకాంలో యివ్వకపోతే తమ చర్యు వేరే విధంగా వుంటాయని సుప్రీంకోర్టును హెచ్చరిస్తూ అందుకు అనుగుణమైన భూమికను సిద్ధం చేస్తున్నారు. గత ఆదివారం (25112018) అయోధ్యలో విశ్వహిందూ పరిషత్తూ, ఉద్ధవ్‌ ధాక్రే శివసేన, తక్షణమే ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీచేసి, రామమందిర నిర్మాణానికి పూనుకోకపోతే ఆందోళన తప్పదనే హెచ్చరికు జారీ చేసాయి. సుప్రీంకోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండా తమ విశ్వాసానే అంతిమ న్యాయంగా శాసించదుచుకున్న దాంట్లో భాగమే పై డిమాండ్లు. భాజపా పాకుకి కావసింది కూడా అదే. సుప్రీంకోర్టు తమకు అనుకూంగా తమ ఎన్నిక గొపుకి సహాయకంగా తీర్పు ప్రకటించిందా... సరి! లేకుంటే దౌర్జన్య పూరితంగా దేశమంతా ఉన్మాద, ఉద్వేగాు రగిలించి ఆ కార్చిచ్చులో ఓట్లు అనే బొగ్గును ఏరుకుని అధికార పీఠాను మరోసారి ఏదో వొకలా నిుపుకోదుచుకున్నారు. బాబ్రీ మసీదు రామజన్మభూమి వివాదాన్ని భారత పాకవర్గాు వ్యూహాత్మకంగా అపరిష్కృతంగా మిగుస్తూ, దాని సాకున వివిధ సందర్భాలో అధికార సోపానాు అధిరోహించడానికి నిచ్చెనమెట్లుగా వాడుకుంటూ వస్తున్నారు.
నిజానికి మత కట్టడాకు సంబంధించి 1947 ఆగస్టు 15 నాటికి ఎవరి ప్రార్థనా మందిరాుగా వుండివుంటే వారివేగా కొనసాగించానేది చట్టబద్ధ నిర్ణయం. కానీ 1949 డిసెంబరు 22 అర్ధరాత్రి కొందరు రామభక్తునే పేర అప్పటికి 421 ఏళ్ళ క్రితం నిర్మించిన బాబ్రీ మసీదులోకి దౌర్జన్యంగా ప్రవేశించి దాని లోప బా సీతారాము విగ్రహాను పెట్టి, వారు అక్కడ వెలిశారనీ, తద్వారా అదే నిజమైన రాముని జన్మస్థమనీ వాదన మొదు పెట్టారు. ఆనాటి ప్రభుత్వాు ఆ విగ్రహాను తొగించక పోవడంతో, కోర్టు తీర్పు ద్వారా 1986 ఫిబ్రవరి 1న (రాజీవ్‌గాంధీ ప్రధానిగా వుండగా) మసీదు తాళాు తెరిపించి రామునికి పూజు, కరసేమ నిర్వహించుకొనే హక్కు పొందారు. ఆ తర్వాత ఆ మసీదు నిర్మాణం ప్రాచీన రామాయం ధ్వంసం చేసినదానిపై కట్టినదనే విపరీత ప్రచారాు, ఉద్వేగాు సృష్టించి, 1992 డిసెంబరు 6న దాన్ని నేమట్టం చేశారు. బాబ్రీ మసీదురామజన్మభూమి పేరిట సృష్టించిన ఉద్వేగాతో కొన్ని రాష్ట్రాలో, కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్నికలో గెలిచిన తర్వాత ప్రభుత్వాను నిబెట్టుకోవడానికి కూడా మతోన్మాదానే తిరిగి తిరిగి వాడుకోవడం ఒక విధానం చేసుకున్నారు. 2002లో ‘గుజరాతు గాయం’ అందులో భాగమే. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికు జరిగిన ప్రతిసారీ మతోన్మాద దాడుూ, దౌర్జన్యా నడుమ సాగుతున్నాయి. 2014లో మోడీ నాయకత్వాన భాజపా అధికార పగ్గాు చేపట్టటానికి ప్రజకిచ్చిన అనేక వాగ్దానాు అము కాకపోగా వివిధ రూపాలో హత్యాకాండ, అణచివేత దాడు, దౌర్జన్యాు, బెదిరింపు సాగిస్తూ తమను ప్రశ్నించినవారిని విమర్శించిన వారినే కాకుండా తమ పార్టీలోని భిన్నాభిప్రాయాు కలిగిన వారిపట్ల కూడా సహించలేని స్థితికి చేరుకున్నారు. అయితే ఆర్థిక రాజకీయ సంక్షోభం కొనసాగుతూ తీవ్రతరమవుతూ వుంది. ‘అచ్ఛేదిన్‌’ కేవం స్వంత కోటరీకి మాత్రమే పరిమితమైంది. ఫలితంగా మిత్రపక్షానేవారితో వైరుధ్యాు వచ్చాయి. ఇతర పాక ముఠానుండి కూడా తీవ్ర వ్యతిరేకత నెదుర్కొంటున్నారు. పెద్దనోట్ల రద్దుని వ్యతిరేకించినవారందరూ దేశ ద్రోహునీ, న్లధనం కలిగినవారనీ ఘోర విమర్శు చేసిన భాజపా వారు, అదొక పూర్తి వైఫ్యంగా బయట పడినప్పటికీ అందుకు నైతిక బాధ్యత వహించకుండా మరొకసారి మతోన్మాద వ్యాప్తితో 2019లో అధికారానికి అయ్రి చాస్తున్నారు. ఈలోగా రిహార్సల్‌లాగా శబరిమ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని మొదట స్వాగతించిన వారే రెండు రోజుల్లో ‘తూచ్‌’అంటూ దానికి వ్యతిరేకంగా ఉద్వేగపూరిత ఆందోళను, ఆవేశపూరిత హెచ్చరికు సాగించారు. సుప్రీంకోర్టు తీర్పుని ధిక్కరించి కూడా సృష్టించే భావోద్వేగాతో ఓటు బ్యాంకును పెంచుకోగమనే నమ్మకంలో వారున్నారు. ప్రధాని మోడీ బాబ్రీ కేసులో సుప్రీంకోర్టు చేసిన హెచ్చరిక దానికి కొనసాగింపే. బాబ్రీ కేసులో తీర్పు జనవరిలో తమకు అనుకూంగా వస్తే దాని ప్రకారం రామమందిర నిర్మాణం చేద్దామనీ, వ్యతిరేకంగా వస్తే తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళన సాగించి ఎన్నికలోగా దేశవ్యాపితంగా అ్లకల్లోం సృష్టిద్దామనే ప్రయత్నాల్లో వున్నారు. అలా కాకుంటే తమ ప్రభుత్వం జారీచేసే ఆర్డినెన్సు ద్వారానైనా మందిర నిర్మాణంవైపు సాగిపోవాని చూస్తున్నారు. ప్రజ వాస్తవికమైన జీవన సమస్య నుండి పక్కదారి పట్టించి, సమస్య కాని దానినే దేశ సమస్యగా, జాతి సమస్యగా, మత సమస్యగా అదే బతుకుతెరువు సమస్య అన్నట్లుగా పక్కదార్లు పట్టించే భావోద్వేగ, మతోన్మాదాను వ్యాప్తిచేయటం ద్వారా పొందే అధికారంతో, నేటి కుళ్ళికంపు కొడుతున్న అర్ధవస అర్ధప్యూడల్‌ వ్యవస్థను కాపాడగలిగే పాక ముఠా ఛాంపియన్స్‌గా వారు నివదుచుకున్నారు. ప్రజా ఉద్యమా ద్వారా తప్ప ఈ ఫాసిస్టు తరహా ఉద్రిక్త, అణచివేతను ఎదుర్కోలేము. గత అక్టోబరు 2న, ఈ నవంబరు 2930వ తేదీలో ఢల్లీి మహానగరంలో జరిగిన రైతాంగ ఆందోళన తరహాలో ప్రజ వాస్తవిక జీవన సమస్యపై పెద్ద ఎత్తున కదలిక తీసుకురావటం ద్వారా తప్ప ‘క్షుద్రమాంత్రిక’ కల్లోలాను నిరోధించలేము. ఈ తరహా ఫాసిస్టు ప్రమాదాన్ని రచయితు ` కళాకాయి, ప్రజాస్వామిక లౌకిక వాదు గుర్తించి తగు రూపాలో ప్రజను చైతన్యవంతం చేయాలి.
నిరసన స్వరానూ, గళానూ అణచిపెట్టే క్ష్యంతో రచయితూ కళాకాయి సామాజిక కార్యకర్తపై మోపుతున్న తప్పుడు అభియోగా కుట్ర కేసును ఖండిరచటం ఈ సందర్భంగా మనందరి విధి. కర్తవ్యం.

30112018 ` దివికుమార్‌

admin

leave a comment

Create AccountLog In Your Account