— ఎరుకలపూడి గోపీనాథ రావు —
దగాకోరు రాజకీయ ప్రచారాు నమ్మకు
రాజకీయ మీడియా ప్రసారాు నమ్మకు
కాగితాపై ప్రగతిని చూపిస్తూ మురిపిస్తూ
పగటికలలో ముంచే ప్రదర్శను నమ్మకు ॥ దగాకోరు ॥
ఖరీదైన చదువు కొనలేని పేదబిడ్డు
కాయకష్టము బ్రతుకుకు కట్టుబానిసు అవుతూ
కన్నీళ్ళను దిగమ్రింగి క్రుంగి కుము దేశంలో
‘అక్షరాస్యత’ గురించి గొంతు చించుకుని అరచే
దొంగ ప్రజాసేవకు ప్రవర్తను నమ్మకు ॥ దగాకోరు ॥
నిరుద్యోగ భూతానికీ చిక్కి చితికి చింతిస్తూ
వ్యధకు, వ్యసనా చెరకు లొంగి పతనమైపోతూ
యువత భవిత దీనంగా దిగజారే దేశంలో
మాయదారి లెక్కతో అభివృద్థిని వర్ణించే
కపట పాకు జాదూ ప్రసంగాు నమ్మకు ॥ దగాకోరు ॥
విత్తనా కరువులో, ఎరువు ధర బరువుతో.
అప్పుతో, వడ్డీతో, ప్రకృతి వైపరీత్యాతో
విసిగి విసిగి రైతన్ను విషం త్రాగు దేశంలో
‘రైతేరాజ’ని చెపుతూ అన్నదాతనేమార్చే
దుష్టపాకు టక్కరి ప్రకటను నమ్మకు
బాబా దీవెనకు ప్రాకులాడు అధికాయి
సన్యాసు పాదధూళికై తపించు కుబేయి
దేవుని పేరిట కోట్లను కుమ్మరించు దేశంలో
మనిషే దేవుడు అంటూ, మానవతే గొప్పదంటూ
ఏలికలొగెత్తి చాటు ప్రలాపాు నమ్మకు ॥ దగాకోరు ॥
ప్రజను ముఢనమ్మకా దాసుగా మార్చేసి
మనుషును ఆధ్యాత్మిక మత్తులోన ముంచేసి
పైవాని దయలేనిదే పనులేవీ జరగవని
నారును వేసిన వాడే నీరునందజేస్తాడని
సోమరిగా, భీరువుగా, కీల్బొమ్మగ చేసేసి
వ్యక్తి శక్తి నణగద్రొక్కు దేవుళ్ళ దేశంలో
వైజ్ఞానిక వైభవాన్ని తెస్త్తామని తెగవాగే
బూటక ఉద్ధారకు ప్రవచనాల్ నమ్మకు ॥ దగాకోరు ॥
దళితుపై సాగుతున్న దమనకాండు చూసి
అబపై ఆగనట్టి అత్యాచారాు చూసి
నేరాు, ఘోరాు, కబ్జాు జోరు చూసి
పచ్చని చేను మ్రింగే నవనగరీకరణ చూసి
చిరు వ్యాపారునణచే ప్రపంచీకరణ చూసి
చూడనట్టుగా వుండే పానగ దేశంలో
పౌరుని భద్రతకై అది చేస్తాం ఇది చేస్తాం
అని అరచే అమాత్యు ప్రయత్నాు నమ్మకు ॥ దగాకోరు ॥
ంచాకు పీడిరచే ఉద్యోగు అవినీతిని
ప్రజాధనం క్లొగొట్టు కంట్రాక్టర్ మోసాను
ప్రకృతి సంపదను దోచే మాఫియా వేషాను
బడుగు కాపురాు క్చూు సారాయి ఆగడాన్ని
పౌరును హతమార్చే టెరరిస్టు ఘాతుకాన్ని
ఆపలేని అసమర్థు రాజ్యమేు దేశంలో
చెడునంతా రూపుమాపు చేతు చేపడతామని
కోతు కోసే నేత ప్రవృత్తు నమ్మకు ॥ దగాకోరు ॥
పాలితు సంక్షేమమే ధ్యేయంగా భావిస్తూ
నిజానే ప్రకటిస్తూ నిర్భయంగ పాలిస్తూ
నిష్కళంక పానకు నిుపు నీడ కల్పిస్తూ
ప్రజాస్వామ్య ఫలాను ప్రతివారికి అందిస్తూ
విశ్యమంత భరతజాతి కీర్తి విస్తర్లిజేస్తూ
దేశాన్ని కాపాడే నేతు వచ్చే దాకా
గారడీ నేత ఏ ప్రయోగాు నమ్మకు ॥ దగాకోరు ॥