భారతరాజ్యాంగమే ముద్దు `

భారతరాజ్యాంగమే ముద్దు `

— పిల్లి కవిత మల్లికా —

మాకు ఏ రామాయణ, భారతాూ వొద్దు
నన్ను మనిషిగా గౌరవించిన భారత రాజ్యంగమే ముద్దు
నా గాలి సోకగానే మైపడే
దేవుళ్ళు నాకెందుకు?
నన్ను మనిషిగా గుర్తించని
మతాల తో నాకేం పని
నా పొడ తగలితేనే
ఆయాు విషపుకోరు చాస్తున్నప్పుడు
నాపేరు వింటేనే
మీ సహనం మారణాయుధాుగా అవతారం ఎత్తుతున్నప్పుడు
మీ జై శ్రీరాం నినాదాు
మా బతుకు గిన్నెల్లో మట్టిబోస్తున్నప్పుడు
మా ప్రశ్న తల చుట్టూ
మీ హెచ్చరిక తపాగాు చుడుతున్నప్పుడు
‘భారతదేశం నా మాతృభూమి’
‘భారతీయుందరూ నా సహోదయి’ నినాదా సాక్షిగా
నా కల ప్రపంచం మంచుకొండలా కరిగిపోతూనే ఉంది
కుం క్రౌర్యానికి సజీవ దహనామై బలైపోతూనే ఉన్నాం
వాడప్లి
రచ్చబండ చేతిలో మానభంగానికి గురై రాలిపోతూనే ఉంది
మేమెంత గువ్వప్లిల్లా వొదిగి వొదిగి ఉన్నా
కర్కశత్వపు కత్తుకు అరటి బోదెల్లా తెగిపడుతూనే ఉన్నాం
నేనో అక్షరోదయమై ఉదయించినప్పుడల్లా
ఉరితాళ్ళు నన్ను ముద్దాడుతూనే ఉన్నాయి
ఏ పవిత్ర గ్రంథాన్ని పారాయణం చేసినా
ఏమున్నది మానవత్వం
మా మనోశిఖరాపై నిర్దాక్షిణ్యంగా దాడి చేయడం తప్ప
ఏ దేవుళ్ళ చరిత్ర తిరగేసినా
ఏమున్నది నీతీ నియమం
దొంగచాటుగా కార్యాు నెరవేర్చుకోవడం తప్ప!

admin

leave a comment

Create Account



Log In Your Account