ప్రశ్న కొడవలి

ప్రశ్న కొడవలి

— పద్మావతి రామభక్త —

నీ ప్రతీశ్వాసా
దేశానికి పచ్చని పందిళ్ళు వేయమనే మంత్రాన్ని
అనుక్షణం వల్లిస్తున్నప్పుడు
అలా ఎలా వదలిపోదామనుకుంటావు
నీ ఆశన్నీ మా ఆకలిని అు్లకుని అడుగులేస్తున్నపుడు
ఎందుకు అలాంటి కఠోర నిర్ణయం తీసుకుంటావు
నీ కన్నీటి చుక్క మివ తెలియని అు్పమే
కానీ
అన్నీ ఆకళింపు చేసుకుంటూ
అందరికీ అమ్మలా ప్రేమగా
నోటికి అన్నం ముద్దనందించే నువ్వెలా
ఆకాశమంత కర్తవ్యాన్ని విస్మరించి
వీడ్కోు పుకుదామనుకుంటావు?
వెన్నముకను ఇంధ్రధనస్సులా వంచి మరీ
అందరికీ వెన్నుదన్నులా నిచే నీకు
అండగా నిబడే వారు కానరాక కుముతున్నావని
మాకెవరికీ కనీసం పట్టుదలే
ఎన్నో దయ్యాు
నువ్వు కష్టించి పండిరచిన బంగారపు కుప్పను
క్షణంలో మాయం చేసి
చిల్లిగవ్వ నీ చేతుల్లో పెడుతున్నాయని గమనించినా
నోరు మెదపకుండా నిబడిన
పాకుతో సహా మేమందరమూ
ఆ పాపంలో భాగం పంచుకున్నాంలే.
అయినా తప్పున్నీ క్షమించి బిడ్డను
మెత్తని చేతులొడ్డి కాపాడే తల్లిలా
నిత్యం మా కడుపు నింపుతూ
ఎప్పటికీ మమ్మల్ని వదలిపోనని ప్రమాణం చేయవూ!
అందరికై అహర్నిశూ అరిగిపోతూ విరిగిపోతున్న నువ్వు
మింగ మెతుకు లేక ుంగు చుట్టుకుపోతున్న పేగు
మెడకు ఉరితాడై ఊపిరాడకుండా చేస్తున్నా
కనీసం ఆలోచించని మా అజ్ఞానానికి క్షమించవూ !
ఏదో ఒక రోజు నీ నుండి చిందిన ప్రతీ చెమట చుక్కా
ప్రశ్న కొడవలై మొలిచి
నీకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోదులే !

admin

leave a comment

Create AccountLog In Your Account