పాకిస్తానీ నియంత నెదరించిన కవయిత్రి షామిదా రియాజ్‌ మరణం

పాకిస్తానీ నియంత నెదరించిన కవయిత్రి షామిదా రియాజ్‌ మరణం

పాకిస్తానీ నియంత నెదరించిన కవయిత్రి షామిదా రియాజ్‌ మరణం
పాకిస్తాన్‌కు చెందిన ప్రసిద్ధ ఉర్దూ రచయిత్రి, కవయిత్రి, స్త్రీజన పక్షపాతి ఫామిదా రియాజ్‌ తన 72వ ఏట 21 నవంబరు 2018న మరణించారు. ఆమె 28 జులై 1946న ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో అవిభక్త భారతదేశంలో జన్మించారు.
ఆమె తండ్రి రియాజుద్దీన్‌ అహమద్‌ ప్రసిద్ధ విద్యావేత్త ` సింధ్‌ రాష్ట్రపు ఆధునిక విద్యావిధాన రూప క్పనలో ప్రముఖ పాత్ర వహించారు. సింధ్‌ రాష్ట్రానికి చెందిన వారి కుటుంబం హైదరాబాదు నగరంలో స్థిరపడ్డారు. ఆమె నాుగేళ్లు వయసులో తండ్రి మరణించారు. తల్లి పెంపకంలో ఫామిదా ఉర్దూ, సింధీ సాహిత్యంతో పరిచయం ఏర్పడిరది. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రేడియో పాకిస్తాన్‌లో వార్తు చదివే ఉద్యోగం చేశారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తికాగానే పెద్దు నిర్ణయించిన వివాహం చేసుకొని భర్తతో పాటు కొన్నేళ్లు ఇంగ్లాండ్‌లో వున్నారు. ఆయనకు విడాకు ఇచ్చిన తర్వాత పాకిస్తాన్‌కు తన కూతురితో వచ్చేశారు. ఈ కాంలో ఆమె బిబిసి ఉర్దూ (రేడియోలో పనిచేయడమేగాక చనచిత్ర నిర్మాణంలో డిగ్రీ సంపాదించారు. ఆమె మొదటి కవితా సంపుటి ఈకాంలోనే వచ్చింది.
ఆ తర్వాత ఆమె వామపక్ష రాజకీయ కార్యకర్త జాఫర్‌ ఆలీ ఉజాన్‌ను పెళ్ళి చేసుకున్నారు. ‘ఆవాజ్‌’ పేరుతో ఉర్దూ పత్రికనొక దానిని ప్రారంభించారు. పాక్‌ నియంత జియా ఉల్‌హక్‌ ఈ పత్రికపై విరుచుకు పడ్డారు. భార్యాభర్తలిద్దరిపైనా ఎన్నో కేసు మోపారు. పత్రిక ఆగిపోయింది. ఇద్దరినీ జైులో పెట్టారు. అయితే ఫామిదా, తన సాహిత్య అభిమాని సహకారంతో బెయిల్‌ సంపాదించి, తన ఇద్దరి ప్లితో, చెల్లొతో ఒక కవితాగోష్ఠిలో పాల్గొనానే మిషతో ఇండియాకు పారిపోయారు. ఆమె భర్త కూడా జైునుంచి విడుదలై ఇండియాకు వచ్చేశారు. ఆమె స్నేహితురాు ప్రసిద్ధ రచయిత్రి అమృతాప్రీతమ్‌, ఆనాటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో మాట్లాడి ఆమె ఇండియాలో నివసించటానికి అనుమతి సంపాదించారు. ఏడేళ్లపాటు ఇండియాలో ప్రవాస జీవితం గడిపి బేనజీర్‌ భుట్టో వివాహ పరిచయ కార్యక్రమం సందర్భంగా పాకిస్తాన్‌కు ఈ కుటుంబం తిరిగివెళ్ళింది. ఇండియాలో ఉన్న కాంలో ఫామిదా ఢల్లీిలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాయంలో కవయిత్రిగా గౌరవ హోదాలో పనిచేశారు. అప్పుడే ఆమె హిందీ నేర్చుకున్నారు.
బేనజీర్‌ భుట్టో మొదట అధికారంలోకి వచ్చినపుడు ఫామిదా నేషనల్‌ బుక్‌ ఫౌండేషన్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. నవాజ్‌ షరీఫ్‌ అధికారంలోకి రాగానే ఆ పదవినుండి తొగించబడ్డారు. ఇండియాకు ఏజెంటుగా ముద్ర వేయడంతో, ఉద్యోగానికి కష్టపడాల్సివచ్చింది. పెరుగుతున్న ప్లికోసం ఒకేసారి మూడు చోట్ల ఉద్యోగాు చేశారు. బేనజీర్‌ భుట్టో రెండోసారి అధికారంలోకి రాగానే ఖాయిద ఎ అజామ్‌ అకాడమీలో ఆమెకు ఉద్యోగం భించింది. బేనజీర్‌ ప్రభుత్వం మర పడిపోగా, ఇస్లామాబాద్‌లో ఫామిదాను ఎవరూ పట్టించుకోలేదు. అక్టోబర్‌ 2007లో తన స్నేహితుతో పిక్‌నిక్‌కు వెళ్ళి ఈతకొడుతూ ఫామిదా ఒక కొడుకు మరణించాడు.
ఫామిదా విద్యార్థిగా ఉన్నప్పటినుండీ సామాజిక, రాజకీయ కార్యక్రమాలో చురుకుగా పాల్గొన్నారు. సింధ్‌ విశ్వవిద్యాయంలో ఎం.ఏ విద్యార్థినిగా విద్యార్థి రాజకీయాలో పాుపంచుకున్నారు. 1960లో ఆయూబ్‌ఖాన్‌ పానలో విద్యార్థి యూనియన్లను నిషేధిస్తూ తెచ్చిన విశ్వవిద్యాయ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఆమె ప్రసంగించారు. రచను చేశారు.
ఆమె జీవితంలో ఎన్ని ఒడుదొడుకు వచ్చినా ఆమె కవిత్వం రాయడం మానలేదు. ఆమె రచననిండా సామాజిక, రాజకీయ అన్యాయాపై ధ్వజమెత్తడం గమనిస్తాం. కరడు గట్టిన మత సంప్రదాయ పితృస్వామిక, పాకిస్తాన్‌ సమాజంలో స్త్రీ స్వేచ్ఛగురించీ, సమానత్వం గురించీ ధైర్యంగా రాసిన ఫామిదా, సంప్రదాయవాదు ఆగ్రహానికి గురయ్యారు. 1967లో ఆమె మొదటి కవితా సంపుటి రాగా, 1973లో వచ్చిన రెండవ సంపుటి ‘బదీన్‌ దరీదా’ (ుశీతీఅ ఖీశ్రీవంష్ట్ర)ను సంప్రదాయ సాహితీ విమర్శకు అశ్లీ సాహిత్యంగా జమకట్టారు. పురుషు తమ భావాను స్వేచ్ఛగా తమ రచనలో చెప్పగ్గుతున్నారు. స్త్రీు అలాచేస్తే తప్పు పడుతున్నారనీ, స్త్రీు కూడా స్వేచ్ఛగా తమ భావాు చెప్పానీ ఆమె అనేవారు. సాహితీ విమర్శకు ప్రశంసందుకున్న కొన్ని నవలు కూడా ఆమె రచించారు. ఇంగ్లీషు, హిందీ, సింధీ, పర్షియన్‌, ఆరెబిక్‌ భాషలో వున్న ప్రావీణ్యం ఫలితంగా సూఫీ సాహిత్యాన్నీ, తూర్పు యూరప్‌ సాహిత్యాన్నీ ఉర్దూలోకి అనువదించారు. 2014 మార్చి 8న జరిగిన ఒక సెమినార్‌లో ఇండియాలో పెచ్చర్లిుతున్న అసహనాన్ని ఉద్దేశిస్తూ ఇక్కడ పెరుగుతున్న హిందుత్వ ఉన్మాదాన్ని, జియా ఉల్‌హక్‌ పానలోని ఇస్లామిక్‌ సంప్రదాయ వాదంతో పోల్చారు. హ్యుమన్‌ రైట్స్‌ వాచ్‌ సంస్థ ఆమెకు 2017లో హెమ్మెట్‌ హెల్మాన్‌ ప్రతిఘటనా సాహిత్య అవార్డు నిచ్చారు. 2005లో సింధ్‌ ప్రభుత్వం షేక్‌ ఆయూబ్‌ కవిత్వ అవార్డు, 2010లో పాకిస్తాన్‌ ప్రభుత్వం ప్రెసిడెంట్‌ అవార్డు, 2010లో గౌరవ పౌర అవార్డు ఆమె అందుకున్నారు.

admin

Related Posts

leave a comment

Create Account



Log In Your Account