తరుగుతున్న తెలుగు స్థానం

తరుగుతున్న తెలుగు స్థానం

— చెరుకూరి జ్యోతి —

2018 జూన్‌ నెలో భారత ప్రభుత్వం ప్రకటించిన భాషవారీ జనాభా లెక్క ప్రకారం తొగుభాష మాట్లాడేవారు దేశంలో 2001లో 3వ స్థానంలో వుండగా, 2011 నాటికి 4వ స్థానానికి జారిపోయినట్లు తేల్చారు. 1971లో హిందీ (36.99 శాతం) తర్వాత తొగు, బంగ్లా రెండూ 8.16 శాతంతో రెండవ స్థానంలో వుండేవి. 1991 నాటికి బెంగాలీ 8.3%కి పెరగగా తొగు మాట్లాడేవారు 7.87 శాతానికి పడిపోయారు. ఇపుడు 2011 జనాభా లెక్క ప్రకారం తొగు మాట్లాడేవారు కేవం 6.7 శాతం మంది మాత్రమే కాగా మనకూ హిందీకి నడుమ బంగ్లాతో పాటు మరాఠీ కూడా వరుసలో వచ్చి 3వ స్థానంలో నిబడిరది. నిజానికి మరాఠీ 1971లో తొగుకంటె 0.54% తక్కువమంది మాట్లాడేవారు (7.62%) వుండేవారు. తొగు వొక్కటేకాక బంగ్లా, మరాఠీ, తమిళం, కన్నడం, మళయాళం…. అన్నీ 1971 నాటితో పోలిస్తే వాటిని మాట్లాడేవారి శాతాన్ని (మొత్తం దేశంలో గ జనాభాలో వాటివంతుని) కోల్పోతూ వున్నాయి. అందుకు గ ప్రధాన కారణం హిందీభాష వొక్కటే తన వాటాను పెంచుకో గుగుతూ వుండటం (1971లో 36.99% కాగా, 2011 జనాభా లెక్క ప్రకారం 43.63% అంటే 6.64 శాతంపైగా పెంచుకోగలిగింది. అంటే ఈ నభై సంవత్సరాలో హిందీ మాట్లాడేవారి సంఖ్య మొత్తం తొగు మాట్లాడేవారి (సుమారు) సంఖ్యతో సమానంగా పెరిగిందన్నమాట! అదే సమయంలో మిగతా భాషవారందరూ తమ తమ వాటా (శాతం)ను కోల్పోతూ వున్నప్పటికీ, అలా కోల్పోతున్న భాషలో తొగుభాష ఎక్కువ వేగంగా కిందకు దిగజారుతూ వున్నది. ఉదాహరణకు…. తొగుభాష మాట్లాడేవారు 1971 జనాభాతో పోల్చితే 2011లో 1.46% తరిగిపోగా, బెంగాలీ 0.13%Ñ మరాఠీ 0.76%Ñ తమిళం 0.82%Ñ కన్నడం 0.65%Ñ మళయాళం 1.12% తమ వాటాను కోల్పోయారు. నిజానికి తొగువారు ఆంధ్రప్రదేశ్‌ తెంగాణాలో మొదటి స్థానంలోనూ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలో రెండవ స్థానంలోనూ, మహారాష్ట్ర, ఒరిస్సాలో కూడా రెండో మూడో స్థానాల్లోనూ వుంటారు. ఒకప్పుడు మొత్తం దక్షిణాది రాష్ట్రాలో తొగు మాట్లాడేవారు సగంమంది కంటే ఎక్కువ వుండేవారు. ఉభయ తొగు రాష్ట్ర ప్రభుత్వాూ మాతృభాషయిన తొగులో పరాయి భాషను (ఉదా॥ ఇంగ్లీషును) నేర్పే శాస్త్రీయ ప్రక్రియకు బదు ఇంగ్లీషులో ఇంగ్లీషును నేర్పే తకిందు విద్యావిధానాన్ని అనుసరిస్తున్నందువన తొగువారి జనాభా శాతం తరిగిపోతోందనే పొరపాటు భావనకు చప్పున వచ్చే అవకాశం వుంది కానీ, ప్రస్తుతానికి అది ఎంతమాత్రం కారణం కాదు. ఎందుకంటే యిది తొగును రాయనూ చదవనూ వచ్చి వుండటం అనే ప్రాతిపదికన తీసుకున్న లెక్క కాదు. ఇంటిలో ఏ భాష మాట్లాడుకుంటారు అనేదే దీనికి కావసింది. అంటే మాట్లాడే భాషగా తొగు ఉభయ తొగు రాష్ట్రాల్లో తన స్థానాన్ని ఇప్పటికి నిబెట్టుకుంటూనే వుంటోందని చెప్పవచ్చు. అదే చదవనూ రాయనూ వచ్చిన వారి లెక్కు తీస్తే ఖచ్చితంగా తొగు స్థానం తొగు రాష్ట్రాలో కూడా దిగజారి వుండేది. మాట్లాడే భాషగా తన స్థానాన్ని కోల్పోవటానికి ఇంకా కొన్ని దశాబ్దా కాం పట్టవచ్చు. తొగు జనాభా శాతం తరిగిపోతూండటానికీ, హిందీ జనాభా పెరిగిపోతూండటానికి మూకారణం ఎక్కడ వుంది? అది భారతీయ కుహనా ఫెడరల్‌ వ్యవస్థలో వుంది. మనకు భాషాప్రయుక్త రాష్ట్రాయితే ఏర్పడ్డాయికానీ మైనారిటీ భాషను గౌరవించి, వాటి మనుగడకు, అభివృద్ధికీ పూచీపడే ప్రజాస్వామిక స్వయంనిర్ణయాధికార రాజ్యాు మాత్రం ఏర్పడలేదు. ఆ కారణంగా వివిధ భాషాజాతు అణచివేత స్వభావం గ, భాష ప్రజాస్వామిక స్వేచ్ఛను గుర్తించి కాపాడే, భాషా దురహంకారంలేని విశాతత్త్వంగ రాజ్యం రూపొందలేదు. మైనారిటీ భాష అభివృద్ధికి పూచీపడే ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ కొరకు తొగువారు కొంతవరకు పోరాడినప్పటికీ, మైనారిటీ భాష, జాతు బందిఖానాగానే భారతదేశం వుండిపోయింది. మెజారిటీగా వున్న (తొగు) జాతు రాజ్యాలే తమ వికాసానికి అవరోధమైన పరాయిభాషా మాధ్యమంలో విద్యను బోధించే విద్రోహకర విధానాను అనుసరిస్తున్నాయి. తొగునాట తొగుకే దిక్కులేనపుడు తమిళనాట తొగు గురించి మాట్లాడగలిగే చిత్తశుద్ధిని ఎలా ఆశించగం? ఒకప్పుడు, శ్రీనివాస రామానుజంలాంటి గణిత మేధావి, తన ప్రాథమిక విద్యను తొగు బడులో నేర్చుకున్నాడు. అదీ దక్షిణ తమిళనాడు ప్రాంతంలో ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడేనాటికి నేటి తమిళనాడులో సుమారు 40 శాతం మంది తొగు మాట్లాడేవారుండేవారు. వందలాది తొగు బడుండేవి. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో చాలామంది తొగువారు ప్రధానమంత్రుగా (అప్పుడలాగే అనేవారు) చేశారు. బహుశా మరే రాష్ట్రంలోనూ రెండవ భాష మాట్లాడే ప్రజు, తమిళనాట, కర్ణాటకలో తొగువారున్నట్లుగా అంత ఎక్కువ శాతం వుండేవారు కాదు. తమిళమూ తొగు భాషాజాతు సహజీవనం చేసే ప్రజాస్వామిక (ఎన్నికలే ప్రజాస్వామ్యమని భ్రమపడేవారికిది అర్థంకాదు) ప్రభుత్వాు ఏర్పడకపోవటం చేత భాష అణచివేత అన్నదొక విధానంగా ఒక్కొక్క రాష్ట్రంలో వొక్కొక్క రూపంలో అమవుతూ వస్తున్నాయి.
భాష అణచివేత అన్నది దక్షిణాది రాష్ట్రాలో కంటె ఉత్తరాదిన, ఇంకా చెప్పాంటే ఈశాన్య రాష్ట్రాలో ఎక్కువ వుండగా, సంఖ్యాపరంగా అనేక ఆదివాసీ భాషు అంతరించిపోయే క్రమం వేగవంతమైంది. పదివేమందికంటె తక్కువగా మాట్లాడే భాషు సంఖ్య రీత్యా చాలా ఎక్కువ వున్నాయి. అవే 2100 సంవత్సరం నాటికి చాలావరకు అంతరించి పోతాయేమోననే ఆందోళన చెందాల్సిన పరిస్థితి వుంది.
మొత్తం ప్రపంచంలోని సగం భాషు మాట్లాడే తెగు కేవం 8 దేశాలోనే ఎక్కువ వున్నారు. వాటిల్లో భారతదేశం వొకటి.
హిందీ భాష విస్తరిస్తూండటానికి అసు కారణం కూడా భాష అణచివేతలోనే వుంది. సుమారు 40కి పైగా ఉత్తరాది ప్రజ భాషకు బదు (ఉదా ॥ భోజ్‌పురీ, మాగధీ, పహాడీ, అవధి, రాజస్థానీ, ఛత్తీస్‌గడీ…… తదితరాు) సంస్కృత పదభూయిష్టమైన హిందీనే అన్ని ప్రాంతా భాషపై రుద్దగా హిందీ మాట్లాడేవారి సంఖ్య పెరిగింది. ఇటీవలే రాజస్థానీని, భోజ్‌పురీని ప్రత్యేక భాషుగా గుర్తించానే డిమాండ్‌ పెరుగుతున్నప్పటికీ, కేంద్ర పాకు పెడచెవిన పెడుతున్నారు.
ఒకవైపు స్వాతంత్య్రమనేది వచ్చి 70 సంవత్సరాలైనప్పటికీ, భారతీయ భాషలో విద్యా వైజ్ఞానిక పరిశోధనారంగాలో వాటి అభివృద్ధికి అడ్డంకు సృష్టిస్తూ, ఇంగ్లీషుని అందమెక్కించే విధానాు అనుసరిస్తూంటే మరోవైపు ఆదిమ తెగ భాష నుండి ఒకమేరకు అభివృద్ధిచెందిన తొగులాంటి భాష వరకు జాతు అణచివేతలో భాగంగా వాటి కాళ్ళమీద వాటిని బతికి బట్టకట్టకుండా చేస్తున్నారు.

admin

Related Posts

leave a comment

Create AccountLog In Your Account