ఖబడ్దార్‌! ఖబడ్దార్‌

ఖబడ్దార్‌! ఖబడ్దార్‌

— పాలేరు —

ఈ అమానుషకాండకు బవుతున్నది
ఒక సాధారణ భారత మహిళ కాదు!
130 కోట్ల భారత ప్రజు….!
ఈ మూకను చూస్తుంటే…..
‘భారతమాతను’ నడిరోడ్డులో
పట్టపగు నగ్నంగా ఊరేగిస్తూ
వేడుక చేస్తున్నట్లుంది కదూ!
‘తల్లి భారతమాత’కు కాషాయంబరధాయి
70 సం॥ వసంతోత్సవ వేడుకు
జరుపుతున్నట్లుంది కదూ!
ఆమె ఒక మహిళకాదు!
నా దేశపు స్వాతంత్య్రానికి ప్రతిరూపం
ఈ దృశ్యం….
నాదేశపు రాజ్యాంగ యంత్రాంగాన్ని
దాని ఉనికిని
నడిబజారులో ఊరేగిస్తూ ప్రదర్శిస్తున్నట్లుంది!
ఓ రాజ్యాంగ యంత్రమా!… నీకు జోహార్లు!!
ఆ కాషాయంబరధాయి ఎవరోకాదు
నా దేశపు ఫ్యూడలిజానికి సామ్రాజ్యవాదానికి కలిగిన అక్రమ సంతానమే!! నా దేశంలో ఫ్యూడలిజం రద్దయిందని ఏ కబోదిరా చెప్పింది?? ఓ రాజ్యాంగ యంత్రమా! ఈ కాషాయంబరధారు ‘‘పాదస్పర్శతో’’ నీ దేహం పునీతమైనదనుకుంటా! కాషాయ వస్త్రా దేశభక్తిని ఎంతని చాటను?! ఆటవిక, సనాతన ధర్మాకు, దుశ్శాసనుకు వారసు వీరు వీరి వికటాట్టహాసం నా దేశపు మహిళాలోకం మీద ప్రగతిశీ, ప్రజాతంత్రవాదు గుండెపై తన్నుతున్నట్లుగాలేదూ!! వీరు ఒక స్త్రీ గర్భకుహరంలో జీవం పోసుకోలేదు! ఆటవిక, ఫ్యూడల్‌ సామ్రాజ్యవాద
సాంస్కృతిక ‘కళామతల్లి’
గర్భంలోంచి పుట్టిన
వికారపు జీవు!
వీరే ‘ఆ తల్లికి’ ముద్దుబిడ్డు
‘భారతమాతకు’ కాదు!
ఛీ! నీచులారా!!
భారతదేశ అంగాంగాన్ని ప్రపంచ విపణిలో
అమ్మకానికి పెట్టిన మీకు
భారత స్త్రీని నగ్నంగా నడిబజారులో
తన్నుకుంటూ ఊరేగించటం
ఒక లెక్క కాదు!
మీ సాంస్కృతిక, సాంప్రదాయిక
వినోదపు క్రీడల్లో ఇదొక భాగం అని
మీ గురించి ఇంకా తెలియని ఈలోకానికి
దిమ్మతిరిగేటట్లు చాటి చెప్పారు!
నా దేశపు మహిళ
తల్లి గర్భంలో జీవంపోసుకున్నప్పటి నుంచి
నెలు నిండి భూమిమీద పడి తనువు చాలించేవరకు అడ్డు అదుపులేని, ఎడతెగని
మూకుమ్మడి అత్యాచారాకు ఆపై హత్యకు పట్టపగు నడిబజారుల్లో సజీవదహనాకు అమ్మకాకు.......... ఇదమ్మా! మహా ఘనతవహించిన ఒక ‘మహాత్ముని’ సారధ్యంలో భించిన మేడిపండు స్వాతంత్య్రపు లోగుట్టు! మూకుమ్మడి అత్యాచారాకు మత్తెక్కించి జరిపే అత్యాచారాకు ఆపై చేసే కిరాతక హత్యకు ఢల్లీి, కాశ్మీర్‌ (నిర్భయ, ఆసిఫా) ప్రయోగశాలో పురుడు పోసుకుని దేశమంతటా అంటువ్యాధిలా విస్తరిస్తోంది భారత రాజ్యాంగం సాక్షిగా.... నేడు ఈ ఫార్ములాు దేశమంతటా సర్వ సాధారణమయ్యాయి! ఇప్పుడీ ఘటనను ఒక ఫార్ములాగా మార్చకముందే అణచబడ్డ మహిళంతా తిరగబడతారు! ఫ్యూడల్‌ సామ్రాజ్యవాదపు
విషపు కోరను విరిచివేస్తారు
ఫ్యూడల్‌ ` సామ్రాజ్యవాద విషసంస్కృతీ సంతానమా!
ఖబడ్దార్‌! ఖబడ్దార్‌!!

(సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న ఘటనపై స్పందన)

admin

leave a comment

Create AccountLog In Your Account