కామ్రేడ్ వరవరరావు అరెస్టును ఖండిస్తున్నాం
నమ్మశక్యంకాని ఒక హాస్యాస్పదమైన కుట్రకేసును మోపి కామ్రేడ్ వరవరరావుని మహారాష్ట్ర పోలీసు హైదరాబాదు నుండి పూనాకు తరలించడాన్ని జనసాహితి ఖండిస్తోంది. ఈ కుట్రకేసు పేరుతో ఇప్పటికే రెండున్నర నెలుగా వరవరరావుని, మరో నుగురు ప్రజాస్వామిక వాదును హౌస్ అరెస్టులో వుంచారు.
దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీని హత్య చేయటానికి, సుదీర్ఘ సాహిత్య, సామాజిక కార్యకర్తగా వుంటూ వచ్చిన వరవరరావు, మరో నుగురు సుప్రసిద్ధ సామాజిక కార్యకర్తయిన వెర్నన్ గొజాల్వెజ్, గౌతమ్ నవఖా, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరాతో కలిసి కుట్ర పన్నినట్లు నమ్మశక్యంకాని ఆధారాతో ఆరోపణు చేసి ‘ఉపా’ అనే పరమ నిరంకుశ చట్టం క్రింద ఈ అరెస్టు చేశారు. నాుగున్నర ఏళ్ల మోడీ ప్రభుత్వపు ప్రజ జీవన సంస్కృతుపై మతోన్మాద దాడుూ, నిరంకుశ అణచివేత విధానాూ, పీడిత ప్రజపై దాడుూ, అనేక ప్రజా వ్యతిరేక విధానాూ బహిర్గతమై తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పరిస్థితులో, ప్రజల్ని, ఉద్యమాల్ని పక్కదారి పట్టించడానికి ఫాసిస్టు తరహా కుట్ర కేసును ఆశ్రయిస్తోంది. వరవరరావు తదితరుపై మోపిన తప్పుడు కేసును ఉపసంహరించుకోమని మహారాష్ట్ర, కేంద్రప్రభుత్వాను డిమాండ్ చేస్తోంది. ` జనసాహితి