ఊరు – పేరు

— చావలి శ్రీనివాస్ —

వాండ్రంగి కొండరావుగారు ‘ఊరు – పేరు’ (ఆంధ్రప్రదేశ్‌)తో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల్లో చాలా గ్రామాకు పట్టణాకు ఆ పేర్లు ఎలా వచ్చాయి అనే అంశంపై చాలా శ్రమ తీసుకుని ఈ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం రాయడంలో రచయిత వివిధ గ్రామాకు, పట్టణాకు చారిత్రక ఆధారాు ఆధారంగా, ఆయా ప్రాంతాల్లో ఉండే ఆచారాపరంగా, ఇతిహాసాు, పురణాపరంగా ఆయా ఊర్లకు పేర్లు పెట్టారని పేర్కొన్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సామాజికవర్గాపరంగా, వృక్షాపేర్లుతో, రంగుపేర్లతో, పశువుపేర్లతో కూడా ఉన్నాయి. రచయిత జిల్లావారీగా ఆయా గ్రామా పట్టణా పేర్లు ఎలా ఏర్పడ్డాయో వివరించడం అద్భుతంగా ఉంది. ఆయా గ్రామా పేర్లు ఏర్పడడంలో ప్రచారంలో ఉన్న కధను కూడా సేకరించి వివరించారు రచయిత. ‘పిట్టచూపు’ అనే ప్రారంభ అధ్యాయంలో రచయిత ఊర్ల పేర్లకి సంబంధించిన వివరాు సేకరించడంలో పడిన కృషిని వివరిస్తూ చాలా విషయాు చర్చించారు. ఈనాడు బ్రతుకుతెరువు కోసం తమ గ్రామాను, ఊర్లను వదిలేసి ప్రజు వస వెళుతున్న సందర్భంలో వారి గ్రామాను శాశ్వతంగా మర్చిపోయే పరిస్థితి ఏర్పడిరది. అంతేకాకుండా వివిధ ప్రాజెక్టు పేరుతో గ్రామాు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో గ్రామా చరిత్ర, సంస్కృతి నేపథ్యాన్ని నమోదు చేయడం అనేది చాలా గొప్ప విషయం. భవిష్యత్తు తరా వారికి తమ భౌగోళిక ప్రాంతాకు ఆ పేర్లు ఎలా వచ్చాయి తొసుకునే పరిస్థితి దాదాపు ఉండకపోవచ్చు. అటువంటి సందర్భంలో ఈ పుస్తకాన్ని వ్రాయడంలో ఎంతో చారిత్రక అవసరం కూడా ఇమిడి ఉంది. ఆయా ఊర్ల పేర్లు ఏర్పడడం గురించి రచయిత వివరిస్తూ ఆ విషయాు ఎక్కడ సేకరించబడ్డాయి. ఎవరు చెప్పారు, చారిత్రక నేపథ్యం, పురాణ ఇతిహాసా నేపథ్యాన్ని వివరించారు. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో కళింగ పట్టణం గూర్చి వివరిస్తూ రచయిత ఈ ప్రాంతాన్ని రాయకళింగ గంగు అనే రాజు పరిపాన కాంలో నిర్మించినట్లు నమోదు చేశారు. ఆ ప్రాంతంలో ఆయాు ఎవరు నిర్మించారో కూడా తెలియజేశారు. ఉదాహరణకు కళింగపట్నంలో మహమ్మద్‌ రజాక్‌ హయాంలో నిర్మించినట్లుగా చెప్పబడుతున్న ఆ చెరువును ఇప్పటికి కూడా మహమ్మద్‌ రజాక్‌ పేరుతో పిుస్తున్నట్లు గ్రామ పెద్ద పొట్నూరు కృష్ణమూర్తి చెప్పారని, ప్రస్తుతం కళింగపట్నం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని, కళింగ పట్నంలో ఉన్న దీపస్తంభం యొక్క ప్రయోజనం కూడా వివరించారు. అలాగే చాలా గ్రామాకు పాలెం, నగరం, పేట, పుట్టుగ, వరంపల్లె వంటి పదాతో కూడిన పేర్లు రావటాన్ని కూడా రచయిత ఒక క్రమపద్ధతిలో వివరించారు. పుస్తకం చివరలో రచయిత ఊరి పేర్లతో ప్రసిద్ధి చెందినవి అంటూ మందస కోవా గురించి, నంద్యా ఆముదం గురించి ఇలా ఊరి పేర్లతో ప్రసిద్ధి చెందిన అంశా గురించి సవివరంగా నమోదు చేశారు. ఈ పుస్తకం చరిత్రను మరియు భౌగోళిక అంశాను అధ్యయనంచేసే పరిశోధక విద్యార్థుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే ఈ పుస్తకం పూర్తి చరిత్ర అధ్యయనానికి సంబంధించినదిగానో లేదా పురాణ సాంస్కృతిక ఇతిహాసాకు సంబంధించినదిగానో, ప్రజ నమ్మకాకు సంబంధించిందిగానో చెప్పలేము. ఎందుకంటే రచయిత పురాణ ఇతిహాస విషయాను చారిత్రక విషయాను భౌగోళిక విషయాను కగలిపి రాశారు. ఈ పుస్తకంలో ప్రజ విశ్వాసాు పురాణ ఇతిహాసా అంశాను కూడా కపడం వన ఈ పుస్తకం పూర్తి పరిశోధక గ్రంథóంగా రూపుదిద్దుకోలేకపోయింది. అయినప్పటకీ రచయిత కృషిని కొనియాడకుండా ఉండలేము. ఈ పుస్తకంలో ప్రస్థావించిన అంశా సేకరణలో, వాటిని నమోదుచేయడంలో రచయిత కృషి అనన్య సామాన్యమైనది. చారిత్రక మరియు పరిశోధక అంశాను శిలా శాసనాను ఆయా ప్రాంతాకు సంబంధించిన చారిత్రక విషయాను పరిగణనలోకి తీసుకుని ఈ పుస్తకాన్ని రాసివుంటే ఇది గొప్ప చారిత్రక పరిశోధన గ్రంథంగా తయారయ్యేది. ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో ముద్రించారు. ముఖచిత్రాన్ని మణిపాత్రుని నాగేశ్వరరావుగారు చిత్రించారు. 

పుస్తకం వె : 100 రూపాయు.
ప్రతుకు : వాండ్రంగి రమాదేవి, ఔ/శీ కొండరావు, కొండవీధి, పొందూరు ` 532168. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌. ఫోన్‌ : 94905 28730, 94905 95391

admin

leave a comment

Create AccountLog In Your Account