ఉద్దానమా

ఉద్దానమా

— నగిరి కరుణాకర్ —

ఉద్దానమా.. ఉద్దానమా…. ఉద్దానమా
ఏది నీ అందామమ్మా….. ఉద్దానమా
ఉద్దానము ఉద్దానము ఉద్దానము
ఏడ నీ సింగారాము ఉద్దానము
ప్రకృతి నీపై పగ పట్టినాదా
తిత్లి తుఫానై కాటేసినాదా
నీ కళ్ళ మెగులేని ఉద్దానమా
మోము పై సిరునవ్వేది ఉద్దానమా ॥ ఉద్దానమా ॥

1చ : కావిళ్ళతోటి నీరు మోసుకొని
జీడిమామిళ్ళను పెంచండంటివి
కష్టంలోను నష్టంలోను
పెద్ద దిక్కుగా పక్కనుంటివి
ప్రకృతి నీపై పగబట్టినాదా
తిత్లి తుఫానై కాటేసినాదా
నీ వెన్ను యిరిగిపోయిందా…. ఉద్దానమా
నీ వన్నె వాడిపోయిందా….. ఉద్దానమా ॥ ఉద్దానమా ॥

2చ : కరువు కాంలోనే సాయమందించే
అరటిమునగ సీతాఫలాు
ప్లి చదువుకి చేయూతనిచ్చి
చ్లంగా జూసే కొబ్బరిచెట్లు
ప్రకృతి నీపై పగబట్టినాదా
తిత్లి తుఫానై కాటేసినాదా
కుమిలి కుమిలి నేనేడుస్తునాను….. నా ఉద్దానమా
ఇరవై యేండ్లు వెనక్కి పోయావా…. నా ఉద్దానమా

3చ : అప్పులెన్నో తీర్చి ఆపదలో నిలిచావు
పేదోడికి నీవు పెన్నిధయ్యావు
నీ నీడనుంటే ఆదరించావు
జబ్బొస్తే జొరమొస్తే కాపాడావు
ప్రకృతి నీపై పగబట్టినాదా
తిత్లి తుఫానై కాటేసినాదా
నిువ నీడ లేకపోయెనమ్మా…. ఉద్దానమా
నీకు తోడు ఎవరు రాకపోయెనమ్మా…. ఉద్దానమా ॥ ఉద్దానమా ॥

4చ : నిన్ను చూసేందుకు నాయకులొచ్చారు
మంచి మంచి వాగ్దానాలిచ్చారు
ఓటు కోసం సీటు కోసం
మాటతోటి గారడి చేసారు
గమ్మత్తుగా నిన్ను బుట్టలో వేసారు
ఎంతకాం నీవు మోసపోతావమ్మా…. నా ఉద్దానమా
ఎదురుతిరిగి నీవు పిడికిలెత్తమ్మా…. నా ఉద్దానమా

admin

leave a comment

Create Account



Log In Your Account