Related Posts
— పి. విశ్వనాథం —
గోర్కీ ‘‘అమ్మ’’ ఒక విప్లవ కెరటం!
నిద్రమత్తును వదిలించే సూర్యకిరణం
మన బ్రతుకింతే అనే భ్రమను చెరిపేది
‘‘అమ్మ’’ పిడికిలి
లేత పిడికిళ్ళతో
పుట్టిన మరుక్షణమే పోరాటం చేసే మనం
ఈ బానిస బతుకుల్ని భరించరాదని
ఆఖరి శ్వాస వరకూ
పోరాడుతూనే ఉండాన్నదే
గోర్కి ‘‘అమ్మ’’ స్ఫూర్తి!
విప్లవ కార్యకర్తగా
విప్లవ కాగడాగా!
పోరాటయోధునిగా
ఎన్ని అడ్డంకు వచ్చినా
బూర్జువా ప్రభుత
ఎన్ని కుట్రు పన్నినా
కష్టా కొలిమిలోకి నెట్టినా
నమ్మిన ఆశయం కోసం
చివరి క్షణం వరకూ పోరాడుదాం!
అనే నమ్మకం, మనో ధైర్యం గోర్కి ‘‘అమ్మ’’
ప్రజకు ప్రేరణ,
కష్టా సంకెళ్ళను ఛేదించే కృషి
గోర్కీ ‘‘అమ్మ’’.
‘‘నమ్మిన ఆశయం కోసం నడుం బిగించి
మెగు కోసం ఎదురు తిరుగుతారు జనం’’
అది గోర్కి ‘‘అమ్మ’’ శాశ్వత సత్యం
మార్క్సిజాన్ని నవగా
పోరాటానికి అమ్ముపొదిగా
మాక్సిమ్ గోర్కీ ‘‘అమ్మ’’
` పి. విశ్వనాథ్